విదేశీ భాష నేర్చుకోవడం ఒకప్పుడు హాబీ. ఇప్పుడు అదే అవకాశాలకు బాట వేస్తోంది. ఫారిన్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం సంపాదిస్తే... ట్రాన్స్‌లేషన్, ఇంటర్‌ప్రిటేషన్, టీచింగ్, రీసెర్చ్‌ల్లో దేశ, విదేశాల్లో కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలోని జాబ్స్‌తో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, రాయబార కార్యాలయాలు, మల్టీనేషనల్ కంపెనీలు, కాల్ సెంటర్స్, టూరిజం సంస్థల్లో అవకాశాలు మెండు. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, అరబిక్, పర్షియన్, పోర్చుగీస్, చైనీస్, జపనీస్, రష్యన్... ఇలా ఏ ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా.. ఉపాధికి ఢోకా లేదు. ఫారిన్ లాంగ్వేజెస్ ఎందుకంటే... గ్లోబలైజేషన్‌తో.. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడింది. మన దేశం.. విదేశాలతో కుదుర్చుకున్న అవగాహనల ఫలితంగా.. వచ్చే సమాచారాన్ని క్రోడీకరించడం, నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో ఫారిన్ లాంగ్వేజెస్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి దేశానికీ ఏదో ఒక విషయంలో అవసరం/కొరత ఉంటుంది. ఆ కొరత తీరాలంటే.. ఇతర దేశాల సహకారం అనివార్యం. చైనాలో ఇంగ్లిష్ శిక్షకుల కొరత చాలా ఎక్కువ. జపాన్‌కు ఇంజనీర్లు, మలేషియాకు ఉపాధ్యాయులు, అమెరికాకు నర్సులు బాగా అవసరం. ఇక్కడ నిపుణులు అక్కడ పనిచేయాలంటే ఆ దేశాల భాషలు నేర్చుకోలి. విదేశీ సంస్థల కార్యాలయాలు భారత్‌లోనూ.. భారత్‌కు చెందిన సంస్థల కార్యాలయాలు విదేశాల్లో ఏర్పాటవుతున్నాయి. వీరి మధ్య భాషా సంధనకర్తలు అవసరం. అందుకే పరదేశీ భాషలు... అవకాశాలకు బాటలేస్తున్నాయి. బహుళజాతి కంపెనీ ఉద్యోగులు కొన్నిసార్లు క్లైంట్‌తో కలిసి పనిచేయడం, వాళ్లతో మమేకం కావడం తప్పనిసరి. ఇద్దరికీ ఇంగ్లిష్ రానప్పు డు క్లైంట్ భాష వచ్చిన వారికే ఆన్‌సైట్ ఆఫర్. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వారి భాష మనకు తెలిస్తే టూరిస్ట్ గైడ్‌గా వ్యవహరించొచ్చు. పెద్ద హోటళ్లలోనూ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. మారుతున్న వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఒక భాషలోని సమాచారం మరో భాషలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఎక్కువైంది. పుస్తకాలు బాగా అనువాదమవుతున్నాయి. కాబట్టి విదేశీ భాషపై పట్టు ఉంటే ట్రాన్స్‌లేటర్ కావొచ్చు. అవుట్ సోర్సింగ్, మెడికల్ ట్రా న్స్‌క్రిప్షన్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో విదేశీ భాషలు వచ్చినవారి సేవలు తప్పనిసరి. ప్రవేశం.. కోర్సులు: దేశంలో ఫారిన్ లాంగ్వేజెస్‌కు సంబంధించి వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని వర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్‌తో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఫ్లూ), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ.. పీహెచ్‌డీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆఫర్ చేస్తోన్న యూనివర్సిటీలు/సంస్థలు: ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ కోర్సులు రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. డిగ్రీలో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత భాష డిగ్రీ స్థాయిలో చదివినవాళ్లు అర్హులు. జూనియర్ డిప్లొమా: ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, మోడర్న్ అరబిక్, పర్షియన్ కోర్సులు రెగ్యులర్ విధానంలో నిర్వహిస్తోంది. కోర్సు వ్యవధి ఏడాది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. సీనియర్ డిప్లొమా: ఫ్రెంచ్, జర్మన్, రష్యన్. