Thursday, March 29, 2012


మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎం.ఆర్క్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
-కవిత, నల్లగొండ.
దేశంలో నేడు ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ ఎంతో ఉంది. ఎంఎన్‌సీలు, ఎస్‌ఈజెడ్‌ల ఏర్పాటు.. విదేశీపెట్టుబడుల ప్రవాహం.. కారణంగా ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి కేవలం బ్యాచిలర్ డిగ్రీనే కాకుండా మాస్టర్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసుకున్న వారు కార్పొరేట్ రంగంతోపాటు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

ఎం.ఆర్క్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్, ఎం.ఆర్క్ కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఆర్క్. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: http://jnafau.ac.in

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-న్యూఢిల్లీ, ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్ స్పెషలైజేషన్స్‌గా మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎం.ఆర్క్) కోర్సును అందిస్తుంది. అర్హత: 55శాతం మార్కులతో బీఆర్క్/బీప్లానింగ్.
వివరాలకు: www.spa.ac.in

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ- న్యూఢిల్లీ, మెడికల్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ సర్వీసెస్ రిక్రియేషనల్ అండ్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లుగా ఎం.ఆర్క్. కోర్సును ఆఫర్ చేస్తుంది. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. వివరాలకు: http://jmi.ac.in/

ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆఫర్ చేస్తున్న కోర్సులేవి?
సురేష్, రామగుండం.
కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో దేశంలోనే ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్ ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్. దీన్ని 1991లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థాపించారు. ఈ ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్‌లో పలు రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది.

వివరాలు..
ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్:
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (హ్యుమానిటీస్/జర్నలిజం/బిజినెస్ మేనేజ్‌మెంట్/అడ్వర్‌టైజింగ్/మార్కెటింగ్/పీఆర్) లేదా తత్సమానం.
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్:
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్.
పీజీ సర్టిఫికెట్ ఇన్ క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్
అర్హత: గ్రాడ్యుయేషన్.
పీజీ సర్టిఫికెట్ ఇన్ క్రాఫ్టింగ్ క్రియేటివ్ కమ్యూనికేషన్
అర్హత: గ్రాడ్యుయేషన్.
ప్రవేశం:
కోర్సులను బట్టి క్యాట్ స్కోర్/ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా.
ఇన్‌స్టిట్యూట్ రెగ్యులర్ కోర్సులతోపాటు అడ్వర్‌టైజింగ్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, రీసెర్చ్ అండ్ డేటా ఎనాలిసిస్ విభాగాల్లో పీజీ సర్టిఫికెట్ కోర్సులను ఆన్‌లైన్ విధానంలో అందిస్తుంది. వివరాలకు: www.mica.ac.in

ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ చేయాలంటే?
-శ్వేత, కరీంనగర్
దేశంలోని ప్రఖ్యాత మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ఒకటి. ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేసే ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి అర్హత: 60 శాతం మార్కులతో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. మూడున్నర గంటలపాటు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి.

ఇంగ్లిష్/హిందీ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. రాతపరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీలను కలిపి)ల నుంచి 60 ప్రశ్నల చొప్పున వస్తాయి. మిగతా 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్‌పై ఉంటాయి. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్‌లో ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది.
వివరాలకు: www.aiims.edu

సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ) కోర్సు వివరాలు, ఆ కోర్సు అర్హతగా లభించే అవకాశాల గురించి తెలపండి?
శివ, హైదరాబాద్.

చార్టెర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ, ఐసీడబ్ల్యూఏ మాదిరిగానే ఒక ప్రొఫెషనల్ కోర్సు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్(సీఎఫ్‌పీ). ఫైనాన్షియల్ ప్లానింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ అడ్వైజరీ రంగాల్లో.. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న కోర్సు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. భారత్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్(ఎఫ్‌పీఎస్‌బీ)-ఇండియా, అమెరికాలోని డెన్వర్ కేంద్రంగా పని చేసే ఎఫ్‌పీఎస్‌బీ.. అంతర్జాతీయంగా ఈ కోర్సు వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, స్టాక్ బ్రోకర్స్ సంబంధిత రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌తోపాటు గ్రాడ్యుయేట్లు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు.సీఎఫ్‌పీ సర్టిఫికెట్ పొందడానికి ముందుగా.. కోర్సును ఆఫర్ చేస్తున్న సంబంధిత ఏజెన్సీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత నిర్దేశించిన కరిక్యులంను పూర్తి చేయాలి. ఇందులో ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. మొదటి మాడ్యూల్‌లో ఇంట్రడక్షన్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది.

తర్వాతి దశలో.. రిస్క్ అనాలిసిస్ అండ్ ఇన్సూరెన్స్ ప్లానింగ్, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ సబ్జెక్టులు ఉంటాయి. ఎగ్జామ్ 1,2,3,4గా వ్యవహరించే.. ఈ కోర్సును నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఆఫర్ చేస్తుంది. తర్వాత సీఎఫ్‌పీ ఎగ్జామ్‌కు హాజరవ్వాలి. దీన్నే ఎగ్జామ్-5 అని కూడా అంటారు. ఈ కోర్సు డిస్టెన్స్, ఈ-లెర్నింగ్, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ పద్ధతుల్లో అందుబాటులో ఉంది.
వివరాలకు: www.fpsb.co.in

ఎంబీఏ(మార్కెటింగ్)కోర్సు చేసిన వారికి సేల్స్ పరంగా కాకుండా ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
-శరణ్, సికింద్రాబాద్.
ఎంబీఏ (మార్కెటింగ్) కోర్సు పూర్తి చేసిన వారికి సేల్స్ పరంగా కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. వీరు బ్రాండ్ మేనేజర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, న్యూప్రొడక్ట్ మేనేజర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు.

ఇవన్నీ సేల్స్ విభాగంతో ముడిపడి ఉన్న జాబ్స్ అయినప్పటికీ.. జాబ్ నేచర్‌లో తేడాలు ఉంటాయి. డిజైనింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీస్(మార్కెట్ వ్యూహాలను రూపొందించడం), అడ్వర్‌టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, కస్టమర్ రిలేషన్‌షిప్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, డెవలప్‌మెంట్ మేనేజర్ వంటి హోదాల్లో వివిధ బ్యాంకులు, ఇండస్ట్రీస్, ఫైనాన్స్ కంపెనీలలో స్థిరపడొచ్చు.

No comments:

Post a Comment