గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ప్రపంచం పరుగులు తీస్తున్న తరుణం.. బహుళ జాతి సంస్థలు అన్ని దేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న సమయం.. విద్యార్థులు లక్షల్లో వేతనాలు అందించే కోర్సులవైపు దృష్టిసారిస్తున్న సందర్భం.. అయితే విద్యార్థులు కొంత దూరదృష్టితో ఆలోచిస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభం చేకూర్చే కోర్సులు.. గ్రామీణాభివృద్ధి కోర్సులు అంటున్నారు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ ప్రాజెక్ట్ డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ హెడ్ డాక్టర్ ఎస్.ఎం.ఇలియాస్. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా కృషిచేస్తున్న ప్రస్తుత తరుణంలో.. గ్రామీణాభివృద్ధి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు గోల్డెన్ కెరీర్ ఖాయం అంటున్న ఇలియాస్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
గ్రామీణాభివృద్ధి తప్పనిసరి
వందకోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశంలో.. అత్యధిక శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలే. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పేరుతో ఎన్ని బహుళ జాతి సంస్థలు అడుగుపెట్టినా.. దేశం ప్రగతి పథంలో సాగాలంటే ముందుగా గ్రామీణాభివృద్ధి జరగాలి. గ్రామీణప్రాంత ప్రజలు ఈ ప్రపంచీకరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం సొంతం చేసుకోవాలి. పల్లె ప్రజలకు ప్రస్తుత పరిస్థితులపై అవగాహన, అందుకు తగినవిధంగా స్వయం సాధికారత సాధించే ఆత్మవిశ్వాసం నెలకొల్పాలి. ఇది సాధ్యం కావాలంటే.. సరైన మార్గనిర్దేశనం అవసరం. అలా మార్గనిర్దేశనం చేసే కోర్సులే.. గ్రామీణాభివృద్ధి కోర్సులు. ఆ దిశగా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులకు రూపకల్పన చేసింది.
ప్రస్తుతం మూడు కోర్సులు
ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి రెసిడెన్షియల్ విధానంలో పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సు, దూర విద్యా విధానంలో పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాం. ప్రతి కోర్సు కాల వ్యవధి సంవత్సరం. రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు కోర్సు పూర్తయ్యేవరకూ తప్పనిసరిగా ఎన్‌ఐఆర్‌డీ క్యాంపస్‌లోని హాస్టల్‌లోనే నివసించాలి. ఇప్పటికే ఆయా ఉద్యోగాలు చేస్తూ.. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి కలిసొచ్చే కోర్సులు.. దూర విద్యా విధానంలో అందిస్తున్న రెండు కోర్సులు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పరిధిలోని పలు గ్రామీణాభివృద్ధి పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉన్నతికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
వినూత్నంగా పీజీడీఆర్‌డీఎం
ఎన్‌ఐఆర్‌డీ రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత ఏదైనా విభాగంలో డిగ్రీ. బోధన, కరిక్యులం పూర్తి వినూత్నంగా ఉంటుంది. ఈ కోర్సు కాల వ్యవధి ఏడాది. బ్యాచ్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థులను నేరుగా క్లాస్‌రూంలో కూర్చోపెట్టకుండా.. ముందుగా అయిదు రోజులు ఫీల్డ్ విజిట్ పేరిట నిర్దిష్ట గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తాం. అయిదు రోజుల తర్వాత విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో తాము తెలుసుకున్న సమస్యలు, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచే క్లాస్ రూం బోధన మొదలవుతుంది. అదేవిధంగా ఏడాది వ్యవధిగల కోర్సులో 45రోజులపాటు ఫీల్డ్ విజిట్ పేరుతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్‌వర్క్ కూడా తప్పనిసరి. ఇలాంటి బోధన ఫలితంగా కోర్సు పూర్తిచేసుకునే సమయానికి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణత లభిస్తుంది.
