Thursday, March 8, 2012

ఐసెట్‌-2010 I-CET


రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశాల కోసం ఉద్దేశించిన (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఐసెట్‌-2010 నోటిఫికేషన్‌ వెలువడింది. పూర్తికాలిక, అంశకాలిక, సాయంకాల, దూరవిద్యా విధానాల్లో ఎంబిఎ, ఎంసిఎ కోర్సులు చదవాలని భావించే అభ్యర్థులు ఐసెట్‌ తప్పనసరిగా రాయాల్సి ఉంటుంది.  అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి వారి ప్రతిభననుసరించి వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలోని దిగువ యూనవర్సిటీల్లో ఎంబిఎ/ఎంసిఎ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
1.ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్‌ యూనవర్సిటీ
2.ఆచార్య నాగార్జున యూనవర్సిటీ
3. ఆదికవి నన్నయ యూనవర్సిటీ
4. ఆంధ్రా యూనివర్సిటీ
5. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ
6. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ
7. ద్రవిడియన్‌ యూనర్సిటీ
8. జెఎన్‌టియూ-అనంతపూర్‌
9. జెఎన్‌టియూ- హైద్రాబాద్‌
10. జెఎన్‌టియూ - కాకినాడ
11. కాకతీయ యూనవర్సిటీ
12. కృష్ణా యూనవర్సిటీ
13. మహాత్మాగాంధీ యూనవర్సిటీ
14. ఉస్మానియా యూనివర్సిటీ
15. పాలమూర్‌ యూనవర్సిటీ
16. రాయలసీమ యూనవర్సిటీ
17. ఎస్కే యూనవర్సిటీ
18. ఎస్వీ యూనివర్సిటీ
19. శాతవాహన యూనివర్సిటీ
20. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
21. తెలంగాణ యూనివర్సిటీ
22. విక్రమ్‌ సింహపురి యూనివర్సిటీ
23. యోగి వేమన యూనివర్సిటీ
అర్హతలు: 1.భారతీయుడై ఉండాలి. రాష్ట్ర విద్యాసంస్థల నియమ నిబంధనల మేరకు లోకల్‌ / నాన్‌ లోకల్‌ అంశాలకు అర్హులై ఉండాలి.
2.విదేశీ విద్యార్థులు స్థానిక విశ్వవిద్యాలయాల నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
3. బీఒఎల్‌/బీఎఫ్‌ఏ మినహా అభ్యర్థులు ఏదేని డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి.
4.ఎంబిఏ ప్రవేశం కోరుకునే అభ్యర్థులు పదోతరగతిలో గణితం ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. మూడేళ్ల డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.
5.ఎంసిఎలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో తప్పనిసరిగా గణితం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మూడేళ్ల డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.
7. డిగ్రీ చివరి సంవత్సరం చదివే అభ్యర్థులు సైతం ఐసెట్‌-2010కు దరఖాస్తు చేసుకోవచ్చు.
8.ఎస్సీ-ఎస్టీలకు కనీసార్హత మార్కులు లేవు.

No comments:

Post a Comment