మెరైన్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? కెరీర్ ఏవిధంగా ఉంటుంది?
-రామారావు, విశాఖపట్నం
A. ఇటీవల కాలంలో మెరైన్ కెమిస్ట్రీకి డిమాండ్ బాగా పెరుగుతోంది. సముద్ర ఆహారం, సముద్ర ఆధారిత ఔషధాలు, సముద్ర జలాల కలుషితం, చమురు- ఖనిజాన్వేషణ, తదితర కారణాల వల్ల మెరైన్ కెమిస్ట్రీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెరైన్ బాడీల తయారీలో ఉపయోగించే కెమికల్స్, సముద్ర జీవులు, వాతావరణంపై కెమికల్స్ ప్రభావం వంటి అంశాలను మెరైన్ కెమిస్ట్రీలో చర్చిస్తారు.
మెరైన్ కెమిస్ట్రీని కెమికల్ ఓషనోగ్రఫీ అని కూడా అంటారు. ఇందులో పరిశోధనాత్మక కార్యకలాపాల పరిధి ఎక్కువగా ఉంటుంది. మెరైన్ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారిని మెరైన్ కెమిస్ట్‌లుగా వ్యవహరిస్తుంటారు. వీరు సముద్ర గర్భంలో పరిశోధనలు చేయడం, సంబంధిత డేటా సేకరించడం, దాన్ని విశ్లేషించడం వంటి విధులను నిర్వహిస్తుంటారు.
ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే మెరైన్ కెమిస్ట్రీ లేదా అనుబంధ కోర్సులో పీజీ చేయాలి. ఈ రంగంలో ఎక్కువగా పరిశోధనలు, ఫీల్డ్ వర్క్ అంశాలు ఉంటాయి తదనుగుణంగా స్కిల్స్ ఉంటేనే ఈ రంగంలో రాణించవచ్చు. ఈ క్రమంలో అభ్యర్థులకు సహనం, ఓర్పు, కాలంతో నిమిత్తం లేకుండా పని చేసే సామర్థ్యం ఉండాలి.
మెరైన్ కెమిస్ట్రీ అభ్యర్థులకు సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- భావ్‌నగర్, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్- గోవా, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్- మైసూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ- చెన్నై వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రైవేట్ రీసెర్‌చ ఆర్గనైజేషన్‌స కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి. వీటిల్లో సైంటిస్ట్‌గా లేదా వివిధ హోదాల్లో అవకాశాలు లభిస్తాయి.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
అన్నామలై యూనివర్సిటీ
కోర్సు: ఎంఎస్సీ (మెరైన్ కెమిస్ట్రీ)
అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ.
వివరాలకు: http://annamalaiuniversity.ac.in
యూనివర్సిటీ ఆఫ్ గోవా
కోర్సు: ఎంఎస్సీ (మెరైన్ సైన్స్ విత్ మెరైన్ కెమిస్ట్రీ)
వివరాలకు: www.unigoa.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
కోర్సు:ఎంఎస్సీ(కెమిస్ట్రీ,మెరైన్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌గా)
వివరాలకు: www.andhrauniversity.info
n తర్వాత ఆసక్తి ఉంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ-గోవా వంటి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి పీహెచ్‌డీ చేయొచ్చు.
Q. ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించడానికి కావలసిన అర్హతలు? - రచన, అసిఫాబాద్
A. ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ముందుగా ఆ రంగంలో శిక్షణ తీసుకోవాలి. దేశంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఎయిర్‌హోస్టెస్ శిక్షణను అందిస్తున్నాయి. శిక్షణలో చేరేందుకు వయసు, ఎత్తు, బరువు విషయంలో కొన్ని పరిమితులున్నాయి. ఆకర్షణీయమైన రూపం, సాధారణ కంటి చూపుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషలను ధారాళంగా మాట్లాడాలి. వీటితోపాటు ఏదైనా విదేశీ భాషలో ప్రావీణ్యం ఉంటే అదనపు ప్రయోజనంగా ఉంటుంది. ప్రాథమిక అర్హతలు..
