Saturday, March 24, 2012

బీటెక్ తర్వాత గేమ్ డిజైనింగ్ కోర్సులు చేయాలంటే?

గేమ్ డిజైన్‌లో అంత ర్లీనంగా ఉండేది యానిమేషనే. యానిమేషన్‌లో స్పెషల్ కోర్సుల ద్వారా గేమ్ డిజైన్‌లో స్థిరపడొచ్చు. ఐతే గేమ్ డిజైనర్లకు కోడింగ్‌పై ప్రావీణ్యం, కొత్తగా ఆలోచించగలగడం, సృజన, తర్కం లాంటివి అనివార్యం. ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోంది. కేవలం దీనికోసమే కొన్ని కంపెనీలు వెలిశాయి. మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఎక్స్‌బాక్స్ లాంటి ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ లాంటి చోట్ల కూడా సెవెన్ సీస్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలు కేవలం గేమింగ్ పరిశ్రమ కోసమే వెలిశాయి. 

డిజైనింగ్‌లో ఉన్నతస్థాయిలో స్థిరపడాలనుకుంటే ఐఐటీ-బాంబే నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్-(సీడ్) పరీక్ష రాయాలి. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ-బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్‌లతోపాటు ఐఐఎస్సీ బెంగళూరుల్లో మాస్టర్ ఇన్ డిజైన్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థల్లో వివిధ రకాల డిజైన్ కోర్సులు ఉన్నాయి. గేమింగ్ పరిశ్రమలో చేరాలనుకున్నవాళ్లు మాస్టర్ ఇన్ డిజైన్‌లో యానిమేషన్ కోర్సు ఎంపిక చేసుకోవాలి.

సీడ్ పరీక్ష ద్వారా ఐఐటీలతో పాటు మరికొన్ని సంస్థల్లో కూడా ప్రవేశం లభిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఐఐటీ-బాంబే వెబ్‌సైట్ www.iitb.ac.in లో లభిస్తాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్ కూడా డిజైనింగ్‌లో వివిధ కోర్సులు అందిస్తుంది. ఈ సంస్థ డిజైనింగ్ కోర్సుల్లో దేశంలోనే ప్రసిద్ధమైందిగా చెప్పుకోవచ్చు. ఇవేకా కుండా గేమ్ డెవలప్‌మెంట్, గేమ్ డిజైనింగ్ పేరుతో వివిధ సంస్థలు సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. 

కంపెనీ సెక్రటరీ కోర్సు వివరాలు తెలపండి? -కిషోర్ కుమార్, విశాఖపట్నం
ఈ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి... ఫౌండేషన్ ప్రోగ్రాం, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం, ప్రొఫెషనల్ ప్రోగ్రాం. ఇంటర్మీడియెట్ పూర్తికాగానే ముందుగా ఫౌండేషన్ కోర్సు చేయాలి. ఇందులో ఐదు సబ్జెక్టులు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్, బేసిక్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఫైనల్ అకౌంటింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ప్రతి ఏటా డిసెంబర్ , జూన్‌ల్లో జరుగుతాయి. 

మార్చి 31 లోపు పేరు నమోదు చేసుకుంటే... డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు, సెప్టెంబర్ 30లోపు నమోదు చేసుకుంటే... తర్వాత ఏడాది జూన్‌లో జరిగే పరీక్షలు రాయొచ్చు. ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం కోసం పేరు నమోదు చేసుకోవాలి. దీనిలో నూ ఉత్తీర్ణులు ఫైనల్ ప్రోగ్రాంలో చేరొచ్చు. కోర్సు పూర్తి చేసినవాళ్లు బహుళజాతి కంపెనీల్లో కంపెనీ సెక్రటరీగా స్థిరపడొచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu 

No comments:

Post a Comment