Friday, March 2, 2012

ఎంసెట్‌లో విజయానికి..

ఎంసెట్.. రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థుల లక్ష్యం. వందల్లో కాలేజీలు.. 
లక్షల్లో సీట్లున్నా పోటీ ఏటేటా పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. 
కారణం.. ప్రతి విద్యార్థి పేరెన్నిక గల కళాశాలలో సీటు సాధించడమే ఆశయంగా పెట్టుకోవడం. అందుకోసం ఇంటర్మీడియెట్‌లో చేరిన మొదటి రోజు నుంచే కష్టపడటం.

మరి ఆ పోటీలో ముందుండాలంటే.. మెచ్చిన కాలేజీలో నచ్చిన బ్రాంచ్‌లో అడుగుపెట్టాలంటే.? ఎంసెట్‌లో మూడంకెలల్లోపు ర్యాంకు పొందడమే. ఈ నేపథ్యంలో మెరుగైన ర్యాంకు ఎలా పొందాలి? దీనికోసం సబ్జెక్టు వారీగా నిపుణులందిస్తున్న సూచనలు..

మ్యాథమెటిక్స్


ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మ్యాథమెటిక్స్‌దే కీలక పాత్ర. 
మొత్తం 160 ప్రశ్నల్లో 80 ప్రశ్నలు మ్యాథమెటిక్స్ నుంచే. వీటిలో 65 నుంచి 70 ప్రశ్నల వరకు సులభంగా లేదా ఓ మోస్తరుగా ఉంటాయి. 
మొదటి సంవత్సరం నుంచి సిలబస్‌ను అనుసరించి చదివిన ప్రతి విద్యార్థి సమాధానమిచ్చే విధంగా ఉంటాయి. 
ఈ క్రమంలో ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు దాదాపు సమాన వెయిటేజీ ఉంటుంది. 

ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షలు పూర్తయ్యాక లభించే 55 రోజుల సమయంలో మొదటి 25 రోజులు సిలబస్‌లోని అన్ని చాప్టర్లను మరోసారి రివిజన్ చేసుకోవాలి. 
ఆ తర్వాత వీలైనన్ని ఎక్కువ గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి. 
ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్ష కాబట్టి విద్యార్థులు వేగం, అదే సమయంలో కచ్చితత్వం అలవర్చుకోవాలి. 
దీనికోసం గ్రాండ్‌టెస్ట్‌లు ఎంతో ఉపకరిస్తాయి. 
{పతి టాపిక్‌కు సంబంధించి ఫండమెంటల్స్‌పై దృష్టి సారించాలి. 

ముఖ్యంగా ఇంటెగ్రల్ కాలిక్యులస్, 3డి-జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, వెక్టార్-అల్జీబ్రా, ట్రెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, బైనామియల్ థీరం, మాట్రిక్స్, డెఫినెట్ డిఫరెన్షియల్ కాలిక్యులస్ అండ్ సర్కిల్స్‌పై సంపూర్ణ పట్టు సాధించాలి. 
ఇక ఐఐటీ, ఏఐఈఈఈకి కూడా సన్నద్ధమయ్యే విద్యార్థులు ఏప్రిల్ 8 వరకు ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం లాభిస్తుంది. 

ప్రిపరేషన్ దశలు:
బాగా ముఖ్యమైన కాన్సెప్ట్‌లను గుర్తించాలి. ఎంసెట్ గత ప్రశ్న పత్రాల ఆధారంగా వెయిటేజీ ప్రకారం ప్రాథమ్యాలను నిర్దేశించుకోవాలి. 

అత్యంత ముఖ్యమైనవిగా భావించే ప్రతి కాన్సెప్ట్‌కు సంబంధించి క్లాస్ నోట్స్, మెటీరియల్‌ను సమీకృతం చేసుకుంటూ చదవాలి. చదివేటప్పుడే ఒక అంశం నిర్వచనం, వివరణ, అన్వయంలపై పరిజ్ఞానం పొందాలి. 

ప్రతి చాప్టర్‌లోని సినాప్సిస్‌పై అవగాహన పొందాలి. నిపుణుల సహాయంతో షార్ట్‌కట్ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.

కాలిక్యులస్, అల్జీబ్రా నుంచి అధిక శాతం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. 
ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత ప్రతి రోజు మ్యాథ్స్ కోసం 7 నుంచి 8 గంటలు కేటాయించాలి. 
ఇందులో రెండు గంటలు రివిజన్‌కు, మిగతా సమయం చాప్టర్‌వైజ్‌గా సమస్యల సాధనకు విభజించుకోవాలి. 

