Tuesday, March 6, 2012

విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి స్కాలర్ షిప్స్


విదేశాలకు వెళ్లి చదువుకోవడమనేది కేవలం సంపన్నవర్గాలకే సాధ్యమన్నది ఒకప్పటి మాట. నేడు మధ్య, సామాన్య తరగతి విద్యార్థులు సైతం విదేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితులున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశాల్లోని అనేక విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉదారంగా ఉపకార వేతనాలందిస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఆసక్తి ఉన్నా అక్కడ లభించే ఉపకార వేతనాల గురించి విషయ పరిజ్ఞానం ఉండదు. ఉపకార వేతనాలకు సంబంధించిన అంశాలను విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకోవల్సి ఉంది. 
ఫుల్ బ్రైట్ నెహ్రూస్ మాస్టర్స్ ఫెలోషిప్ ఫర్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్: అమెరికా స్కాలర్‌షిప్‌కు అర్హమైన కోర్సులు: అమెరికాల్లోని విశ్వవిద్యాలయాల్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్ స్టడీస్, ఎకనామిక్స్, ఎన్విరాన్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రీజనల్ ప్లానింగ్, ఉమెన్స్ స్టడీస్ విభాగాల్లో ప్రొఫెషనల్ స్టడీస్ అభ్యసించే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. 
ఏం చెల్లిస్తారు: ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు, విమాన చార్జీలు, జే-1 వీసా. 
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి యూఎస్ బ్యాచిలర్ డిగ్రీకి సమానమైన నాలుగేళ్ళ డిగ్రీ కోర్సును పూర్తిచేసుండాలి. లేదా మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీతోపాటు రెండేళ్ళ పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా. అలాగే సంబంధిత విభాగంలో మూడేళ్ళ పని అనుభవం, లీడర్‌షిప్, కమ్యూనిటీ సర్వీసుల్లో అనుభవం ఉండాలి.
 వయస్సు: 25 నుంచి 30 సంవత్సరాలలోపుండాలి. 
ఇతర వివరాలకు: www.usief.org.in/scripts/ 

ఫుల్ బ్రైట్ లాంగ్వేజ్ టీచింగ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్: 
అమెరికా స్కాలర్‌షిప్‌కు అర్హమైన కోర్సులు: బెంగాలి/గుజరాతీ/హిందీ/ ఉర్దూ భాషను బోధించడానికి ఉద్దేశించిన ప్రోగ్రామ్ ఇది. అమెరికాలోని ఎంపిక చేసిన విశ్వవిద్యాలయ కళాశాలలో తొమ్మిది నెలలపాటు ఈ బోధన చేయాల్సి ఉంటుంది. ఈ ఉపకారవేతనాన్ని యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫండ్స్ అందజేస్తుంది.
 ఏం చెల్లిస్తారు: నెలవారీ స్టయిఫండ్, విమానచార్జీలు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు.
 అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ చేసుండాలి. అలాగే ప్రస్తుతం కాలేజీ స్థాయిలో ఇంగ్లీషు భాషను బోధిస్తుండాలి. లేదా ఉపాధ్యాయులకు శిక్షణనిస్తుండాలి. టోఫెల్‌స్కోరు, ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
ఇతర వివరాలకు: www.usiet.org.in/scripts 

ధి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీజీ లేదా పరిశోధన కోర్సులు చేసేవారికి ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు. స్కాలర్‌షిప్ లభించే కోర్సుల వివరాలు: కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మూడేళ్ళ డిగ్రీ, రెండేళ్ళ వ్యవధిగల ఎంలిట్, ఏడాది వ్యవధిగల పీజీ, మూడేళ్ళ పిహెచ్‌డి చేయదలచుకున్న వారికి ఈ ఉపకారవేతనాన్ని అందజేస్తారు. ఎలా ఎంపిక చేస్తారు: అకడమిక్ రికార్డు, ఆసక్తి మేధస్సుతోపాటు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా వున్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు: www.gatescholor.org 

