జిప్‌మర్ (జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం 2013వ సంవత్సరానికి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత వివరాలు..
ఎంసెట్ Vs జిప్‌మర్
ఫిజిక్స్, కెమిస్ట్రీ- సిలబస్ ఎంసెట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఎంసెట్ తరహా ప్రిపరేషన్ దీనికి సరిపోతుంది.
బోటనీ, జువాలజీ- ఎంసెట్ ప్రిపరేషన్ సరిపోతుంది. కొన్ని అంశాలు మాత్రం అదనంగా చదవాలి. అవి.. బయో మాలిక్యుల్స్, పాలిమర్స్, హ్యుమన్ ఫిజియాలజీ, జెనెటిక్స్. వీటి కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఇందుకోసం గ త ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. అయా అంశాల్లో అడుగుతున్న ప్రశ్నల సరళిని అవగాహన చేసుకోవాలి. దీని వల్ల ప్రిపరేషన్ మరింత మెరుగవుతుంది.
ఇతర మెడికల్ ఎంట్రెన్స్‌లతో పోల్చితే జిప్‌మర్ ప్రవేశ పరీక్ష కొంత భిన్నమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో గ్రూప్ సబ్జెక్ట్‌లతోపాటు ఇంగ్లిష్‌లో కూడా విద్యార్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు విభాగాల్లో 200 ప్రశ్నలు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ. ఈ ఐదు సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నల చొప్పున వస్తాయి. మొత్తం మార్కులు 200. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. వ్యవధి: మూడు గంటలు.
నిర్ణయాత్మకం:
గత ఫలితాలను విశ్లేషిస్తే.. ఇంగ్లిష్, ఫిజిక్స్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులే ర్యాంకుల విషయంలో ముంద ౦జలో ఉంటున్నారు. అంటే ర్యాంకుల నిర్ధారణలో ఈ రెండు సబ్జెక్ట్‌లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయని చెప్పొచ్చు.
ప్రిపరేషన్:
ఎంసెట్‌లో ప్రశ్నలు స్టేట్ సిలబస్ నుంచి వస్తే.. జిప్‌మర్‌లో అడిగే ప్రశ్నలు సీబీఎస్‌ఈ-ఐసీఎస్‌ఈ ఆధారంగా ఉంటాయి. ఎంసెట్ పూర్తయిన తర్వాత జిప్‌మర్ (జూన్ 2) కోసం దాదాపు 20 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఎంసెట్‌లో లేని జిప్‌మర్‌లో అదనంగా ఉన్న అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కనీసం నాలుగు లేదా ఐదు మాక్ టెస్ట్‌లు రాయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం కూడా ఉత్తమం.
బయాలజీదే సింహ భాగం:
జిప్‌మర్ ఎంట్రెన్స్‌లోని అన్ని సబ్జెక్టుల్లో బయాలజీదే (బోటనీ+ జువాలజీ) సింహ భాగం. మిగతా సబ్జెక్టులతో పోల్చితే ఈ విభాగం ప్రిపరేషన్ ఏమంత కష్టం కాదు. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీల మాదిరిగా లాజిక్‌తో కూడిన ప్రశ్నలు కాకుండా సూటిగా ఉండే ప్రశ్నలను అడుగుతారు.
కీలక చాప్టర్లు: సెల్ బయాలజీ, జెనెటిక్స్-ఎవల్యూషన్, ప్లాంట్ అండ్ యానియల్ ఫిజియాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, మైక్రోబ్స్ ఇన్ హ్యుమన్ వెల్ఫేర్ - ఎకోసిస్టమ్.
= ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌లో కుందేలు అవయవ
వ్యవస్థ వివరణ ఉంది. జిప్‌మర్‌లో దీనికి బదులు మానవ శరీర ధర్మ శాస్త్రం (హ్యూమన్ ఫిజియాలజీ)పై ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన అంశం.. కుందేలు శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశాల్లో 80 శాతం మేరకు మానవ శరీర ధర్మ శాస్త్రంతో సరిపోతాయి. 20 శాతం మేరకు హ్యూమన్ ఫిజియాలజీ అంశాలైన జీర్ణ, శ్వాస, రక్త ప్రసరణ, విసర్జక, అస్థిపంజర, ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లోని విషయాలు, డిజార్డర్స్ అదనంగా నేర్చుకోవాలి. ఇందుకోసం సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలను ఔపోసన పడితే సరిపోతుంది.
కెమిస్ట్రీ:
మిగతా సబ్జెక్టులతో పోల్చితే కెమిస్ట్రీ పరిధి చాలా విస్తృతం. కాబట్టి ఇందు కోసం అధిక సమయం వెచ్చించాలి. ఏ చాప్టర్‌పై పట్టు ఉంటే ఆ చాప్టర్‌పైనే దృష్టి పెట్టడం మంచిది.
కీలక చాప్టర్లు: ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలలో ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం, సర్ఫేస్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, ఆర్గనో-మెటాలిక్ కాంపౌండ్స్, యాసిడ్స్, బేసిస్, సొల్యూషన్స్, అటామిక్ స్ట్రక్చర్, పిరీయాడిక్ టేబుల్స్, బయో మాలిక్యుల్స్, డీ-బ్లాక్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ పైరాక్సైడ్ ముఖ్యమైనవి.
ఫిజిక్స్:
జిప్‌మర్ ఔత్సాహికులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన విభాగం ఫిజిక్స్. ఇందులో కాన్సెప్ట్స్ ఆధారంగా అడిగే ప్రశ్నలు ఎక్కువ. అంతేకాకుండా ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు థియరీ బేస్డ్, లాజికల్‌గా ఉంటాయి. కాబట్టి సంబంధిత ఫార్ములాలు, షార్ట్‌కట్ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే ఈ విభాగంలో చక్కని స్కోర్ చేయవచ్చు.
కీలక చాప్టర్లు: మోడ్రన్ ఫిజిక్స్, మెకానిక్స్ (ఫ్రిక్షన్, డైనమిక్స్, వెలాసిటీ), ఎస్‌హెచ్‌ఎం, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్స్, వెక్టర్స్, వేవ్ మోషన్- అప్లికేషన్స్, ఉష్ణం, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్, రే ఆప్టిక్స్.
ఇంగ్లిష్:
ఈ విభాగంలో విద్యార్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటున్నాయి. ఈ క్రమంలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, వర్డ్ యూసేజ్, ప్రిపోజిషన్స్ యూసేజ్, ఆర్టికల్స్ యూసేజ్ వంటి వాటిపై దృష్టి సారించడం మేలు.
టార్గెట్ 165:
గత ఫలితాలను విశ్లేషిస్తే.. కనీసం 170 మార్కులను సాధిస్తే.. ఓపెన్ కేటగిరీలో సీటు ఖరారు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ విద్యార్థులు మాత్రం 165 మార్కులకు తగ్గకుండా సాధించేందుకు ప్రయత్నించాలి.
రిఫరెన్స్ బుక్స్:
= ఎన్‌సీఈఆర్‌టీ -ఐసీఎస్‌ఈ 11,12 తరగతి పుస్తకాలు
= చాంద్ పబ్లికేషన్స్-బయాలజీ వాల్యూమ్ 1, 2
= క్యాంప్‌బెల్ బయాలజీ- 9వ ఎడిషన్
= కెమిస్ట్రీ - ఓపీ టాండన్
= కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ - హెచ్‌సీ వర్మ
= ఇంగ్లిష్ కోసం ఏదో ఒక ప్రామాణిక పుస్తకం.
జిప్‌మర్-2013 సమాచారం:
అర్హత: 10+2/తత్సమానం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీ).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 4, 2013.
పరీక్ష తేదీ: జూన్ 2, 2013.
వివరాలకు: http://jipmer.edu.in/
No comments:
Post a Comment