Wednesday, June 27, 2012

ఇంటర్‌తోనే పీజీకి మార్గం ఇంటిగ్రేటెడ్ కోర్సులు

డిగ్రీ.. అది పూర్తయ్యాక పీజీ. సాధారణంగా ఈ రెండు చదవాలంటే వేర్వేరు చోట్లే సాధ్యం! పైగా డిగ్రీ పూర్తయ్యాక పీజీలో చేరాలంటే.. ఏదైనా యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు రాసి తీరాలి. ఇప్పుడు కాలం మారింది. డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి వివిధ ఐఐటీలు, కేంద్రీయ, రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ పీజీలను అందిస్తోన్న వర్సిటీలు.. కోర్సులపై విశ్లేషణ...

ఎవరు అర్హులు:
ఇంటర్మీడియెట్ చదివిన వారెవరైనా ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసించొచ్చు. ఈ కోర్సుల వ్యవధి ఐదేళ్లు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్, సైన్స్ డిగ్రీ, పీజీ చదవచ్చు. లేదంటే.. ఇంటర్ అర్హతతో లా, మేనేజ్‌మెంట్, కామర్స్ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు. ఐదేళ్ల ఈ కోర్సుల్లో చేరి, మూడేళ్లకే మానేస్తే వారికి డిగ్రీ వస్తుంది. నాలుగేళ్లు చదివితే డిగ్రీ(ఆనర్స్) ఇస్తారు. పూర్తిగా ఐదేళ్లు చదివితే ఐదేళ్ల పీజీ చేతికి వస్తుంది. 

గుర్తింపు ముఖ్యమే:

ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా, ఆ కోర్సులకు గుర్తింపు లేదని ఏపీపీఎస్సీ మెలిక పెట్టగా.. యూనివర్సిటీ అధికారులు రాసిన లేఖలకు సమాధానంగా యూజీసీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ), ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు గుర్తింపు ఉందని పేర్కొన్నాయి. ఈ మేరకు యూనివర్సిటీకి లేఖలు అందాయి. దీంతో వివాదం సుఖాంతమైంది. కాబట్టి సంబంధిత వర్సిటీలు అందించే కోర్సులకు గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని చేరడం మంచిది.

అదేవిధంగా కోర్సులను కూడా పూర్తిగా ఐదేళ్లు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీని ప్రకారం మూడేళ్లు పూర్తయ్యాక డిగ్రీ పట్టా ఇవ్వకపోవచ్చు! మూడేళ్ల పట్టా ముందుగానే ఇచ్చేస్తే ఈ కోర్సుల ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడమే దీనికి కారణం. కాబట్టి విద్యార్థులు కోర్సుల్లో చేరే ముందే అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. 

మన రాష్ర్టంలో..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు

ఎంఎస్సీ నానోటెక్నాలజీ
అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ద్వారా
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం

ఎంఎస్ అప్లైడ్ కెమిస్ట్రీ: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత.
ఎంఎస్ జియాలజీ: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత.
ఎంఎస్ ఎకనామిక్స్:
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ రాత పరీక్ష ఆధారంగా
వెబ్‌సైట్: www.andhrauniversity.info

ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి

ఎంఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్: సీట్లు: 30
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ప్రథమ శ్రేణిలో ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంఎస్ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్: సీట్లు: 30
అర్హత: ఇంటర్ ఎంపీసీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
ఎంఎస్ బయోటెక్నాలజీ: సీట్లు: 20
అర్హత: బయాలజీ, ఫిజిక్స్‌తో ఇంటర్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
ఎంఎస్ మైక్రో బయాలజీ: సీట్లు: 15
అర్హత: బయాలజీ, ఫిజిక్స్‌తో ఇంటర్ ప్రథమ శ్రేణి.
ఎంఎస్ ఎకనామిక్స్: సీట్లు: 30
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ రాతపరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.nannayauniversity.info/

కాకతీయ యూనివర్సిటీ-వరంగల్

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు:
కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ; ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ
ఎంపిక: కేయూసెట్‌లో ర్యాంక్ ఆధారంగా
వెబ్‌సైట్: www.kuwarangal.com

నేషనల్ లా యూనివర్సిటీ-విశాఖపట్నం

ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత
{పవేశం: క్లాట్‌లో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్: www.apulvisakha.org/

జేఎన్‌టీయూ-కాకినాడ

ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్:
కోర్సులు: బీటెక్(ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్, ఈఈఈ)
వెబ్‌సైట్: http://jntuk.edu.in/ 

ఇంటిగ్రేటెడ్ పీజీతో ప్రయోజనాలు

- ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కోర్సులు పూర్తి చేయాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ పీజీలు ఎంతో ప్రయోజనకరం. 
సంప్రదాయ కోర్సులకు భిన్నంగా విద్యార్థులు జ్ఞా నాన్ని సముపార్జించేందుకు వీలుగా... అతి ముఖ్యమైన, అవసరమైన అంశాల బోధన, అప్లికబిలిటీ ఉండే విధంగా కోర్సుల రూపకల్పన ఉంటుంది. 

