ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) క్యాంపస్‌లలో కాలు పెట్టాలంటే..?
కామన్ అడ్మిషన్ టెస్ట్‌కు హాజరు కావాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఎంత పర్సెంటైల్ వస్తే సీటు ఖరారవుతుంది?
ఇదే చాలామంది ‘క్యాట్’ విజేతలకు..
భవిష్యత్తులో ఐఐఎంలో అడుగుపెట్టాలనుకునే వారికి తలెత్తే సందేహం.
దీనికి సమాధానం?
ఆయా ఐఐఎంలు నిర్దేశించే కటాఫ్‌లను పరిశీలించడమే. ప్రస్తుతం ఆయా ఐఐఎంలు 2012-14కు క్యాట్ పర్సెంటైల్ ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఆయా ఐఐఎంలు.. కటాఫ్‌లపై విశ్లేషణ.
దేశవ్యాప్తంగా ఐఐఎం క్యాంపస్‌లు 13 ఉన్నాయి. ఒక్కో ఐఐఎంది ఒక్కో ప్రత్యేకత. దీన్ని బట్టే క్యాట్ కటాఫ్‌లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఐఐఎంల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే అహ్మదాబాద్, కలకత్తా క్యాంపస్‌లలో 99, 99.5 పర్సెంటైల్ తప్పనిసరి కాగా.. కొత్తగా ఏర్పాటు చేసిన కాశీపూర్, ఉదయ్‌పూర్‌లలో 70 నుంచి 80 శాతం పర్సెంటైల్‌తో కూడా సీటు సొంతమయ్యే అవకాశాలున్నాయి.
సెక్షనల్, అగ్రిగేట్:
ఐఐఎంలలో అడ్మిషన్‌లకు క్యాట్ పర్సెంటైల్ కటాఫ్‌లను నిర్ణయించే క్రమంలో సెక్షనల్, అగ్రిగేట్ కటాఫ్‌లను నిర్దేశించడం కూడా జరుగుతోంది. అంటే క్యాట్‌లో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్; వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్.
వీటిలో ఒక్కో సెక్షన్‌కు తప్పనిసరిగా పొందాల్సిన కనీస పర్సెంటైల్; ఆ రెండిటిని కలిపితే ఉండాల్సిన సగటు కటాఫ్‌లను కూడా ఐఐఎంలు నిర్దేశిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐఎం బెంగళూరును పరిగణిస్తే జనరల్ మెరిట్‌లో సెక్షన్1లో 80; సెక్షన్ 2 లో 90; అగ్రిగేట్ 90 పర్సెంటైల్స్‌ను కటాఫ్‌గా నిర్ణయించింది. ఇలా అడుగడుగునా కఠినమైన ప్రమాణాలతో కటాఫ్‌లను నిర్ణయించాయి.
పలు ప్రోగ్రాంలు.. పలు కటాఫ్‌లు:
దేశంలోని అన్ని ఐఐఎంలలో పీజీ స్థాయిలో పలు ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటికీ ప్రధానమైన అర్హత క్యాట్ స్కోర్. అయితే ప్రవేశాలు కల్పించే సమయంలో మాత్రం ఒక్కో ప్రోగ్రాంకు ఒక్కో విధమైన కటాఫ్ ప్రామాణికంగా ఉంటోంది.
ఉదాహరణకు ఐఐఎం అహ్మదాబాద్‌ను పరిశీలిస్తే.. ఈ క్యాంపస్‌లోని అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంకు జనరల్ కేటగిరీలో క్యాట్ రెండు సెక్షన్లలోనూ 94 పర్సంటైల్ చొప్పున కటాఫ్‌గా నిర్ణయించింది. ఇతర ప్రోగ్రాంలకు 99 శాతం కటాఫ్‌గా నిర్ణయించింది.
క్యాట్‌తోపాటు మరెన్నో:
‘క్యాట్‌లో మంచి పర్సెంటైల్ సాధిస్తే ఐఐఎంలో సీటు సొంతం చేసుకోవచ్చు’.. అనేది చాలామంది ఔత్సాహికుల్లో నెలకొన్న అభిప్రాయం. కానీ ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తోపాటు మరెన్నో అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వాటికి నిర్దిష్ట వెయిటేజీ నిర్ణయించాయి. ఈ ప్రక్రియలో పదో తరగతి మొదలు బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు సాధించిన మార్కులకు; పని అనుభవానికి; గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ తదితర అంశాలకు వెయిటేజీ ప్రకటించి ఆ మేరకు తుది జాబితా రూపొందిస్తాయి.
ఐఐఎం అహ్మదాబాద్ క్యాట్ స్కోర్‌కు 70 శాతం; విద్యార్హతలు, పని అనుభవం (కనీసం రెండేళ్లకు పైగా)కు 30 శాతం వెయిటేజీ నిర్ణయించింది.