ఎన్‌ఐఆర్‌డీలో ప్రవేశం పొందాలంటే
ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి స్థాయిలో అందిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంకు ప్రతి ఏటా డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తాం. ఇక.. దూర విద్యా విధానంలో అందించే రెండు కోర్సుల్లో ఒకటైన పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తాం. మరో కోర్సు పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు ఎన్‌ఐఆర్‌డీనే నేరుగా ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తుంది. సాధారణంగా వీటికి నోటిఫికేషన్ అక్టోబర్ లేదా నవంబర్‌లో వెలువడుతుంది.
ఎంఎన్‌సీలకు దీటుగా ప్లేస్‌మెంట్స్
కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు క్యాంపస్‌లోని ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. వీటిలో విద్యార్థులకు అద్భుత అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో.. పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఈ కోర్సు విద్యార్థులను నియమించుకుంటున్నాయి. ఈ క్రమంలో 2012-13 వరకు ఈ కోర్సు సర్టిఫికెట్లు అందుకున్న అయిదు బ్యాచ్‌ల 250 మంది విద్యార్థుల్లో.. ప్రతి ఒక్కరికి ప్లేస్‌మెంట్స్ లభించాయి. ప్రారంభంలో కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనాలు అందుకున్న విద్యార్థులు కూడా ఉన్నారంటేనే ఈ కోర్సుకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆదరణకు కొదవ లేదు
పీజీడీఆర్‌డీఎం కోర్సు విషయంలో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. బీటెక్, ఎంబీఏ, లా తదితర ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తిచేసుకుని పలు ఎంఎన్‌సీల్లో ఉద్యోగాలు వదిలేసి.. ఈ కోర్సులో చేరిన విద్యార్థులుండటమే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా కేవలం 50 మందికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ కోర్సులో చేరడానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే గ్రామీణాభివృద్ధి, సంబంధిత రంగంలో అకడెమిక్ కోణంలో ఆలోచించే విద్యార్థులకు సోషియాలజీ, సోషల్‌వర్క్, ఆంత్రోపాలజీలే వేదికలుగా మారాయి. వాస్తవానికి అవి కూడా రూరల్ డెవలప్‌మెంట్ సంబంధితమైనప్పటికీ వాటిలో పూర్తిస్థాయిలో అవగాహన లభించడం సాధ్యం కాదు. కాబట్టి రూరల్ డెవలప్‌మెంట్ కోర్సుల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తిస్థాయిలో ఈ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలుసుకుని వాటిలో ప్రవేశించడం మంచిది.
యూనివర్సిటీలు కూడా చొరవ చూపాలి
గ్రామీణాభివృద్ధి కోర్సుల రూపకల్పనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు, ఇతర గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు కూడా చొరవ చూపాలి. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా ఇటీవల ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ కోర్సుల రూపకల్పన చేస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ దిశగా యూనివర్సిటీలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే శ్రీకాకుళంలోని డాక్టర్॥బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ.. ఎన్‌ఐఆర్‌డీ కొలాబరేషన్‌తో కోర్సును ప్రారంభించేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభించింది. అదే విధంగా ఒడిశాలోని బరంపూర్ యూనివర్సిటీ కూడా సంప్రదించింది. ఇదే తరహాలో ఇతర యూనివర్సిటీలు కూడా అడుగులు వేస్తే బాగుంటుంది. ఎన్‌ఐఆర్‌డీ అనేది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ. అన్ని ప్రాంతాల్లో క్యాంపస్‌లు, కోర్సులు రూపకల్పన చేయడం క్లిష్టమైన ప్రక్రియ. అయితే పరస్పర సహకారంతో కోర్సులు అందిస్తామనే ఇన్‌స్టిట్యూట్‌లకు మేం తప్పక సహకరిస్తాం.
