Wednesday, January 11, 2012

IIIT- H.. PGEE-2012

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - హైదరాబాద్ 2012 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు..

కోర్సులు.. అర్హతలు:
ఎంటెక్: సీఎస్‌ఈ, సీఎస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ; వీఎల్‌ఎస్‌ఐ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్; కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్; కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్; బయో ఇన్ఫర్మేటిక్స్.
ఎంఎస్ బై రీసెర్చ్: సీఎస్‌ఈ, ఈసీఈ, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యుటేషనల్ నేచురల్ సెన్సైస్, ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్.
పీహెచ్‌డీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యుటేషనల్ నేచురల్ సెన్సైస్, స్పాటియల్ ఇన్ఫర్మేటిక్స్, కాగ్నిటివ్ సెన్సైస్, ఎక్సాట్ హ్యుమానిటీస్ అంశాల్లో పీహెచ్‌డీ.
అర్హత:
ఎంటెక్‌లో చేరాలంటే బీఈ/బీటెక్ లేదా బీఆర్క్ లేదా సైన్స్, మ్యాథ్స్, ఐటీ, ఐసీటీ, కంప్యూటర్ సైన్స్‌లో పీజీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణులు అర్హులు.
ఎంటెక్‌లో చేరేందుకు అవసరమైన అర్హతలు ఉన్న వారు, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులు ఎంఎస్ బై రీసెర్చ్‌కు, పీహెచ్‌డీ కోర్సులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సోషల్ సెన్సైస్,లేదా హ్యుమానిటీస్‌లో పీజీ ఉత్తీర్ణులు.. స్పాటియల్ ఇన్ఫర్మేటిక్స్, కాగ్నిటివ్ ఇన్ఫర్మేటిక్స్, ఎక్సాట్ హ్యుమానిటీస్ అంశాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ డిప్లొమా ఇన్ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్
అర్హత: లింగ్విస్టిక్స్, లాంగ్వేజెస్ తత్సంబంధ స్పెషలైజేషన్లలో ఎంఏ ఉత్తీర్ణత.
ఎంఫిల్: కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్
అర్హత: లింగ్విస్టిక్స్, లాంగ్వేజెస్ సంబంధిత అంశాల్లో ఎంఏ లేదా ఎంఫిల్ ఉత్తీర్ణత.
పోస్ట్ బీఎస్సీ డ్యూయెల్ డిగ్రీ: ఈ కోర్సులో చేరడం ద్వారా ఒకేసమయంలో రెండు కోర్సులు (బీటెక్ -సీఎస్‌ఈ, కంప్యుటేషనల్ నేచురల్ సెన్సైస్‌లో ఎంఎస్ బై రీసెర్చ్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు.
ఎంఎస్సీ కంప్యుటేషనల్ నేచురల్ సెన్సైస్
అర్హత: ఈ రెండు కోర్సులకు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ ఉత్తీర్ణులు అర్హులు. ఫిజిక్స్/కెమిస్ట్రీని మేజర్‌గా ఎంచుకున్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఆయా కోర్సుల ప్రవేశానికి సంబంధించి విద్యార్హతలుగా పేర్కొన్న కోర్సుల్లో చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు జూలై 2012 నాటికి సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది.

ప్రవేశమిలా: జాతీయస్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (పీజీఈఈ-2012)ను నిర్వహిస్తుంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

పరీక్ష ఇలా: పీజీఈఈ-2012 రెండు పేపర్లుగా ఉంటుంది. అవి..
పేపర్-1: ఇది అభ్యర్థులకు మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్‌ను పరీక్షించేదిగా ఉంటుంది.
పేపర్-2: ఇది సబ్జెక్ట్ పేపర్. అభ్యర్థులు తమ బ్యాచిలర్ డిగ్రీ సబ్జెక్టుల ఆధారంగా పీజీఈఈ కోసం నిర్దేశించిన సబ్జెక్టుల్లో ఏదోఒక దాన్ని ఎంచుకోవాలి.
ప్రతి పేపర్ గంటన్నర వ్యవధిలో ఉంటుంది.

పీజీఈఈ-2012:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 1, 2012
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 22, 2012
పీజీఈఈ-2012 తేదీ: ఏప్రిల్ 15, 2012
వెబ్‌సైట్: www.iiit.ac.in

No comments:

Post a Comment