రాష్ర్టంలో ‘సెట్(కామన్ ఎంట్రెన్‌స టెస్ట్)’ల సందడి మొదలైంది. పాలిటెక్నిక్ మొదలు..పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పలు కోర్సుల్లో ప్రవేశానికి వివిధ ‘సెట్’ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఒక్కో సెట్‌ది ఒక్కో తీరు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లు విడుదలైన సెట్స్ సమాచార సమాహారం.. వాటి ప్రిపరేషన్ టిప్స్ మీ కోసం...
సీప్-2012
ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పాలిటెక్నిక్ (సీప్)- 2012’ ప్రకటన వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత, ఈ సంవత్సరం పరీక్ష రాస్తున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: రెండుగంటల వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటాయి. మంచి ర్యాంక్ రావాలంటే మ్యాథ్స్‌పై పట్టు తప్పనిసరి. ప్రశ్నలు సాధారణంగా కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తొమ్మిది, పది తరగతుల.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
ఇవీ కోర్సులు:
మూడేళ్ల వ్యవధితో: అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ (షుగర్ టెక్నాలజీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ.
మూడున్నరేళ్ల వ్యవధితో: స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ బయోమెడికల్ ఇంజనీరింగ్, సిరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ/పెట్రో కెమికల్స్/ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ ఎంబడెడ్ సిస్టమ్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విత్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విత్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ విత్ టీవీ అండ్ సౌండ్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
నాన్ ఇంజనీరింగ్: కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్; వ్యవధి: మూడేళ్లు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా
ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో * 20 నగదు చెల్లించి దరఖాస్తు పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012
ప్రవేశ పరీక్ష: మే 2, 2012
వెబ్‌సైట్: www.sbtetap.gov.in
పీజీఈసెట్-2012
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ఎంఈ/ ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్‌డీ (పోస్ట్ బాక్యులరేట్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ప్రకటన వెలువడింది. ఆ వివరాలు...
అర్హతలు: బీటెక్/బీఈ/ఏఎంఐఈ/బీఫార్మసీ/బీఆర్క్/బీప్లానింగ్‌లలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులు కూడా అర్హులే.
పరీక్ష విధానం: రెండు గంటలలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 120 మార్కులుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 60 శాతం థియరీ, 40 శాతం ప్రాబ్లమ్స్ (ఫార్ములా బేస్డ్) ప్రశ్నలు ఉంటాయి.
సిలబస్: పీజీఈసెట్ సిలబస్ అంతా గేట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది. ప్రశ్నలు గేట్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉంటా యి. గేట్ ప్రిపరేషన్ సాగించేవారు ఈ పరీక్షలో మంచి ర్యాంకు సొంతం చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 23
పరీక్షలు: జూన్ 8, నుంచి జూన్ 11, 2012
వెబ్‌సైట్: www.appgecet.org
ఈసెట్-2012
పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు చేసిన విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా డెరైక్ట్‌గా యూజీ ఇంజనీరింగ్/ ఫార్మసీ కోర్సుల్లో సెకండియర్‌లో ప్రవేశానికి నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్)-2012 నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు..
అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు పొందిన కళాశాల నుంచి 45 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌తో పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే, లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రవేశ పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో రెండొందల ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. డిప్లొమా విద్యార్థులకు ఒక విధంగా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు మరో విధంగా పరీక్ష ఉంటుంది.
డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి: మ్యాథమెటిక్స్-50, ఫిజిక్స్-25, కెమిస్ట్రీ-25, పాలిటెక్నిక్‌లో సంబంధిత బ్రాంచ్ (ఉదా: మెకానికల్, సివిల్, ఈసీఈ)కు 100 మార్కులుంటాయి.
బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు: మ్యాథమెటిక్స్-100, ఎనలిటికల్ ఎబిలిటీ-50, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-50 ఉంటాయి.
ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి: ఫార్మాస్యూటిక్స్-50, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ-50, ఫార్మకాగ్నసీ-50, ఫార్మకాలజీ-50 మార్కులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో నిర్దేశిత పోస్టాఫీసులు, ఈసేవా కేంద్రా లు, యాక్సిస్ బ్యాంక్ శాఖల్లో *300 నగదు చెల్లించి పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2012
ప్రవేశ పరీక్ష: మే 24, 2012
వెబ్‌సైట్: www.apecet.org
లాసెట్, పీజీఎల్‌సెట్-2012
మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్/బీబీఏ-ఎల్‌ఎల్‌బీ (ఇంటిగ్రేటెడ్ కోర్సు) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్-2012 నోటిఫికేషన్ వెలువడింది. దీంతోపాటుగా పీజీ ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రవేశ పరీక్షల అర్హతలు, పరీక్ష విధానాలపై ఫోకస్..
యూజీ కోర్సులు:
అర్హత: మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో ఏదై నా డి గ్రీలో 45 శాతం మార్కులతో, ఐదేళ్ల లా కోర్సుకు ఇంటర్మీడియట్ (10+2) విధానంలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి)
వయోపరిమితి: మూడేళ్ల కోర్సుకు 30 ఏళ్లు, ఐదేళ్ల కోర్సు కు 20 ఏళ్లు మించరాదు.(ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్ల కోర్సు కు ఐదేళ్లు, ఐదేళ్ల కోర్సుకు రెండేళ్లు వయోసడలింపు)
పీజీ కోర్సులు:
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం:
యూజీ పరీక్ష ఇలా...
గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీకి 30 ప్రశ్నలు, పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌కు 30 ప్రశ్నలు, పార్ట్-సిలో లా ఆప్టిట్యూడ్‌పై 60 ప్రశ్నలుంటాయి. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
పీజీ లా సెట్ ఇలా...
పరీక్ష విధానం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. 90 నిమిషాల వ్యవధి. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్-ఎలో భాగంగా జూరిస్ ప్రుడెన్స్‌పై 20, కాన్‌స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-బీలో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మర్కెంటైల్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ టోర్ట్స్, ఐపీఆర్ అండ్ అదర్ లాస్ ఒక్కో అంశంపై 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, లేదా నిర్దేశిత హెడ్ పోస్టాఫీసులు, యాక్సిస్ బ్యాంక్ శాఖలలో * 250 చెల్లించి పొందొచ్చు. పీజీఎల్‌సెట్ దరఖాస్తుల కోసం సెక్రటరీ, ఏపీఎస్‌సీహెచ్‌ఈ పేరిట హైదరాబాద్‌లో చెల్లేలా *500డీడీ తీసి ప్రధా న యూనివర్సిటీల లా క్యాంపస్ కళాశాలల్లో పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2012
పరీక్ష తేదీ: జూన్ 2, 2012
వెబ్‌సైట్: www.aplawcet.org/home.htm
ఎడ్‌సెట్-2012
డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి అవకాశం కల్పించే కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ). ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షే.. ఎడ్‌సెట్. ఈ పరీక్షలో ర్యాంకుతోనే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఏడాది వ్యవధి ఉండే బీఈడీ కోర్సులో ఫిజికల్ సెన్సైస్, బయోలాజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ మెథడాలజీల్లో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 610 బీఈడీ కళాశాలల్లో.. సుమారుగా 65,000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌సెట్ అర్హతలు, సిలబస్, పరీక్ష విధానం వివరాలు..
అర్హత: బీఏ/బీఎస్సీ/ బీకాం/బీఎస్సీ(హోంసైన్స్) /బీసీఏ/బీబీఎం 50 శాతం(రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం) మార్కులతో ఉత్తీర్ణత, లేదా పీజీ ఉత్తీర్ణత, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి: జూలై 1, 2012 నాటికి 19 ఏళ్లు ఉండాలి.
పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పార్ట్-ఎ, పార్ట్-బి అందరికీ కామన్‌గా ఉంటుంది. పార్ట్-సి అభ్యర్థి ఎంచుకున్న అంశంలో 100 మార్కులకు ఉంటుంది.
పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సస్, స్పెల్లింగ్, వొకాబ్యులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్; సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్; డెరైక్ట్ స్పీచ్, ఇన్ డెరైక్ట్ స్పీచ్‌లపై 25 ప్రశ్నలకు 25 మార్కులు.
పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్: వర్తమాన వ్యవహారాలతోపాటు సైంటిఫిక్ ఈవెంట్స్, పొరుగు దేశాల చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకాలజీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్‌లపై 15 ప్రశ్నలు అడుగుతారు.
టీచింగ్ ఆప్టిట్యూడ్: టీచింగ్ స్కిల్స్‌ను పరీక్షించేలా 10 ప్రశ్నలు అడుగుతారు. టీచర్లు-విద్యార్థుల మధ్య సంబంధాలు, విద్యార్థులకు బోధించడంలో టీచర్ల సామర్థ్యం, మంచి టీచర్ల లక్షణాలు, వ్యక్తిగత వైరుధ్యాలున్న విద్యార్థులకు బోధించడంలో బోధకుడి సమర్థత, జనరల్ ఇంటెలిజెన్స్, ఎనలిటికల్ థింకింగ్‌లపై ప్రశ్నలుంటాయి.
పార్ట్-సి: 100 మార్కులు. కింది అంశాల్లో ఏదైనా ఒక దాన్ని అభ్యర్థి రాయాల్సి ఉంటుంది.
1) మ్యాథమెటిక్స్-100
2) ఫిజికల్ సెన్సైస్(ఫిజిక్స్ - 50, కెమిస్ట్రీ - 50)
3) బయోలాజికల్ సెన్సైస్(బోటనీ-50,జువాలజీ-50)
4) సోషల్ సెన్సైస్(జాగ్రఫీ - 35, హిస్టరీ- 30, సివిక్స్ - 15, ఎకనామిక్స్-20) 5) ఇంగ్లిష్ -100
ఆప్షనల్స్ సిలబస్: మొదటి నాలుగు సబ్జెక్టులకు విద్యార్థులు తాము చదివిన డిగ్రీ సిలబస్‌ను బాగా చదువుకోవాలి. ఇంగ్లిష్‌కు మాత్రం ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు, ఇంటర్మీడియెట్ సిలబస్ నుంచి 50 ప్రశ్నలు, డిగ్రీ సిలబస్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా
ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం: నిర్దేశిత హెడ్‌పోస్టాఫీసుల్లోనూ, యాక్సిస్ బ్యాంక్ ప్రధాన శాఖల్లో * 150 నగదు చెల్లించి దరఖాస్తులు పొందొచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2012
పరీక్ష తేదీ: జూన్ 8, 2012
వెబ్‌సైట్: www.edcet2012.info

No comments:
Post a Comment