నిర్దిష్ట ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసే సమయంలో లాజిక్స్, మినహాయింపులు, ఆ సమస్యను ఎన్ని కోణాల్లో అడగొచ్చు? అనే అంశాలు విశ్లేషించుకుంటూ సాల్వ్ చేస్తే పరీక్ష హాల్లో సులభంగా ఉంటుంది. 

రిఫరెన్‌‌స బుక్స్
ఇంటర్మీడియెట్ మ్యాథమెటిక్స్ అకాడెమీ బుక్స్
ఎంసెట్ మ్యాథమెటిక్స్ - ఎస్.చాంద్ పబ్లికేషన్‌‌స
లిల్లీపుట్ వ్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్

-ఎం.ఎన్.రావు,
శ్రీచైతన్య విద్యా సంస్థలు

..........

కెమిస్ట్రీ


ఎంసెట్ విజయంలో కెమిస్ట్రీది కీలక పాత్ర అనేది నిస్సందేహం. కారణం ఈ సబ్జెక్ట్‌లోని ప్రశ్నలు కాస్త సులభంగా, తక్కువ సమయంలో సమాధానమివ్వగలిగనవై ఉండటమే. ఇష్టం పెంచుకుంటే కెమిస్ట్రీ కష్టం కాదు అని గుర్తించాలి. ఈ క్రమంలో కెమిస్ట్రీలోని మూడు ముఖ్య విభాగాలు (ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్) ఎలా చదవాలో చూద్దాం..

ఫిజికల్ కెమిస్ట్రీ:
ఇది పూర్తిగా భావనలు (కాన్సెప్ట్)పై ఆధారపడిన విభాగం. కాబట్టి కాన్సెప్ట్ అవగతం చేసుకోవడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి. 

పలు ఫార్ములాలను అనువర్తిస్తూ వివిధ సమస్యలు ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములా ప్రొఫైల్‌పై పట్టు సాధించి నిరంతరం రివిజన్ చేసుకోవాలి.

ఆర్గానిక్ కెమిస్ట్రీ:
ఈ విభాగం కష్టమైంది. సమయం ఆదా కో ణంలో ఎంతో సులభమైంది, ముఖ్యమైంది. 
ఆర్గానిక్ కెమిస్ట్రీని కేవలం రీడింగ్‌కు పరిమితం చేయకుండా మ్యాథ్స్ మాదిరిగా ప్రాక్టీస్ చేయడం అవసరం.

సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్, ఫ్లోచార్ట్స్, మూలకాల తయారీ పద్ధతులు, ధర్మాలు అనే కోణాల్లో నిర్ణీత క్రమ పద్ధతిలో చదవాలి. వాటిని నిరంతరం రివిజన్ చేసుకోవాలి.

ఇనార్గానిక్ కెమిస్ట్రీ
ఎన్నో అంశాలు చదివి గుర్తు పెట్టుకోవాల్సిన విభాగం. అదేవిధంగా చదివిన అంశం త్వరగా మర్చిపోయే ప్రమాదం కూడా ఉన్న విభాగం ఇనార్గానిక్ కెమిస్ట్రీ.
ఈ విభాగాన్ని సులభం చేసుకోవాలంటే అన్ని గ్రూపు మూలకాల సాధారణ ధర్మాలను పోల్చుకుంటూ చదవాలి. 

ఆయా మూలకాల తయారీ ధర్మాలు, వాటిలో వినియోగించే ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రోడిక్ ప్రతిచర్యలు వంటివాటితో పట్టిక రూపొందించుకుంటే ఈ విభాగాన్ని కూడా సులువుగా మార్చుకోవచ్చు. 

రిఫరెన్‌‌స బుక్స్
ఇంటర్మీడియెట్ తెలుగు అకాడెమీ బుక్స్
లిల్లీ పుట్ వ్యూ ఆఫ్ కెమిస్ట్రీ

-వి.కుమార్, డీన్, శ్రీచైతన్య విద్యా సంస్థలు

.................

ఫిజిక్స్


అన్ని చాప్టర్లలోని ప్రాథమిక భావనలను రివిజన్ చేయాలి. ఫార్ములాలతో పట్టికలు రూపొందించుకోవాలి. అంతేకాకుండా ఆ ఫార్ములాలను అన్వర్తించే సందర్భాలు, విధానాలపైనా పట్టు సాధించాలి. దీనికోసం ఒకే ప్రశ్నను రెండు మూడు పద్ధతుల్లో సాధన చేయాలి. 

