నేను వీఆర్‌ఓ పరీక్షకు సిద్ధమవుతున్నాను. పరీక్ష ఇంగ్లిష్/తెలుగు రెండు మాధ్యమాల్లో ఉంటుందా?
వీఆర్‌ఓలుగా ఎంపికైనవాళ్లు ప్రధానంగా గ్రామ సీమల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులోనూ అక్కడి రాతపూర్వక వ్యవహారాలన్నీ తెలుగులోనే జరుగుతాయి. కాబట్టి వీఆర్‌ఓ పరీక్ష కేవలం తెలుగులో మాత్రమే ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఉండదు.
నేను పాలిటెక్నిక్ ఈసీఈ పూర్తి చేశాను. వీఆర్‌ఓ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నాకు అర్హత ఉందా?
వీఆర్‌ఓ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
మాది చిత్తూరు జిల్లా. గుంటూరులో వీఆర్వో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చా?
వీఆర్వో పరీక్షలో ఏ జిల్లా పోస్టులకు ఆ జిల్లా అభ్యర్థులే అర్హులు. నాన్ లోకల్ అభ్యర్థులను ఓపెన్ కోటాలోనూ పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి మీరు చిత్తూరు జిల్లా పోస్టులకు మాత్రమే అర్హులవుతారు.
వీఆర్వో పరీక్షలో భౌతిక రసాయన శాస్త్రాల్లో ఏ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలడుగుతారు? వీటికోసం చదవాల్సిన పుస్తకాలు తెల్పండి?
భౌతికశాస్త్రం: మన విశ్వం, కొలతలు, శుద్ధగతిక శాస్త్రం, గతి శాస్త్రం, గురుత్వ కేంద్రం, స్థిరత్వం, సరళ యంత్రాలు, భ్రామకాలు, ప్రవాహ పీడనం, ఉష్ణం, ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్.
రసాయన శాస్త్రం: పదార్థాలపై వేడిమి చర్య, సంకేతాలు, ఫార్ములాలు, సమీకరణాలు, రసాయన చర్యల్లో రకాలు, రసాయన సం యోగ నియమాలు, మూలకాల వర్గీకరణ, క్షారమృత్తిక లోహాలు, ద్రావణాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, కర్బన సమ్మేళనాలు, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, నూనెలు, కొవ్వులు, రసాయన శాస్త్ర పరిశ్రమలు.
వీటికోసం 8,9,10 తరగతుల భౌతిక రసాయన శాస్త్రాల పుస్తకాల్లోని పాఠ్యాంశాలు క్షుణ్నంగా చదవాలి. ఆ తర్వాత ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పుస్తకాల్లో ఈ సిలబస్ మేరకు పాఠ్యాంశాలు చదువుకోవాలి. దీంతోపాటు ప్రతి రోజు సాక్షి విద్య, ప్రతి గురువారం భవిత, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ చూసుకుంటే మీ ప్రిపరేషన్ చాలా వరకు పూర్తైట్లే.
నేను వీఆర్‌ఓ పరీక్షకు సిద్ధమవుతున్నాను. మా సొంతూరు వరంగల్. నేను పదో తరగతి వరకు వరంగల్‌లోనూ, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లో చదివాను. నేను వరంగల్, హైదరాబాద్‌లో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
మీరు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరంగల్‌లోనే చదివారు కాబట్టి మీరు వరంగల్ జిల్లాకు చెందినవారే అవుతారు. వరంగల్ జిల్లా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. హైదరాబాద్ జిల్లా పోస్టులకు మీకు అర్హత లేనట్లే.
నేను వీఆర్‌ఓ పరీక్షకు సిద్ధమవుతున్నాను. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను (బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్) ప్రిపేరవుతున్నాను. ఇవి కాకుండా ఇంకా ఏ పుస్తకాలు చదవాలి?
అర్థమెటిక్ ఎబిలిటీ, లాజికల్ స్కిల్స్ కోసం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న గణితం పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయండి. వీటితోపాటు గ్రామీణ అభ్యర్థుల కోసం రోజూ సాక్షి విద్యలో అందిస్తున్న ఒకటిన్నర పేజీల వీఆర్‌ఓ మెటీరియల్‌ను, సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో అందిస్తున్న బిట్‌బ్యాంక్స్, చాప్టర్‌వైజ్ సిలబస్‌ను కూడా అధ్యయనం చేస్తే వీఆర్‌ఓగా విజయం సాధించొచ్చు. సిలబస్ ప్రకారం ప్రణాళికతో చదువుకుంటే వీఆర్‌ఓ పరీక్షలో నెగ్గడం సులువే.
నేను వీఆర్‌ఓ పరీక్షకు సిద్ధమవుతున్నాను. కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించడం ఎలా? ఏఏ బుక్స్ చదివితే ఇందులో ఎక్కువ మార్కులు పొందొచ్చు?
వీఆర్‌ఓ పరీక్షలో కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, విద్య, ఆరోగ్యం, జనాభా, పారిశ్రామిక రంగం, పేదరికం, ద్రవ్యోల్బణం, నీటిపారుదల, చట్టాలు-సవరణలు, న్యాయస్థానాలు, పర్యావరణం, సాంకేతిక పరిజ్ఞానం, జల, ఇంధన వనరులు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంబంధిత అంశాలపై ప్రశ్నలుంటాయి. నాలుగు నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు చదివితే సిలబస్ చాలావరకు పూర్తిచేసినట్లే. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంబంధిత అంశాలపై వీఆర్‌ఓ నోటిఫికేషన్ విడుదల తేదీనాటికి ఆరు నెలల ముందు నుంచీ ఉన్న కరెంట్ అఫైర్స్‌ను చదువుకుంటే సరిపోతుంది. ఇందులో వ్యక్తులు-నియామకాలు-అవార్డులు-గ్రంథాలు, ముఖ్య సదస్సులు, క్రీడలు-రికార్డులు మొదలైన అంశాలను చదువుకుంటే కరెంట్ అఫైర్స్‌లో అత్యధిక మార్కులు సాధించొచ్చు. ఇందుకోసం సాక్షి విద్య, భవిత, సాక్షి ఎడ్యుకేషన్‌డాట్.కామ్ చూడండి. గత రెండేళ్ల కరెంట్ అఫైర్స్ సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో లభిస్తున్నాయి.
NAA PERU SATYANARAYANA[ DIPLOMA MECHANICAL[CCC] ] VRO KI APPLY CHEYYOCHA
ReplyDelete