- పాఠ్యాంశాలపై లోతైన విశ్లేషణ, ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వడం ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రత్యేకత. 

- డిగ్రీ, పీజీలను సమ్మిళితం చేస్తున్న ఈ పీజీల పట్ల విద్యార్థుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రవేశానికి ఇంటర్మీడియెట్ అర్హత కావడంతో.. ఏ కెరీర్‌లో స్థిరపడవచ్చో ముందుగానే అవగాహనకు వచ్చే వీలుంటుంది. 

- {పస్తుతం ఆర్ట్స్, సైన్స్, లా, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ ఇలా.. అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మార్చి- మే లోపు వీటిల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

- మొదటి మూడేళ్లు పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ కూడా విద్యార్థుల చేతికందుతుండటం ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల ప్రత్యేకత. 

కేంద్రీయ విద్యా సంస్థల్లో..

ఎన్‌ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు:
ఎన్‌ఐటీ-రూర్కెలా (ఒడిశా) అందిస్తోన్న కోర్సులు:
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-ఫిజిక్స్;కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్

ఐదేళ్ల బీటెక్-ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్
బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ ఇండస్ట్రియల్ సిరామిక్స్ 
బీటెక్-ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్
బీటెక్ సివిల్ అండ్ ఎంటెక్ ట్రాన్స్‌పోర్టేషన్
బీటెక్ సివిల్ అండ్ ఎంటెక్ వాటర్‌రిసోర్స్
బీటెక్-ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
బీటెక్-ఎంటెక్ మైనింగ్ ఇంజనీరింగ్
బీటెక్-ఎంటెక్ మెటలర్జికల్ - మెటీరియల్స్ సైన్స్
బీటెక్ సీఎస్‌ఈ అండ్ ఎంటెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.
{పవేశం: ఏఐఈఈఈ ర్యాంక్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.nitrkl.ac.in/

ఏబీవీ-ఐఐఐటీఎం-గ్వాలియర్

బీటెక్+ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్; బీటెక్+ఎంబీఏ
{పవేశం: ఏఐఈఈఈ ర్యాంక్ ఆధారంగా.
వెబ్‌సైట్: www.iiitm.ac.in/

ఐఐఎంలలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు:
సంస్థ: ఐఐఎం-ఇండోర్
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
అర్హత: 60 శాతం మార్కులతో పదోతరగతితోపాటు 10+2లో ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.
వెబ్‌సైట్: www.iimidr.ac.in/ 

ఐఐఎస్‌ఈఆర్-భోపాల్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం క్యాంపస్‌లు

కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
వెబ్‌సైట్: www.iiser-admissions.in


పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు:
అప్లైడ్ జియాలజీ; కెమిస్ట్రీ; ఫిజిక్స్; మ్యాథమెటిక్స్; కంప్యూటర్ సైన్స్; స్టాటిస్టిక్స్; ఎకనామిక్స్
అర్హత: 50 శాతం మార్కులతో 10+2లో ఎంపీసీ ఉత్తీర్ణత. ఎకనామిక్స్‌కు 10+2లో (మ్యాథ్స్ ఆప్షనల్‌గా).
ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు:
హిస్టరీ; పొలిటికల్ సైన్స్; సోషియాలజీ
అర్హత: 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత.
ఎంపిక: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.pondiuni.edu.in/

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ సెన్సైస్:
మ్యాథమెటికల్ సెన్సైస్; సిస్టమ్స్ బయాలజీ; ఫిజిక్స్; కెమికల్ సెన్సైస్
అర్హత: 60 శాతం మార్కులతో సైన్స్ గ్రూప్‌తో ఇంటర్.
ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ సోషల్ సెన్సైస్:
ఎకనామిక్స్; హిస్టరీ; పొలిటికల్ సైన్స్; సోషియాలజీ; ఆంత్రోపాలజీ
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ హ్యుమానిటీస్:
హిందీ; తెలుగు; ఉర్దూ; లాంగ్వేజ్ సెన్సైస్
అర్హత: 60శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
{పవేశం: యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఆధారంగా 
వెబ్‌సైట్: www.uohyd.ac.in/

ఐఐటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు:

అప్లైడ్ జియాలజీ
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
అప్లైడ్ మ్యాథమెటిక్స్ 
సంస్థ: ఐఐటీ-మద్రాస్
అప్లైడ్ ఫిజిక్స్
సంస్థ: ఐటీ-బీహెచ్‌యూ, వారణాసి
కెమిస్ట్రీ
సంస్థ: ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్, మద్రాస్, ఐఎస్‌ఎం-ధన్‌బాద్
ఎకనామిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్
మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్, ఐఎస్‌ఎం-ధన్‌బాద్
ఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-మద్రాస్

ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యుయెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్:

బయోలాజికల్ సెన్సైస్, ఫిజిక్స్
సంస్థ: ఐఐటీ-ఖరగ్‌పూర్
వెబ్‌సైట్: www.iitkgp.ac.in/

ఐదేళ్ల ఎంఎస్సీ టెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు:

అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్
సంస్థ: ఐఎస్‌ఎం-ధన్‌బాద్
వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in/

No comments:

Post a Comment