కచ్చితంగా అయిదంకెల జీతాలు.. మరి కాసింత నైపుణ్యాలతో కలర్‌ఫుల్ కెరీర్‌కు మార్గం వేసే కోర్సు చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ రంగంలో అడుగు పెట్టాలనుకునే విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వెంటనే అందుకు శ్రీకారం చుట్టాలి. మొత్తం మూడు దశలుగా ఉండే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు వివరాలు..
మొదటి దశ కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్:
భవిష్యత్తులో సీఏగా స్థిరపడాలనుకునే విద్యార్థులు మొదటిగా ఎదుర్కోవాల్సిన పరీక్ష కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ). ఈ పరీక్ష రాయాలంటే ముందుగా పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా తమ పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు పరీక్షలు రాశాక సీపీటీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య కనీసం రెండు నెలల వ్యవధి తప్పనిసరి. ఉదాహరణకు జూన్‌లో జరిగే సీపీటీకి హాజరు కావాలంటే ఏప్రిల్ 1లోపు; డిసెంబర్‌లో జరిగే సీపీటీకి అక్టోబర్ 1లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సీపీటీ పరీక్ష, సిలబస్: మొత్తం రెండు వందల మార్కులకు రెండు సెషన్లలో సీపీటీని నిర్వహిస్తారు. ప్రతి సెషన్‌కు రెండు గంటల సమయం ఉంటుంది. మొదటి సెషన్‌లో సెక్షన్ ఎ(ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్-60 మార్కులు); సెక్షన్ బి(మర్కెంటైల్ లా-40 మార్కులు) ఉంటాయి. రెండో సెషన్‌లో సెక్షన్-ఎ జనరల్ ఎకనామిక్స్, సెక్షన్-బి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 50 మార్కులు.
ఇంటిగ్రేటెడ్ ప్రొషెఫనల్ కాంపిటెన్స్ కోర్స్:
సీఏగా రూపుదిద్దుకోవడంలో రెండో దశ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపీసీసీ). సీపీటీతోపాటు ఇంటర్మీడియెట్ కూడా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఐపీసీసీ నమోదు కోసం అర్హత లభిస్తుంది. నమోదు చేసుకున్న తర్వాత తప్పనిసరిగా తొమ్మిది నెలల స్టడీ కోర్స్‌ను పూర్తి చేయాలి.
ఆ తర్వాత వారం రోజులు పాటు నిర్వహించే ఓరియెంటేషన్ కోర్స్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్‌లో నిర్వహించే వంద గంటల కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఐపీసీసీ పరీక్ష రాసేందుకు అనుమతి లభిస్తుంది.
ఐపీసీసీ స్వరూపం, సిలబస్: ఐపీసీసీని గ్రూప్-1, గ్రూప్-2లుగా విభజించారు. గ్రూప్-1 నాలుగు పేపర్లు; గ్రూప్-2లో మూడు పేపర్లు ఉంటాయి. అవి..
గ్రూప్-1:
పేపర్-1 అకౌంటింగ్; పేపర్-2 బిజినెస్ ‘లా’స్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్; పేపర్-3 కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, పేపర్-4 టాక్సేషన్.
గ్రూప్-2: పేపర్-5 అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్; పేపర్-6 ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్; పేపర్-7 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
రెండు గ్రూపుల్లోనూ ప్రతి పేపర్ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు.
ఫైనల్ కోర్స్:
పేరు పక్కన చార్డర్డ్ అకౌంటెంట్ అనే హోదా పొందే క్రమంలో.. సీఏ కోర్సులో చివరి దశ ఫైనల్ కోర్స్. ఐపీసీసీలోని రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించి, ఇన్‌స్టిట్యూట్ గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర మూడేళ్ల ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ పూర్తయ్యాక తర్వాత మాత్రమే ఫైనల్ కోర్సు పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులు ఐపీసీసీలోని ఒక గ్రూప్ లేదా రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ కోసం నమోదు చేసుకోవాలి.
దాని ఆధారంగా ఫైనల్ కోర్సుకు నమోదు చేసుకోవాలి. మూడేళ్ల ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ పూర్తయ్యాక ఫైనల్ కోర్సు పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. అయితే ఈ విషయంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పించింది. మూడేళ్ల ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణలోని చివరి ఆరు నెలల్లో ఫైనల్ కోర్సు పరీక్షలకు హాజరు కావచ్చు.
ఫైనల్ కోర్సు అభ్యసించే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ (జీఎంసీఎస్) కోర్స్. ఇది 15 రోజుల వ్యవధిలో ఉంటుంది. ఆర్టికల్ అసిస్టెంట్ శిక్షణ రెండేళ్లు పూర్తయ్యాక జీఎంసీఎస్‌కు అర్హత లభిస్తుంది. ఇక.. ఫైనల్ కోర్సును కూడా రెండు గ్రూపులుగా, ప్రతి గ్రూప్‌లో నాలుగు పేపర్లుగా వర్గీకరించారు.
అవి..
గ్రూప్-1: పేపర్-1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్; పేపర్-2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; పేపర్-3 అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్; పేపర్-4 కార్పొరేట్ అండ్ అలైడ్ ‘లా’స్.
గ్రూప్-2: పేపర్-5 అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్; పేపర్-6 ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్; పేపర్-7 డెరైక్ట్ టాక్స్ ‘లా’స్; పేపర్-8 ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ ‘లా’స్.
మరో అవకాశం.. అకౌంటింగ్ టెక్నిషియన్ ఎగ్జామ్:
సీఏ కోర్సంటే విద్యార్థులు ఎంతో క్లిష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో మధ్యలోనే వెనుకడుగు వేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. దీన్ని గమనించిన ఐసీఏఐ మరో అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే అకౌంటింగ్ టెక్నిషియన్ ఎగ్జామ్. ఐపీసీసీకి పేరు నమోదు చేసుకుని తొమ్మిది నెలల స్టడీ కోర్సు కూడా పూర్తి చేసుకుని ఐపీసీసీ గ్రూప్-1లో ఉత్తీర్ణత సాధించిన వారికి అకౌంటింగ్ టెక్నిషియన్ హోదా లభిస్తుంది.
నిరంతరం నమోదు:
సీఏ కోర్సులో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు తమ దరఖాస్తులను ఏడాదిలో ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. ఎలాంటి గడవు ఉండదు. అయితే నిర్దేశిత కోర్సుకు నమోదు చేసుకున్న తర్వాత ఇన్‌స్టిట్యూట్ నిర్దేశించిన కనీస వ్యవధి పూర్తయ్యాక మాత్రమే ఆ కోర్సుకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునే అనుమతి లభిస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.icai.org

No comments:
Post a Comment