శక్తినిత్యత్వ సూత్రం, కిర్కాఫ్ నియమాలు, ఫ్లెమింగ్ ఎడమ, కుడి చేతి సూత్రాలు, అక్షి కటకాలు వాటి పనితీరుపై అవగాహన పొందాలి. 

ఇక బోర్డ్ పరీక్షలు పూర్తయ్యాక మొదటి సంవత్సరం సిలబస్‌పై దృష్టి సారించాలి. ఆ తర్వాతే ఎంసెట్ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టిండి.

ఫిజిక్స్‌లోని ప్రతి చాప్టర్ నుంచి ఎంసెట్‌లో కనీసం ఒక మార్కు ప్రశ్న అడుగుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రో స్టాటిక్స్, ఎలక్ట్రో మాగ్నటిజం చాప్టర్ల నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు చొప్పున అడిగే అవకాశం ఉంది. అదే విధంగా ఆధునిక భౌతిక శాస్త్రం, మెకానిక్స్‌ను బాగా పునశ్చరణ చేసుకోవాలి. 

థియరీ బేస్డ్ ప్రశ్నలు అడిగే మోడ్రన్ ఫిజిక్స్, సెమీ కండక్టర్ డివెజైస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌పై సమగ్ర అవగాహన పొందాలి. 

క్రమ పద్ధతిలో అంశాల జాబితా రూపొందించుకోవడం, పిక్టోరియల్ విధానం వంటి వాటితో ఎక్కువగా గుర్తుంచుకునే నేర్పు లభిస్తుంది.

రిఫరెన్స్ బుక్స్: 
తెలుగు అకాడెమీ ఇంటర్మీడియెట్ ఫిజిక్స్ పుస్తకాలు, 
తెలుగు అకాడెమీ ఎంసెట్ బుక్స్, అరిహంత్ పబ్లికేషన్‌‌స
-జి. విజయసారథి,
శ్రీచైతన్య విద్యా సంస్థలు
.............................
ఎంసెట్-2012 సమాచారం

ఎంసెట్ ద్వారా సీట్లు లభించే కోర్సుల వివరాలు..
బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్)/బీటెక్(డెయిరీ టెక్నా లజీ)/బీటెక్ అగ్రి ఇంజనీరింగ్. ఇవి కాకుండా బీఫా ర్మసీ, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ కమర్షియల్ అగ్రి అండ్ మేనేజ్‌మెంట్ (సీఏ అండ్ బీఎం) కోర్సుల్లో 50 శాతం సీట్లు

వయోపరిమితి: 
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు డిసెంబర్ 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. 

బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/బీటెక్ (అగ్రి ఇంజనీరింగ్), బీటెక్ ఎఫ్‌ఎస్‌టీ/బీఎస్సీ సీఏ అండ్ బీఎం కోర్సులకు డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 22 ఏళ్లు మించరాదు.

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ బయో టెక్నా లజీ సబ్జెక్టులలో 45 శాతం మార్కులతో ఇంటర్మీడియె ట్ ఉత్తీర్ణత లేదా సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియె ట్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఇంటర్మీడియెట్ బోర్డ్ నిర్వహించే బ్రిడ్జి కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

బీఎస్సీ (అగ్రి)/బీఎస్సీ (హార్టి)/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్‌ఎస్సీ. ఇవి కాకుండా బీటెక్ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏబీఎం)లో 50 శాతం సీట్లు
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 22 ఏళ్లు మించరాదు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.

ఎంబీబీఎస్, బీడీఎస్
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
అర్హత: ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ/బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
బీఏఎంఎస్/బీహెచ్‌ఎంఎస్/బీఎన్‌వైఎస్
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. బీఎన్‌వైఎస్ కోర్సుకు 22 ఏళ్లు మించరాదు. బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సులకు గరిష్ట వయోపరిమితి లేదు.

అర్హత: ఫిజిక్/కెమిస్ట్రీ/బోటనీ, జువాలజీ సబ్జెక్టులో 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
బీఫార్మసీ: బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు 50 శాతం
చొప్పున సీట్లు ఉంటాయి.

వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. 
అర్హత: ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఫార్మాడి (బైపీసీ విద్యార్థులకు 50 శాతం, ఎంపీసీ విద్యార్థులకు 50 శాతం)
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు మించరాదు.

అర్హత: ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్/బయాలజీ సబ్జెక్టులో 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ద రఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 12, 2012
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2012
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 26, 2012
రాత పరీక్ష తేదీ: మే 12, 2012
వెబ్‌సైట్: www.apeamcet.org

No comments:

Post a Comment