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో జూనియర్ డిప్లొమా ఉత్తీర్ణులు, డిగ్రీలో సంబంధిత భాష చదివిన వాళ్లు ఈ కోర్సుకు అర్హులు. ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్ డిప్లొమా: ఫ్రెంచ్, జర్మన్, రష్యన్. సంబంధిత భాషలో సీనియర్ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంఫిల్: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ కోర్సులు నిర్వహిస్తోంది. పీజీలో సంబంధిత భాషలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. పీహెచ్‌డీ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్. అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత, లేదా ఆ సబ్జెక్టులో ఎంఫిల్ ఉత్తీర్ణత. వెబ్‌సైట్: www.osmania.ac.in రామకృష్ణ మఠం, హైదరాబాద్ ఆఫర్ చేస్తోన్న కోర్సులు: జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ భాషలు ఆరు స్థాయిల్లో నేర్పుతుంది. జపనీస్ ఐదు స్థాయిలు. ఒక్కోస్థాయి వ్యవధి మూడు నెలలు. ఏడాదికి మూడుసార్లు జనవరి, జూన్, సెప్టెంబర్ సెషన్లలో క్లాసులు ప్రారంభమవుతాయి. మూడు సమయాల్లో తరగతులు నిర్వహిస్తారు. ఫీజులు నామమాత్రంగా ఉంటాయి. సమర్థ బోధనా సి బ్బంది, క్రమశిక్షణ.. రామకృష్ణ మఠం ప్రత్యేకత. వెబ్‌సైట్: www.rkmath.org ఇఫ్లూ రీసెర్చ్ ప్రోగ్రామ్స్: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్. అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్; ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్ రెండేళ్ల ఎంఏ కోర్సులు: అరబిక్ అండ్ ఫ్రెంచ్ పీజీ డిప్లొమా కోర్సులు: టీచింగ్ ఆఫ్ అరబిక్ డిప్లొమా కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్ సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్ వెబ్‌సైట్: www.efluniversity.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పీహెచ్‌డీ: జర్మన్, హిస్పానిక్, పర్షియన్ ఎంఫిల్: అరబిక్, బల్గేరియన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, జర్మన్, హిస్పానిక్ ఇటాలియన్, లింగ్విస్టిక్స్, పర్షియన్, రష్యన్. ఎంఏ: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, హిస్పానిక్, ఇటాలియన్, లింగ్విస్టిక్స్, పర్షియన్ బీఏ (ఆనర్స్): ఫ్రెంచ్, జర్మన్, పర్షియన్, స్పానిష్, జోంగా, అరబిక్ డిప్లొమా/అడ్వాన్స్‌డ్ డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులు: అప్లైడ్ లింగ్విస్టిక్స్, బల్గేరియన్/క్రొయేషియన్/చెక్/ఫ్రెంచ్/జర్మన్/హంగేరియన్/ఇటాలియన్/పర్షియన్/పోలిష్/సెర్బియన్/స్లోవేక్ లాంగ్వేజెస్.వెబ్‌సైట్: www.du.ac.in బెనారస్ హిందూ యూనివర్సిటీ ఎంఏ: అరబిక్, చైనీస్, జర్మన్, పర్షియన్, రష్యన్, నేపాలీ, పాళీ, లింగ్విస్టిక్స్. పీజీ డిప్లొమా: జపనీస్ స్డడీస్; వ్యవధి: ఏడాది బీఏ (ఆనర్స్): అరబిక్, పర్షియన్, పాళీ, నేపాలీ, చైనీస్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, లింగ్విస్టిక్స్. యూజీ డిప్లొమా: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్ స్టడీస్, జర్మన్ స్టడీస్, నేపాలీ, పర్షియన్, రష్యన్, సింహళీస్. వెబ్‌సైట్: www.bhu.ac.in యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఎంఫిల్: ఫ్రెంచ్; ఎంఏ: ఫ్రెంచ్ డిప్లొమా/సర్టిఫికెట్: ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్; వెబ్‌సైట్: ఠీఠీఠీ.