బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. దీంతోపాటు అనుబంధంగా చేసే షార్ట్ టర్మ్ కోర్సులను తెలపండి? -నిఖిల్, కరీంనగర్
ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో విద్యార్థులు తమ డిగ్రీలకు అదనపు అర్హతలు సమకూర్చుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో వారు ముందుగా కంప్యూటర్ కోర్సులపై దృష్టి సారిస్తే.. పరిజ్ఞానంతోపాటు ఉద్యోగ సాధనలో కూడా అవి తోడ్పడతారుు. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులకు పలు షార్ట్‌టర్మ్ కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నారుు.
యునిక్స్, లినక్స్, ఎంఎస్ ఆఫీస్, వెబ్ డిజైనింగ్, ఈ- కామర్స్, ఇంటర్నెట్ ఆపరేషన్స్, మల్టీ మీడియూ, వెబ్ డిజైనింగ్, యూనిమేషన్ ప్రస్తుతం క్రేజ్... కెరీర్ స్కోప్ ఉన్న షార్ట్‌టర్మ్ కోర్సులు. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులకు పైకోర్సులతోపాటు సి, సి++, డేటాస్ట్రక్చర్, ఆటో క్యాడ్, జావా వంటి కోర్సులు కెరీర్ ఉన్నతికి దోహదం చేస్తారుు.
వీటితోపాటు వేగంగా గ్రహించే శక్తి, విశ్లేషణ సామర్థ్యం ఉన్న విద్యార్థులకు ఒరాకిల్, జావా, టెస్టింగ్ టూల్స్.. శాప్, పీపుల్ సాఫ్ట్ వంటి ఈఆర్‌పీ సొల్యూషన్స్ అనుకూల కోర్సులు. ఎన్‌ఐఐటీ, అప్‌టెక్ వంటి పలు ప్రైవేట్ సంస్థలు ఈ తరహా కోర్సులను ఆఫర్ చేస్తున్నారుు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రంగమేదైనా.. ఎంట్రీ లెవల్ పోస్టరుునా..ఉన్నత స్థానమైనా..ఏ ఉద్యోగానికైనా ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో డిగ్రీ స్థారుులోనే ఇంగ్లిష్ పరిజ్ఞానం సాధించే దిశగా పునాదులు వేసుకోవాలి. కాబట్టి స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కోర్సుల్లో చేరడం లాభిస్తుంది. దీనివల్ల భావాన్ని వ్యక్తం చేసే కనీస సామర్థ్యం సొంతమవడంతోపాటు లిజనింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అలవడతారుు.
దీంతోపాటు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవడం కూడా కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా అకౌంటింగ్ ప్యాకేజ్‌లు, బీపీఓ ట్రైనింగ్, మెడికల్ ట్రాన్స్‌కిప్షన్, కాల్‌సెంటర్ వంటి అవకాశాలను కూడా ఎంచుకోవచ్చు.
..........................
ఎంబీఏ (హెచ్‌ఆర్‌ఎం) చేస్తున్నాను. దీంతో పాటు కెరీర్ మెరుగు కోసం చేయదగ్గ పార్ట్ టైమ్ కోర్సులను సూచించండి? - చరణ్, నిర్మల్
నేటి పోటీ ప్రపంచంలో కెరీర్‌లో వేగంగా ఎదగాలంటే.. అర్హత కోర్సులతోపాటు అదనపు కోర్సులు చేయడం తప్పనిసరి. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ అభ్యర్థులు కార్పొరేట్ ప్రపంచంలో దూసుకెళ్లాలంటే సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి కేంద్రీకరించాలి. అందులో భాగంగా పర్సనల్ స్కిల్స్, ఆప్టిమిజమ్, టైమ్ మేనేజ్‌మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషియబిలిటీ, బిజినెస్ కమ్యూనికేషన్, నెగోషియేషన్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్, లీడర్‌షిప్ వంటి ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి.
అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అత్యవసరం. కాబట్టి ఈ అంశాలకు సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్సులను చేయడం లాభిస్తుంది. అలాగే మీ కోర్సుకు సంబంధించిన నాలెడ్జ్ మరింత విస్తృతం చేసుకోవడానికి ఎస్‌ఏపీ (సాప్)-హెచ్‌ఆర్, సైకాలజీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ కోర్సులు చేయవచ్చు.
....................
పీజీ స్థాయిలో నానో టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -రవి, ఖమ్మం.
పరిశోధనల పరంగా విస్తృత పరిధి ఉన్న రంగం నానో టెక్నాలజీ. అణువు, పరమాణువుల సమ్మేళనమే నానో టెక్నాలజీ. దీని అనువర్తనాలను మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు, టెక్స్‌టైల్ పరిశ్రమల్లో వినియోగిస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా పరిశోధనలకు ప్రోత్సాహం ఇస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
పీజీస్థాయిలో నానో టెక్నాలజీ ఆఫర్‌చేస్తున్న వర్సిటీలు:
జేఎన్‌టీయూ-హైదరాబాద్.
వివరాలకు: http://jntu.ac.in
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పుట్టపర్తి: వివరాలకు: www.sssihl.edu.in
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -తమిళనాడు
వివరాలకు: www.vit.ac.in
అమిటీ యూనివర్సిటీ-నోయిడా
వివరాలకు: www.amity.edu
..........................
బీఈడీ పూర్తి చేశాను. టీచింగ్ కెరీర్‌లో స్థిర పడాలనుకుంటున్నాను. ఎంఎస్సీ/ ఎంఈడీలలో ఏ కోర్సు ఎంచుకోవాలి? -రమేశ్, కాకినాడ
బీఈడీ పూర్తి చేశారు. టీచింగ్ కెరీర్‌లో స్థిరపడాలను కుంటున్నారు కాబట్టి.. ఎంఎస్సీ/ఎంఈడీలలో ఎంఎస్సీ ఎంచుకోవడం లాభిస్తుంది. ఎంఎస్సీ కోర్సు చేయడం వల్ల టీచింగ్ చేసే సబ్జెక్ట్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ థియరీస్, కాన్సెప్ట్స్, టాపిక్స్‌ను అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. దీని వల్ల సబ్జెక్ట్‌పై మరింత పట్టు లభించడమేకాకుండా విద్యార్థులకు మరింత అవగాహనతో పాఠాలు చెప్పే వీలుంటుంది.
ముఖ్యంగా ఈ అంశం టీచింగ్ కెరీర్‌లో స్థిర పడాలనుకుంటున్న మీలాంటి వారికి కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇతోధికంగా దోహద పడు తుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఎంఈడీని చేయ వచ్చు. ఎంఈడీ చేయడం వల్ల టీచింగ్‌కు సంబంధించి మరిన్ని అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీలును బట్టి ఈ కోర్సును రెగ్యులర్/ డిస్టెన్స్ రెండు విధాలుగా చేయవచ్చు.
మన రాష్ట్రంలో ఎంఈడీని రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
No comments:
Post a Comment