బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలతో డిగ్రీ, బయాలజీ, తెలుగు మెథడ్‌తో బీఈడీ చేశాను. ఎంఏ తెలుగు కూడా చేశాను. నేను తెలుగు పండిట్‌కు అర్హుడినా? నేను టెట్‌కి ఏ పేపర్ రాయాలి? కొందరు పేపర్-2 అని, మరి కొందరు పేపర్-1 అని అంటున్నారు?
ఎంఏ తెలుగు చేయడం వల్ల మీరు డీఎస్సీ లో తెలుగు పండిట్ పోస్టులకు అర్హులే. బీఈడీ చేసినవాళ్లు పేపర్-1కు అర్హులు కాదు. మీరు పేపర్-2 రాయడానికి అర్హులు. పేపర్-2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాయాలి.
నేను బీఈడీ చేశాను. టెట్‌లో రెండు పేపర్లు రాయడానికి అర్హుడినేనా? డీఎస్సీకి డిసెంబర్‌లోగా నోటిఫికేషన్ వస్తే ఎస్‌జీటీ రాయడానికి బీఈడీ విద్యార్థులు అర్హులేనా తెలపండి?
ప్రస్తుతం వెలువడిన టెట్ నోటిఫికేషన్ ప్రకారం- మీరు పేపర్-1కు అర్హులు కాదు. పేపర్-2కు మాత్రమే అర్హులు. డీఎస్సీ నోటిఫికేషన్ డిసెంబర్‌లో వచ్చినా బీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు అర్హులు కాదు. ఈ మేరకు సంబంధిత విద్యాశాఖాధి కారులు స్పష్టమైన ప్రకటన చేశారు.
నేను బీఎస్సీ, బీఈడీ చేశాను. బీఈడీలో సెకండ్ మెథడాలజీ తెలుగు. ఇప్పుడు ఎంఏ తెలుగు సెకండియర్ చదువుతున్నాను. ఈ నెల 14 నుంచి పరీక్షలు జరుగుతాయి. అయితే నేను డీఎస్సీలో లాంగ్వేజ్ పండిట్‌కు అర్హుడినేనా?
మీరు డీఎస్సీలో లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు అర్హులే. ప్రస్తుతం వెలువడిన టెట్ నోటిఫికేషన్ ప్రకారం- జనవరి 8, 2012 నాటికి డీఈడీ, బీఈడీ ఫైనలియర్ పరీక్షలు రాసిన విద్యార్థులు టెట్‌కు అర్హులు.
డీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతు న్నాను. మాకు శిక్షణలో భాగంగా ప్రస్తుతం టీచింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభమైంది. నాకు టెట్ రాయడానికి అర్హత ఉందా?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనవరి 7, 2012లోగా డీఈడీ లేదా బీఈడీ ఫైనలియర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు వచ్చే జనవరి 8న నిర్వహించే టెట్ పరీక్షకు అర్హులవుతారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్‌ను నిర్వహి స్తారు. కాబట్టి వచ్చే జూలైలో డీఎస్సీ రాసుకోవచ్చు.
ఉద్యోగ రీత్యా నేను బెంగళూరులో ఉంటు న్నాను. ఫీజు చెల్లింపు, టెట్ దరఖాస్తు వివరా లు తెలపండి?
టెట్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఏపీఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించొచ్చు.
నేను బీకాం, బీఈడీ, ఎంకాం చేశాను. బీఈడీలో సోషల్, ఇంగ్లిష్ మెథడ్స్. 2008 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు బీకాం విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి డీఎస్సీలో అవకాశం ఇస్తారా? లేకపోతే ఎస్‌జీటీగా అవకాశం కల్పిస్తారా?
గత డీఎస్సీలో బీకాం అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ రాసే అవకాశం ఇవ్వలేదు. ఈసారి బీకాం అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని వివిధ విద్యార్థి సంఘాలు అధికారుల దృష్టికి తీసుకువస్తున్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్ వస్తేకాని పూర్తి వివరాలు చెప్పలేం.
నేను డీఈడీ చేశాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎస్సీ పూర్తిచేశాను. నేను టెట్ లో రెండు పేపర్లు రాసుకోవచ్చా?
మీరు టెట్‌లో పేపర్-1కు మాత్రమే అర్హులు. రెండు పేపర్లు రాయడానికి డిగ్రీ ఉంటే చాలదు. బీఈడీ కూడా ఉండాలి.