వయసు 18-24 ఏళ్లు.
ఎత్తు 160 సెం.మీ.
ఇంటర్మీడియెట్ (10+2) ఉత్తీర్ణత.
ఎయిర్ హోస్టెస్ శిక్షణ ను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
{ఫాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ - సికింద్రాబాద్.
వివరాలకు: www.frankfinn.com
కేతన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్.
వివరాలకు: www.ketansinstitute.com
ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ -
హైదరాబాద్.
వివరాలకు: http://aptechaviationacademy.com
Q. పలంటాలజీ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి? - మదన్, మహబూబాబాద్
A. పలంటాలజీ అంటే శిలాజ అధ్యయన శాస్త్రం. దీనిలో చరిత్ర పూర్వకాల అధ్యయనంతోపాటు శిలాజాల అధ్యయనం వంటి అంశాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. ఎలాంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమి పరిణామం చెందింది అనే విషయాలను గురించి వివరిస్తుంది. బయాలజీ, జియాలజీ, ఆర్కియాలజీల అంశాలను వివరించే మల్టీడిసిప్లినరీ కోర్సుగా పలంటాలజీని పేర్కొంటారు.
ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్
కోర్సు: అప్లయిడ్ జియాలజీ(పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా)
అర్హత: 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
{పవేశం: ఎంట్రెన్స్ ఆధారంగా
వివరాలకు: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
కోర్సు: ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ(టెక్-అప్లయిడ్ జియాలజీ, (పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా)
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
{పవేశం: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
వివరాలకు: www.andhrauniversity.info
జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-హైదరాబాద్, సంబంధిత రంగంలో ప్రొఫెషనల్ శిక్షణను కూడా అందిస్తుంది.
Q. మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి?
- రాజేశ్, కరీంనగర్
A. లోహ సంగ్రహణం, ప్రాసెసింగ్, సంబంధిత అంశాల గురించి మెటలర్జీ ఇంజనీరింగ్ వివరిస్తుంది. ఈ బ్రాంచ్‌తో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి. వీరికి టాటా స్టీల్స్, సెయిల్, నాల్కో, స్పాంజ్ ఐరన్ లిమిటెడ్, హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, ఇస్రో, డీఆర్‌డీఓ, ఇండియన్ రైల్వేలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. వీటిల్లో సేఫ్టీ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్, ప్లానింగ్ ఇంజనీర్, వెల్డింగ్ ఇంజనీర్, ప్లాంట్ ఎక్విప్‌మెంట్ ఇంజనీర్‌గా లేదా రీసెర్చె ర్‌గా, కన్సల్టెంట్ వంటి హోదాల్లో అవకాశాలు లభిస్తాయి.
Q. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ మహిళా అభ్యర్థులకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -దీపిక, మదిర
A. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ మహిళా అభ్యర్థులకు కెరీర్ పరంగా చక్కని అవకాశాలున్నాయి. వివరాలు..
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ బ్రాంచ్‌లో పనిచేయడానికి బీటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన మహిళలకు అవకాశం ఉంటుంది. వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ముందుగా ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ను రాయాలి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండే ఈ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ ఎవేర్‌నెస్, మిలటరీ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఇంటలిజెన్స్ టెస్ట్ (స్టేజ్- 1), సైకలాజికల్ టెస్ట్-గ్రూప్ టెస్ట్-ఇంటర్వ్యూ (స్టేజ్- 2) దశలను అధిగమిస్తే నియామకం ఖరారవుతుంది.
వివరాలకు: www.careerairforce.nic.in
ఇండియన్ నేవీ: ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ బ్రాంచ్ ద్వారా ఎడ్యుకేషన్, లాజిస్టిక్ వంటి విభాగాల్లో మహిళలకు అవకాశాలను కల్పిస్తుంది. మల్టిపుల్ టెస్ట్స్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలకు: https://nausena-bharti.nic.in
No comments:
Post a Comment