మరో విశిష్టత.. ఎన్‌ఐటీ ఇటానగర్‌లో ఎంటెక్
అకడెమిక్ పరంగా ఎన్‌ఐఆర్‌డీ చేపట్టిన మరో ముఖ్య కార్యక్రమం.. ఎన్‌ఐటీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)-ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్)తో ఒప్పం దం కుదుర్చుకుని ఎంటెక్(అప్రాప్రియేట్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాక్టీసెస్) కోర్సును రూపొందించాం. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సు మొదలైంది. టెక్నాలజీని రూరల్ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేస్తూ ఇలాం టి కోర్సును ప్రారంభించడం దేశంలోనే తొలిసారి. ఇలా ఎన్‌ఐఆర్‌డీ వీలైనంత మేర అన్ని విభాగాల్లో రూరల్ డెవలప్‌మెంట్‌ను అకడెమిక్ స్థాయిలోనే విస్తృతం చేసి తద్వారా భవిష్యత్తులో దేశ ప్రగతికి చేయూతనందించేందుకు కృషి చేస్తోంది.
షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సుల దిశగా ఆలోచన
ఎన్‌ఐఆర్‌డీ దీర్ఘకాలిక కోర్సులతోపాటు స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించే దిశగానూ ఆలోచిస్తోంది. ముందుగా మూడు నెలల వ్యవధిలో పావర్టీ ఎరాడికేషన్ మేనేజ్‌మెంట్, జీఐఎస్-ఐసీటీ అప్లికేషన్ కోర్సుల ప్రారంభానికి చర్చలు జరుగుతున్నాయి.
ఉన్నత విద్యావకాశాలు
ఎన్‌ఐఆర్‌డీ అందిస్తున్న కోర్సులన్నీ పీజీ డిప్లొమా కోర్సులే. కాబట్టి ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేయడమే మార్గం. ఇక్కడ పేర్కొన్నట్లుగానే ఎన్‌ఐఆర్‌డీలో కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించి.. దూర విద్యా విధానంలో ఎంఏ, ఎం.ఫిల్ కోర్సులు అభ్యసిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.
భవిష్యత్తులో లక్షల్లో అవకాశాలు
రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తు బంగారుమయం అనడంలో సందేహం లేదు. కేవలం ప్రభుత్వ రంగంలోనే లక్షల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒక్క అంశాన్నే పరిగణనలోకి తీసుకుంటే అంతమందికి తగిన మార్గ నిర్దేశనం చేయడానికి రూరల్ డెవలప్‌మెంట్‌లో సుశిక్షితులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమ అమలుకు, సోషల్ అడిట్ నిర్వహణ తదితర అంశాలకు కూడా రూరల్ డెవలప్‌మెంట్ ఉత్తీర్ణులే సరితూగుతారు. ఇక ప్రైవేట్ రంగంలో ఇటీవలే ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసింది. దీంతో అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి. ఇందుకు కూడా సుశిక్షితులైన రూరల్ డెవలప్‌మెంట్ అభ్యర్థులే సరితూగుతారు.
ఔత్సాహిక విద్యార్థులకు సలహా
మిగతా కోర్సులతో పోల్చితే రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు వైవిధ్యభరితం. దీనికనుగుణంగా ఔత్సాహిక విద్యార్థులకు స్వయంగా కొన్ని లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి సంస్కృతి, నేపథ్యం ఉన్న ప్రజలతోనైనా మమేకమవగల మనస్తత్వం, నిజమైన ఆసక్తి, గ్రామీణ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటేనే ఇందులో రాణించగలరు. కేవలం పైన పేర్కొన్న ప్లేస్‌మెంట్ రికార్డ్స్, వేతనాలు ఆధారంగా అడుగుపెడితే యాంత్రికంగా ఉంటుంది. భవిష్యత్తులో రాణించడం కష్టం. కాబట్టి ఈ కోర్సులు సహనం, ఓర్పు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్న వారికి ఎంతో అనుకూలం.
రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్- ఐఆర్‌ఎం క్యాంపస్ (జైపూర్)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్- ఆనంద్ (గుజరాత్)
యూనివర్సిటీ ఆఫ్ కల్యాణి- పశ్చిమబెంగాల్
జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్- భువనేశ్వర్, జార్ఖండ్
రామకృష్ణ మిషన్ విద్యాలయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్- తమిళనాడు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- గుంటూరు
భారతీ విద్యాపీఠ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్- మహారాష్ట్ర

No comments:
Post a Comment