నేను బీకాం, బీఈడీ (సోషల్, ఇంగ్లిష్ మెథడాలజీ) పూర్తిచేశాను. నేను సెకండియర్ ఎంఏ (ఇంగ్లిష్) చదువుతున్నాను. నేను టెట్‌లో ఏ పేపర్ రాయాలి?
ఎంఏ ఇంగ్లిష్ చేశారు కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్-ఇంగ్లిష్‌కు పోటీపడొచ్చు. ఇందుకోసం మీరు జనవరి 8, 2012 నాటికి ఎంఏ సెకండియర్ ఫైనల్ పరీక్షలు రాసి ఉండాలి. మీరు టెట్‌లో పేపర్-2 రాయాలి.
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ కోసం టెట్‌లో ఏ పేపర్ రాయాలి? సిలబస్ ఏ విధంగా ఉంటుంది?
మీరు టెట్‌లో పేపర్-2 రాయాలి. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి-30, లాం గ్వేజ్-1-30, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్)-30, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్-60 ప్రశ్నలుంటాయి. బీఈడీ స్థాయి లో చదివిన ఎడ్యుకేషనల్ సైకాలజి ఆధారం గా చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిపై ఆరో తరగతిపై స్థాయిలో ప్రశ్నలుంటాయి. మీరు చదివిన డిగ్రీ లాంగ్వేజ్ సబ్జెక్టులను బట్టి లాంగ్వేజ్-1గా తెలుగు/ హిందీ/ సం స్కృతం ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్-2 ఇం గ్లిష్‌పై ప్రశ్నలుంటాయి. మ్యాథమేటిక్స్ అండ్ సైన్స్, లేదా సోషల్ స్టడీస్ ఆరో తర గతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న సిలబస్‌పై సెకండరీ లెవల్‌లో ప్రశ్నలడుగు తారు.
నేను మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌లతో బీ ఎస్సీ; ఫిజిక్స్‌తో ఎమ్మెస్సీ;ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్‌తో బీఈడీ పూర్తిచేశాను. నాకు డీఎస్సీలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసి స్టెంట్ పోస్టులకు అర్హత ఉందా? డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి అంటున్నారు. నిజమా?
మీకు డీఎస్సీలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత లేదు. మీ స్నేహి తులు చెప్పింది నిజమే. ఫిజికల్ సైన్స్ విభా గంలో డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. మీరు డిగ్రీలో ఫిజిక్స్ చదివారు కాబట్టి ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ చేసి ఉంటే అర్హత లభించేది. మీరు స్కూల్ అసి స్టెంట్స్ మ్యాథ్స్ విభాగంలో డీఎస్సీ రాసుకో వచ్చు. ఇందుకోసం మీరు టెట్‌లో పేపర్-2 రాయాల్సి ఉంటుంది.
నేను 2003లో ఎస్‌జీటీగా ఎంపికై ప్రస్తుతం టీచర్‌గా పనిచేస్తున్నాను. కానీ రాబోయే డీఎస్సీలో మ్యాథ్స్, లేదా ఫిజిక్స్‌లో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయాలనుకుంటున్నా ను. నేను టెట్ రాసి క్వాలిఫై కావాలా?
మీరు బీఈడీలో ఏ మెథడాలజీ చేశారో పేర్కొనలేదు. మీరు బీఈడీలో మ్యాథ్స్ చేసి ఉంటే నిరభ్యంతరంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీపడొచ్చు. ఇందుకోసం టెట్ పేపర్-2 క్వాలిఫై అవ్వాలి. 2012 జనవరి నుంచి వెలువడే డీఎస్సీలకు తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణులు కావాలి.
బీకాం తర్వాత ఎంఏ సోషల్ వర్క్, బీఈడీ చేశాను. డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత లభిస్తుందా?
బీకాం, బీఈడీ చేసిన విద్యార్థులకు డీఎస్సీ రాయడానికి అర్హత లేదు. డీఈడీ చేసి ఉంటే... డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు దర ఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఎన్‌సీటీఈ స్పష్టమైన నిబంధనలు రూపొందించింది.
టెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, సందేహాల కోసం టెట్ వెబ్‌సైట్ www.aptet.cgg.gov.in చూడొచ్చు.

No comments:
Post a Comment