అకడెమిక్ ప్రొఫైల్ బాగుంటేనే:
‘క్యాట్‌లో అద్భుతమైన పర్సెంటైల్ వచ్చింది. సీటు గ్యారంటీ’ అని భావించడానికి వీలులేదు. పలు ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తోపాటు విద్యార్థుల అకడెమిక్ ప్రొఫైల్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో నిర్దిష్ట నిబంధనలు విధిస్తున్నాయి. కొన్ని ఐఐఎంలు పదో తరగతి నుంచి బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ప్రథమశ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొన్నాయి.
ఐఐఎం షిల్లాంగ్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లలో 80 శాతం పైగా మార్కులు తప్పనిసరి అని; ఐఐఎం రోహ్‌తక్, త్రిచి పదో తరగతిలో 70 శాతం; ఇంటర్మీడియెట్‌లో 65 శాతం; గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొనడాన్ని బట్టి ఐఐఎంలు విద్యార్థులు అకడెమిక్ ప్రొఫైల్‌కు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఐఐఎం ఉదయ్‌పూర్ ఒక్కటే ఎలాంటి ఇతర వెయిటేజీలు, వడపోత ప్రక్రియలు లేకుండా నేరుగా క్యాట్ స్కోర్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్ నిర్వహిస్తోంది.
పని అనుభవం కూడా ప్రధానమే:
క్యాట్‌లో మంచి పర్సెంటైల్, అకెడమిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంటే ఐఐఎం సీటు గ్యారంటీ అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈ రెండింటితోపాటు ఐఐఎంలు అభ్యర్థులకున్న పని అనుభవానికి కూడా ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయి. ఐఐఎం-బెంగళూరులో పర్సనల్ ఇంటర్వ్యూ సమయంలో పని అనుభవానికి గరిష్టంగా పది పాయింట్ల స్కోరు ఇవ్వడానికి నిర్ణయించింది. అదే విధంగా ఐఐఎం అహ్మదాబాద్ రెండేళ్లకంటే ఎక్కువ పని అనుభవం ఉన్న వారికి మూడు పాయింట్ల స్కోరు ఇవ్వనుంది.
జీడీ/పీఐ కూడా కీలకమే:
క్యాట్ కటాఫ్‌లు, అకడెమిక్ రికార్డ్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లకు సంబంధించి గరిష్ట వెయిటేజీ పొందినప్పటికీ విద్యార్థులు ఎదుర్కోవాల్సిన మరో కీలకమైన దశ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్. క్యాట్ స్కోర్, ఇతర వెయిటేజీల ఆధారంగా జాబితాలో నిలిచిన అభ్యర్థులు వీటిలో కూడా తప్పనిసరిగా ప్రతిభ చూపాల్సిందే. ఐఐఎం లక్నో, కోజికోడ్ క్యాంపస్‌లు జీడీ/పీఐకు 50 శాతం వెయిటేజీ నిర్ణయించడమే దీనికున్న ప్రాధాన్యానికి నిదర్శనం.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్:
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు అదనంగా కొన్ని ఐఐఎంలు నిర్వహిస్తున్న మరో ప్రక్రియ రిటెన్ ఎబిలిటీ టెస్ట్. క్యాట్ స్కోర్, ఇతర వెయిటేజీల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఈ టెస్ట్‌ను నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఐఐఎం బెంగళూరు, లక్నో, కోజికోడ్‌లు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విధానంలో.. దాదాపు అరగంట వ్యవధిలో నిర్దేశిత అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. గ్రామీణ వాతావరణం మొదలు.. గ్రహాంతర పరిస్థితుల వరకు ఏ రంగమైనా, ఎలాంటి అంశమైనా ఈ విధానంలో అడిగే అవకాశం ఉంది.
ఆరు ఐఐఎంలు... ఉమ్మడి ప్రక్రియ:
ఐఐఎం- కాశీపూర్, రాయ్‌పూర్, రాంచీ, రోహ్‌తక్, త్రిచీ, ఉదయ్‌పూర్.. ఇటీవల ఏర్పాటైన క్యాంపస్‌లు. క్యాట్ స్కోర్ తదుపరి ప్రవేశాలకు సంబంధించి ఈ ఆరు ఒకే గొడుగు కింద ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఐఐఎం-రాంచీ పర్యవేక్షణలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా తుది జాబితాలో నిలిచిన వారికి ఈ ఆరు క్యాంపస్‌లలో ఎక్కడైనా సీటు లభించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఆరు కొత్త క్యాంపస్‌ల కోసం నిర్దేశించిన ఈ విధానంలో రాణించిన అభ్యర్థులను.. ఐఐఎం- అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, కోజికోడ్, లక్నోలు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. అలాంటి క్యాంపస్‌ల సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేస్తారు. ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు కాబట్టి ఈ ఆరు కొత్త ఐఐఎం క్యాంపస్‌లతోపాటు పాత క్యాంపస్‌ల సెలక్షన్ ప్రాసెస్‌కు కూడా ప్రత్యేకంగా సంసిద్ధులు కావడం అవసరం.