ఠౌఝ.్చఛి.జీ జామియా మిలియా ఇస్లామియా పీహెచ్‌డీ: అరబిక్, పర్షియన్ ఎంఏ/ బీఏ: అరబిక్, పర్షియన్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా: మోడర్న్ అరబిక్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్‌లేషన్, మోడర్న్ పర్షియన్, టర్క్‌మెనియన్, టర్కిష్, ఫ్రెంచ్, రష్యన్, ఇటాలియన్. డిప్లొమా కోర్సులు: మోడర్న్ అరబిక్, మోడర్న్ పర్షియన్, టర్క్‌మెనియన్, టర్కిష్, కజక్, ఉజ్బె క్, క్రెగ్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇటాలియన్. వెబ్‌సైట్: http://jmi.nic.in యూనివర్సిటీ ఆఫ్ ముంబై పీహెచ్‌డీ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ ఎంఏ: అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ బీఏ: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, పాళీ, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్. అడ్వాన్స్‌డ్ డిప్లొమా: అరబిక్, జర్మన్, రష్యన్ డిప్లొమా: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, పాళీ, పర్షియన్, రష్యన్ సర్టిఫికెట్: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పర్షియన్, పోలిష్, రష్యన్ వెబ్‌సైట్: www.mu.ac.in ఇగ్నో పీహెచ్‌డీ: అరబిక్, ఫ్రెంచ్ సర్టిఫికెట్: జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, అరబిక్ డిప్లొమా: టీచింగ్ జర్మన్ లాంగ్వేజ్ వెబ్‌సైట్: http://ignou.ac.in డిమాండ్ ఉన్న భాషలు: ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో జపనీస్, స్పానిష్, కొరియన్ భాషలకు కూడా ఆదరణ లభిస్తోంది. అవకాశాలిలా... ఫారిన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు విస్తృతం. వీరికి సెక్రటేరియల్ పొజిషిన్ నుంచి ఎగ్జిక్యూటివ్ వరకు వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్‌లేటర్స్, ఇంటిప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. వివిధ ఐటీ కంపెనీలు, మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాలయాల్లో అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్‌లేటర్స్: విదేశీ భాష నిపుణుల్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ట్రాన్స్‌లేషన్ (అనువాదం). భాషపై పట్టు, అర్థాన్ని మార్చకుండా అనువదించే నేర్పు ఉంటే ఎదగడానికి అవకాశాలెన్నో. మన కంపెనీలు ఫారెన్ కంపెనీలతో జాయింట్ వెంచర్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. విదేశాలతో అవగాహన కారణంగా వచ్చే పత్రాలను.. అనువదించడం, సమాచారాన్ని క్రోడీకరించడం కోసం కూడా ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ట్రాన్స్‌లేటర్లు అవసరం. టెక్నికల్, సైంటిఫిక్, బిజినెస్, సాహిత్యం, రంగాల్లో కూడా వీరు తప్పనిసరి కావడంతో సంబంధిత సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలను అందిస్తున్నాయి. భారత్‌లో ఐటీ రంగ వృద్ధి వల్ల వివిధ దేశాల నుంచి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు నివేదికల తర్జుమాకు పెద్దఎత్తున ట్రాన్స్‌లేటర్ల అవసరం ఉంది. ఇంటర్‌ప్రిటేటర్: వ్యక్తి మాటలను అనువాదం చేసి మరో వ్యక్తికి