కె.సి. మహీంధ్ర స్కాలర్‌షిప్ విదేశాలలో ఇంజనీరింగ్, నేచురల్ సైన్స్, మెడిసిన్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లలో పోస్టుగ్రాడ్యుయేషన్ అంశాలకు ఈ ఉపకార వేతనాలిస్తారు. అర్హత: అభ్యర్థులు ఫస్ట్‌క్లాస్‌లో బ్యాచిలర్ డిగ్రీని లేదా దానికి సమానమైన పరీక్షను పాసైవుండాలి. ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంతిస్తారు: ఈ ఉపకార వేతనం కింద 90,000 రూపాయలు ఇస్తారు. ఇతర వివరాలకు: మేనేజ్‌మెంట్ ట్రస్టీ, కె.సి. మహేంద్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్, మహాకవి భూషణ్‌మార్గ్, ముంబయి- 400001 అనే చిరునామాను సంప్రదించవచ్చు. నాటమల్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు అమెరికాలో విద్యనభ్యసించడానికి అర్హత పొంది ఉండాలి. లేదా దరఖాస్తు చేసిన వారు కూడా అర్హులే. ఏ కోర్సులకు: ఇంజనీరింగ్, మెడిసిన్‌తోపాటు ఇతర అధునాతన కోర్సుల ప్రవేశానికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు. మంచి అకడమిక్ రికార్డు ఉన్న అభ్యర్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఇతర వివరాలకు: కృష్ణన్ చంద్, చెల్లారామ్ కాలేజ్ చర్చిగేట్, ముంబయి - 400200ని సంపదించవచ్చు.

జెఎన్ టాటా స్కాలర్‌షిప్ విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు. ఏ కోర్సులకు: పీజీలోని అన్ని డిసిప్లిన్‌లకు. ఎంపిక ఎలా: ప్రాథమిక స్థాయిలో ఎన్నికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. చార్లెస్ వాలెస్ స్కాలర్‌షిప్స్ బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల కళాశాలల్లో విద్యను అభ్యసించడానికి రూపొందించిన ఉపకార వేతనాలివి. ఏఏ కోర్సులకు: కళలు, సంస్కృతి సంబంధ అంశాల్లో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఉద్దేశించినవి. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలనుంచి గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత రంగంలో డిప్లొమా లేదా సంబంధిత రంగంలో వృత్తి అనుభవం. అభ్యర్థుల వయస్సు 25-38 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ఎలా: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రోడ్స్ స్కాలర్‌షిప్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించాలనుకునే వారికి ఉద్దేశించిన ఉపకారవేతనాలివి. అర్హత: ప్రథమశ్రేణిలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వ్యస్సు 19 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ఎలా: ముంబాయి, బెంగుళూరు, కోల్‌కతా, ఢిల్లీలో రీజనల్ ఇంటర్వ్యూలు నిర్విహిస్తారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, ఢిల్లీలో నిర్వహించే ఫైనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏం చెల్లిస్తారు: ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, విమానచార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లిస్తారు. ఇతర వివరాలకు: www.rhodesscholarshipsindia.com 

డాక్టర్ మన్మోహన్‌సింగ్ స్కాలర్‌షిప్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి సైన్స్, టెక్నాలజీ, ఎకనామిక్స్, సోషల్ సైనె్సస్‌లలో డాక్టోరల్ ప్రోగ్రామ్స్ చేయదలచుకున్నవారికి ఈ ఫెలోషిప్ అందిస్తారు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రథమశ్రేణి మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలలో వుండాలి. అలానే కేంబ్రిడ్జి కాక ఇతర యూనివర్సిటీల్లో ప్రవేశానికి విధించిన అర్హత ప్రమాణాలను కూడా పొంది ఉండాలి. ఏం చెల్లిస్తారు: అకడమిక్ ఫీజులు, ప్రయాణ ఛార్జీలు, నెలసరి స్టయిఫండ్స్ వీసా ఖర్చులు. ఇతర వివరాలకు: www.britishcouncil.org 

ఐటిసి ఎఢ్యుకేషన్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ బ్రిటన్, అమెరికాల్లో బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చేసే వారికి ఈ స్కాలర్‌షిప్‌లిస్తారు. అర్హత: అభ్యర్థులు సంబంధిత అంశంలో అత్యధిక మార్కులతో డిగ్రీ చేసుండాలి. ఇతర వివరాలకు: కోల్‌కతాలోని చారింఘీలో ఉన్న ఐటిసి ఎడ్యుకేషనల్ ట్రస్టుకి రాసి పొందవచ్చు. ఆర్ట్ థింక్ సౌత్ ఏషియా ఫెలోషిప్ జర్మనీకి చెందిన కల్చరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అనే సంస్థ ఈ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తారు. ఏ కోర్సులకు: కళలు, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన విజువల్, ఫెర్మార్మింగ్ ఆర్ట్స్, మ్యూజియం స్టడీస్ అంశాల్లో జర్మనీలోని యూనివర్సిటీలో విద్యనభ్యసించే వారికి ఈ స్కాలర్‌షిప్‌లిస్తారు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా మూడేళ్ళ పని అనుభవం. ఇతర వివరాలకు: www.arthinksouthasia.org.

No comments:

Post a Comment