ఎంపిక కాకున్నా.. మరెన్నో మన్నికైన బి-స్కూల్స్:
పలు రకాల క్లిష్టమైన వడపోత ప్రక్రియల కారణంగా ఐఐఎం క్యాంపస్‌లకు ఎంపిక కాకున్నా.. అలాంటి అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదు. దాదాపు ఐఐఎంల స్థాయిలో ప్రమాణాలు పాటించే మరెన్నో మన్నికైన బిజినెస్ స్కూల్స్ క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఘజియాబాద్); బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ- బిమ్‌టెక్ (గ్రేటర్ నోయిడా) వంటి పలు ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఐఐఎంలో అవకాశం చేజారిన అభ్యర్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రతి విద్యార్థికి కెరీర్‌లో ప్రధాన లక్ష్యమైన క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో కూడా ఐఐఎంలతో సరితూగే బి-స్కూల్స్ ఎన్నో ఉన్నాయి.
షార్ట్‌లిస్టింగ్ ఇలా:
సాధారణంగా ఐఐఎంలలో షార్ట్ లిస్టింగ్ రెండు దశలుగా ఉంటుంది.
మొదటిది.. క్యాట్ స్కోర్‌కు నిర్దేశిత కటాఫ్‌లను నిర్ణయించడం.
రెండోది.. క్యాట్ స్కోర్ ఆధారంగా మొదటి జాబితాలో నిలిచిన అభ్యర్థుల అకడెమిక్ ప్రొఫైల్ వెయిటేజీ, వర్క్ ఎక్స్‌పీరియన్స్ వెయిటేజీలను పరిగణిస్తూ మరో జాబితా రూపొందించడం.
ఈ రెండిటి ఆధారంగా తుది జాబితా సిద్ధం చేసి జీడీపీఐలో మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తాయి.
జీమ్యాట్ స్కోర్ కూడా:
క్యాట్ స్కోర్ మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా బి-స్కూల్స్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికమైన గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) స్కోరు ఆధారంగా కూడా ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరులు పీజీ ప్రోగ్రాంలలో ప్రవేశం కల్పిస్తున్నాయి. జీమ్యాట్ స్కోరు, దానికి తత్సమానంగా నిర్దేశించిన క్యాట్ స్కోర్‌లను ప్రకటించాయి. ఈ విషయంలో ఈ రెండు క్యాంపస్‌లు కొన్ని నిబంధనలు వర్తించాయి.
అవి..
అహ్మదాబాద్: డిసెంబర్ 15, 2011 నాటికి రెండు సంవత్సరాలలోపు మాత్రమే జీమ్యాట్ స్కోరు పొంది ఉండాలి.
బెంగళూరు: గత మూడేళ్లలో (జనవరి 2009 నుంచి డిసెంబర్ 2011) కనీసం 18 నెలలు విదేశాల్లో నివసించి ఉండాలి.
పర్సనల్ అప్పీయరెన్స్: అంటే.. గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలకు కేటాయించిన వెయిటేజీ మొత్తం
క్యాట్+ప్రొఫైల్: అంటే.. క్యాట్ స్కోరు, విద్యార్హతలు, పని అనుభవాలకు కేటాయించిన వెయిటేజీ మొత్తం.
{పొఫైల్ వెయిటేజీ మొత్తాలు ఆయా క్యాంపస్‌ల మధ్య వేర్వేరుగా ఉంటాయి.
ఐఐఎంలలో క్యాట్ పర్సెంటైల్ కటాఫ్ అంచనా
(జనరల్ కేటగిరీ)
క్యాంపస్ కటాఫ్ పర్సెంటైల్
అహ్మదాబాద్ 99
బెంగళూరు 90
కలకత్తా 99.55
లక్నో 90
ఇండోర్ 90
కోజికోడ్ 85
షిల్లాంగ్ 94.5
రాయ్‌పూర్ 80
కాశీపూర్ 75
రాంచీ 90
రోహ్‌తక్ 70
{తిచీ 80
ఉదయ్‌పూర్ 80
.....................
క్యాట్, అకడెమిక్ ప్రొఫైల్, పర్సనల్
అప్పీయరెన్స్‌కు ఆయా ఐఐఎంలు కేటాయించిన వెయిటేజీ వివరాలు
క్యాంపస్ క్యాట్+ప్రొఫైల్ పర్సనల్ అప్పీయరెన్స్
అహ్మదాబాద్ 70 30
బెంగళూరు 60 40
కలకత్తా 37 63
ఇండోర్ 50 50
కాశీపూర్ 50 50
కోజికోడ్ 50 50
లక్నో 50 50
రాయ్‌పూర్ 70 30
ఉదయ్‌పూర్ 70 30
రోహ్‌తక్ 70 30
రాంచీ 70 30
త్రిచీ 70 30

No comments:
Post a Comment