వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)- గౌహతి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీహెచ్‌డీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్ట్రికల్, మెకానికల్, సివిల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డిజైన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, సెంటర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, నానో టెక్నాలజీ. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ మెడికల్ సెన్సైస్/ వెటర్నరీ సెన్సైస్/ఫార్మసీలో పీజీ/ ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్)/ ఎంఆర్క్/మాస్టర్ ఆఫ్ డిజైన్/ఎంటెక్/ఎంఈ/ సైన్స్ సంబంధిత అంశాల్లో పీజీ. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోసం కనీసం 55 శాతం మార్కులతో ఆర్ట్స్/కామర్స్‌లో పీజీ. డ్యూయల్ డిగ్రీ కోర్సులు: ఎంటెక్+పీహెచ్‌డీ-కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఎంఏ: డెవలప్‌మెంటల్ స్టడీస్ అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. ఎంటెక్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ మాస్టర్ ఆఫ్ డిజైన్: అర్హత: సంబంధిత అంశంలో డిగ్రీ. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2012 వెబ్‌సైట్: http://www.iitg.ac.in ఐఐటీ ఖరగ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్ ఇంజనీరింగ్, సిటీ ప్లానింగ్‌లో జాయింట్ మాస్టర్, పీహెచ్‌డీ కోర్సు - ఎంటెక్/ఎంసీపీ-పీహెచ్‌డీలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: కనీసం 60 శాతం(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఎంపిక: గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా.. దరఖాస్తు ఫీజు: రూ.500(పీడీ/ఎస్సీ/ఎస్టీలకు రూ.250) దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012; వెబ్‌సైట్: http://gate.iitkgp.ernet.in/mtech మాస్టర్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్ ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్.. మాస్టర్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్(ఎంజీబీ)లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ సంస్థకు దుబాయ్, సింగపూర్, సిడ్నీల్లో క్యాంపస్‌లున్నాయి. కోర్సు కాలపరిమితి: 16 నెలలు(నాలుగు నెలల ఇంటర్న్‌షిప్) అర్హత: ఏదైనా అంశంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం మూడేళ్ల అనుభవం. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్: ఠీఠీఠీ.టఞ్జ్చజీ.ౌటజ ఎన్‌ఐడీలో ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం దిగువ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ(ఎన్‌ఐడీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంఏ: డిప్లొమసీ/ ఇంటర్నేషనల్ రిలేషన్స్/ సౌత్ ఏషియన్ అసోసియేషన్ అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. కోర్సు: ఎల్‌ఎల్‌ఎం అర్హత: ఎల్‌ఎల్‌బీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012 వెబ్‌సైట్: http://www.diplomacy.net.in ఎఫ్‌డీడీఐ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) వివిధ కోర్సు ల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మాస్టర్ డిగ్రీ కోర్సులు: ఫ్యాషన్ మార్కెంటైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, ఫుట్‌వేర్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, క్రియేటివ్ డిజైన్ అండ్ సీఈడీ/ సీఏఎం, లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీ డిజైన్, విజువల్ మార్కెంటైజింగ్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్, ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు: ఫ్యాషన్ మార్కంటైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీ డిజైన్. దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి. వెబ్‌సైట్: www.fddiindia.com |
Wednesday, March 21, 2012
ఐఐటీ గౌహతి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment