సుగర్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
-శ్రవణ్, విశాఖపట్నం.
పలు రకాల బయోకెమికల్ విధానాల కలయికతో సుగర్ టెక్నాలజీ రూపొందుతుంది. పీజీ స్థాయిలో సుగర్ టెక్నాలజీ కోర్సులో సుగర్ కెమిస్ట్రీ, బాయిలింగ్, ఫెర్మిటేషన్, సుగర్ ప్రొడక్షన్‌కు సంబంధించిన టెక్నిక్‌లు ఉంటాయి. అంతేకాకుండా సుగర్ బాయిలింగ్, ఇండస్ట్రియల్ ఫెర్మిటేషన్, ఆల్కహాల్ టెక్నాలజీ, సుగర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, తదితర అంశాల్లో స్వల్పకాలిక కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
నేషనల్ సుగర్ ఇన్‌స్టిట్యూట్-కాన్పూర్.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సుగర్ టెక్నాలజీ
అర్హత: బీఈ/బీటెక్ (కెమికల్ ఇంజనీరింగ్) లేదా బీఎస్సీ (ఎంపీసీ)
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సుగర్ ఇంజనీరింగ్
అర్హత: బీఈ/ బీటెక్ (మెకానికల్/ ప్రొడక్షన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)/ తత్సమానం.
కోర్సు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సుగర్ ఇంజనీరింగ్
అర్హత: డిప్లొమా (మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)
వివరాలకు: http://nsi.gov.in
మన రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా స్థాయిలో కెమికల్ ఇంజనీరింగ్ (సుగర్ టెక్నాలజీ) కోర్సు అందుబాటులో ఉంది. పాలిసెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. అర్హత: 10వ తరగతి. ఈ కోర్సు తర్వాత కెమికల్/పెట్రో కెమికల్/పెట్రోలియం బ్రాంచ్‌లతో బీటెక్ చేయొచ్చు.
బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సు వివరాలను తెలపండి?
-సరళ, కరీంనగర్.
మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికతో రూపొందిన కోర్సు బయోఇన్ఫర్మాటిక్స్. వివరంగా చెప్పాలంటే.. స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అనువర్తనాలను మాలిక్యులర్ బయాలజీ విభాగంలోని పరిశోధనలు, ఆవిష్కరణల్లో ఉపయోగించే శాస్త్రం బయోఇన్ఫర్మాటిక్స్. ఇందులో సంబంధిత డేటా సేకరణ, నిర్వహణ, అధ్యయనం, విశ్లేషణ, తదితర అవసరాల కోసం కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధంగా సేకరించిన బయాలజికల్ డేటాను మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉద్దేశించిన పరిశోధన కోసం వినియోగిస్తారు. బయోఇన్ఫర్మాటిక్స్‌కు సంబంధించి మన రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ స్థాయిలో మాత్రం బీఎస్సీ/బీటెక్ కోర్సుల్లోని బయోటెక్నాలజీ సబ్జెక్ట్‌లో ఒక భాగంగా బయోఇన్ఫర్మాటిక్స్‌ను అధ్యయనం చేయవచ్చు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఐఐఐటీ-హైదరాబాద్; వివరాలకు: www.iiit.ac.in
సెంట్రల్ యూనివర్సిటీ-హైదరాబాద్
వివరాలకు: www.uohyd.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వివరాలకు: www.andhrauniversity.edu.in
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఫర్ ఉమెన్-హైదరాబాద్
వివరాలకు: www.oucwkoti.ac.in
అడ్వర్‌టైజ్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను వివరించండి?
-రాజ వర్ధన్, నల్గొండ.
ప్రజలలో తమ ఉత్పత్తుల ప్రచారానికి చక్కటి మార్గం అడ్వర్‌టైజ్‌మెంట్. సృజనాత్మకత, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ప్రజల అభిరుచి - ఆసక్తి సంబంధిత అంశాలపై అవగాహన, ప్రత్యేక టెక్నికల్ స్కిల్స్, చక్కని భావ వ్యక్తీకరణ ఉన్నవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు.
అడ్వర్‌టైజ్‌మెంట్ రంగంలోని వివిధ విభాగాల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలున్నాయి. సంబంధిత అంశంలో షార్ట్ట్‌టర్మ్ కోర్సులు లేదా డిప్లొమా/ మల్టిమీడియా కోర్సులు చేయడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించొచ్చు. బ్యాచిలర్ స్థాయిలో జర్నలిజం, ఆర్ట్స్, మాస్ మీడియా సంబంధిత అంశాల్లో డిగ్రీ చేసిన వారు కూడా ఈ రంగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. అటు తర్వాత ప్రస్తుత ట్రెండ్‌కనుగుణంగా స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకుంటూ వెళితే స్వల్ప కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ కమ్యూనికేషన్స్, బెంగళూరు- బీఎస్సీ(విజువల్ కమ్యూనికేషన్స్), డిప్లొమా ఇన్ డిజైన్ (అడ్వర్‌టైజింగ్ స్పెషలైజేషన్‌గా) కోర్సులను అందిస్తుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులు. మాస్టర్ స్థాయిలో ఎంఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.nicindia.org
సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్-పుణే, ఎంబీఏ (మీడియా కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్, పీఆర్-బ్రాండ్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌గా) కోర్సును ఆఫర్ చేస్తుం ది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.simc.edu
మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్, భోపాల్- ఎంఏ (అడ్వర్‌టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
వెబ్‌సైట్: www.mcu.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్- ముంబై, పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్‌టైజింగ్, మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
వెబ్‌సైట్: www.niemindia.com

No comments:
Post a Comment