అప్పటికప్పుడు వినిపించే ప్రక్రియే ఇంటర్‌ప్రిటేషన్. ఈ తరహా బాధ్యతలను నిర్వహించే వారే ఇంటర్‌ప్రిటేటర్లు. ఈ వృత్తిలో రాణించడానికి వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకం. సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, సభల్లో వీరి అవసరం ఎక్కువ. ఇద్దరు వ్యక్తుల సంభాషణను ఇంటర్‌ప్రిటేషన్ చేయడానికి ఉండే వారిని లెసియన్ ఇంటర్‌ప్రిటేటర్ అంటారు. వీరికి లోక్‌సభ, విదేశీ మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ హౌసెస్‌లో అవకాశాలు ఉంటాయి. టీచింగ్: ప్రస్తుతం దేశంలోని పలు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు విదేశీ భాష కోర్సులను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా అవకాశాలు అనేకం. ఫ్రీలాన్సింగ్: లాంగ్వేజ్‌ల్లో పట్టు సాధించినా.. పూర్తిస్థాయి ఉద్యోగంపై ఆసక్తిలేని వారికి.. అప్పటికే మరో ఉద్యోగంలో ఉన్న వారికి ఫ్రీలాన్సింగ్ ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా పుస్తక ప్రచురణ విభాగంలో వీరికి అవకాశాలు పుష్కలం. అదేవిధంగా కొందరు పీహెచ్‌డీ స్కాలర్స్ తాము రూపొందించే పరిశోధన పత్రాలను ఇంగ్లిష్‌లో అనువదించడానికి ఫ్రీలాన్సర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అవకాశాలు కల్పిస్తున్న మరికొన్ని రంగాలు: విదేశీ భాష నిపుణుల అవసరం హాస్పిటల్స్, క్లినిక్స్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో ఉంటోంది. కారణం.. ఈ రంగాల్లో ఉన్న సంస్థలు పలు విదేశీ సంస్థలతో సంయుక్తంగా వ్యాపారం నిర్వహిస్తుండటమే. ఫలితంగా అక్కడి నుంచి వచ్చే డాక్యుమెంట్ల అనువాదం కోసం కార్పొరేట్ ఆసుపత్రులు, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ట్రాన్స్‌లేటర్స్‌ను నియమించుకుంటున్నాయి. ఈ వృత్తిలో రాణించాలంటే.. సంబంధిత టెర్మినాలజీపై పట్టు ఉండాలి. విదేశీ పర్యాటకులను ఆకర్షించేవిధంగా వివిధ ఎయిర్‌లైన్ సంస్థలు, టూరిజం ఆర్గనైజేషన్స్, హాస్పిటాలిటీ సంస్థల్లో అవకాశాలున్నాయి. వేతనాలు.. టాప్ రిక్రూటర్స్: అనువాదకులు, ఇంటర్‌ప్రిటేటర్లకు ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్‌లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు రూ.200 నుంచి రూ.500 వరకు లభిస్తుంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంట చొప్పున చెల్లిస్తారు. వీరికి గంటకు రూ.400-500 వరకు చెల్లిస్తున్నారు. రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ హౌసెస్, ఫార్మాస్యూటికల్, మెడికల్, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి రూ. 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది. అనుభవం ఆధారంగా పెరిగే అవకాశం ఉంటుంది. వీరికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ, ఒరాకిల్, స్యామ్‌సంగ్, హ్యుందాయ్, ఎల్‌జీ, థామ్సన్, జీఈ, ఎవన్‌టీస్, మౌలీనెక్స్, టూరిజం సంస్థలు, హోటల్ పరిశ్రమ, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ తదితరాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రపంచస్థాయి సంస్థలు: వరల్డ్ బ్యాంక్, యూఎన్‌ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఫారెన్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్ అవసరం. |
Wednesday, June 27, 2012
విదేశీ భాష... అవకాశాల బాట...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment