పదో తరగతి... ప్రతి విద్యార్థి జీవితంలో టర్నింగ్ పాయింట్... భవిష్యత్తులో ఏ బాటలో ప్రయాణించాలన్నా.. తొలి అడుగు పడేది ఇక్కడే... ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దే విధంగా.. నాణ్యమైన ఉచిత ఇంటర్మీడియెట్ విద్యను అందిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (ఏపీఆర్‌జేసీ)లు.. ఈ గురుకులాల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీఆర్‌జేసీ-కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సెట్)-2013 నోటిఫికేషన్ వెలువడింది. వివరాలు..
ఆఫర్ చేస్తున్న గ్రూపులు:
ఏపీఆర్‌జేసీ కాలేజీల్లో ఆఫర్ చేస్తున్న గ్రూపులు- ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఈఈటీ, సీజీడీఎం. వీటిల్లోంచి ప్రతి విద్యార్థి ఒక గ్రూప్‌నకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు కాలేజీలో ఇంటర్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సుల (ఈఈటీ, సీజీడీఎం)ను కూడా అందిస్తున్నారు.
అర్హత:
జీపీఏ 6తో పదో తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత (బీసీ/ఎస్సీ/ఎస్టీ/ మైనార్టీలకు జీపీఏ 5 ఉంటే సరిపోతుంది). 2013-ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రూప్ ఆధారంగా..సెట్:
ఏపీఆర్‌జేసీ సెట్‌ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంటర్మీడియెట్‌లో ఎంచుకోవాలనుకుంటున్న గ్రూప్ ఆధారంగా.. నిర్దేశిత సబ్జెక్ట్‌లలో పరీక్షకు హాజరు కావాలి. ఈ క్రమంలో ఉండే సబ్జెక్ట్‌లు..
గ్రూప్- సబ్జెక్ట్‌లు - మార్కులు
ఎంపీసీ -ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్‌సైన్స్ -150
బైపీసీ- ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్‌సైన్స్ -150
సీఈసీ- ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్- 150
ఎంఈసీ- ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్ -150
ఈఈటీ- ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్‌సైన్స్- 150
సీజీడీఎం- ఇంగ్లిష్, బయోసైన్స్, ఫిజికల్‌సైన్స్ -150
ఈ పరీక్షలో పైన పేర్కొన్న విధంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి (వీటికి ఒక్కొక్క మార్కు చొప్పున ప్రతి సబ్జెక్ట్‌కు 50 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య 150. వ్యవధి: రెండున్నర గంటలు (150 నిమిషాలు).
తొలి రోజు నుంచే:
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులను కేవలం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కే పరిమితం చేయకుండా.. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా మరెన్నో అనుబంధ కోర్సుల్లో శిక్షణ కూడా లభిస్తుంది. వాటిలో.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు తొలిరోజు నుంచే సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులను సీఏ, ఐసీడబ్ల్యుఏ వంటి కోర్సుల్లో రాణించే తరహాలో శిక్షణనిస్తారు. ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు సీపీటీ (ఇ్కఖీ) మోడల్ టెస్ట్‌లను కూడా నిర్వహిస్తారు. నిరంతర పర్యవేక్షణ కోసం కార్పొరేట్ తరహాలో ప్రతి అధ్యాపకుడి (లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తారు)కీ 15-20 మంది విద్యార్థులను కేటాయిస్తారు. విద్యార్థి చదువు, అసైన్‌మెంట్లు, మూల్యాంకనం, స్టడీ మెటీరియల్ అందించడం ఇవన్నీ ఆ అధ్యాపకుడే చూసుకుంటారు. ఫిజికల్, స్పోర్ట్స్ యాక్టీవిటీస్‌కు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలను కూడా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను అన్ని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్-నాగార్జునసాగర్, సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్-కర్నూలు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలు (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా), కన్వీనర్ ఏపీఆర్‌జేసీ-ఆర్‌డీసీ సెట్-ఆఫీస్, ఎంపిక చేసిన కస్తూర్బా బాలికల విద్యాలయాల నుంచి పొందొచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా నిర్దేశిత చిరునామాకు పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2013.
పరీక్ష తేదీ: మే 15, 2013
చిరునామా: కన్వీనర్, ఏపీఆర్‌జేసీ-ఆర్‌డీసీ-సెట్ 2013
ఏపీఆర్‌ఈఐఎస్ సొసైటీ, నాలుగో అంతస్తు,
గగన్ విహార్, నాంపల్లి, హైదరాబాద్-500 001.
వెబ్‌సైట్: www.apresidential.gov.in
ప్రిపరేషన్
పాలిసెట్
మ్యాథమెటిక్స్:
మ్యాథమెటిక్స్‌లో ఉండే 60 ప్రశ్నలలో.. త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రం, మాత్రికల నుంచి దాదాపు 45-50 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టి సారించాలి. అంతేకాకుండా ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో అడుగుతారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి.
రిఫరెన్స్: పదో తరగతి పుస్తకాలతోపాటు మార్కెట్‌లో లభించే స్టాండర్డ్ మెటీరియల్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. కోచింగ్ తీసుకోవడం కూడా లాభిస్తుంది.
ఫిజికల్ సైన్స్:
ఫిజిక్స్‌లో గతి శాస్త్రం, శుద్ద గతిక శాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కాంతి వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. అంతేకాకుండా సంబంధిత సమస్యలను సాధించటం అలవర్చుకోవాలి. ఈ క్రమంలో భావనలు, ఫార్ములాలు, సూత్రాలపై పట్టు సాధించాలి. రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం, సంకేతాలు- ఫార్ములాలు- సమీకరణాలు, ద్రావణాలు వంటి అంశాలపై పట్టు సాధించాలి. రిఫరెన్స్: 8,9,10వ తరగతుల ఫిజికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలు.
ఏపీఆర్‌జేసీ-సెట్
మ్యాథమెటిక్స్:
మ్యాథమెటిక్స్‌లో అన్ని చాప్టర్ల నుంచి దాదాపు నాలుగు లేదా ఐదు ప్రశ్నలు రావచ్చు. ఏకఘాత ప్రణాళిక, గణన నుంచి ఒకటి/రెండు ప్రశ్నలు అడగవచ్చు. ఇందులో ప్రశ్నలు కూడా అప్లికేషన్ పద్ధతిలోనే ఉంటాయి. 60 శాతం ప్రశ్నలు సులువుగా సాధించేవిగా ఉంటే 40 శాతం ప్రశ్నలను అడ్వాన్స్‌డ్ స్థాయిలో అడుగుతారు.
రిఫరెన్స్: పదో తరగతి పుస్తకాలతోపాటు మార్కెట్‌లో లభించే స్టాండర్డ్ మెటీరియల్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. కోచింగ్ తీసుకోవడం కూడా లాభిస్తుంది.
ఫిజికల్ సైన్‌స:
ఫిజిక్స్‌లో గతి శాస్త్రం, శుద్ద గతిక శాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్, కాంతి వంటి అంశాలపై దృష్టి సారించాలి. ప్రశ్నలు అప్లికేషన్ మెథ డ్‌లో ఉంటాయి. అంతేకాకుండా సంబంధిత సమస్యలను సాధించటం అలవర్చుకోవాలి. ఈ క్రమంలో భావనలు, ఫార్ములాలు, సూత్రాలపై పట్టు సాధించాలి. కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, ఆవర్తన పట్టిక, కర్బన రసాయన శాస్త్రం, సంకేతాలు- ఫార్ములాలు- సమీకరణాలు, ద్రావణాలు వంటి అంశాలపై పట్టు సాధించాలి.
రిఫరెన్స్: 8-10వ తరగతుల ఫిజికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలు.
సోషల్:
ఈ విభాగంలో 8,9,10 తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఈక్రమంలో ..
భూగోళ శాస్త్రం: భూమి, సౌర కుటుంబం, భూకంపాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు, దేశ/రాష్ట్ర భౌగోళిక అంశాలు.. శీతోష్ణస్థితి, ఖనిజాలు, అడవులు, నదులు, వ్యవసాయం, రవాణా, జనాభా వంటి అంశాలపై దృష్టి సారించాలి.
చరిత్ర: ప్రపంచ యుద్ధాలు, పూర్వ చారిత్రక యుగం, ప్రాచీన ఇనుప-మధ్యయుగ నాగరికతలు, ప్రపంచ విప్లవాలు (రష్యా, ఫ్రెంచ్ విప్లవం వంటివి), భారతదేశ చరిత్ర-వారసత్వ సంపద, స్వాతంత్రోద్యమం వంటి అంశాలు కీలకమైనవి.
పౌరశాస్త్రం: భారత రాజ్యాంగం-మౌలిక అంశాలు, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకిక రాజ్యం,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఐక్యరాజ్యసమితి, రవాణా విద్య వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి.
ఆర్థిక శాస్త్రం: జాతీయాదాయం, ప్రణాళికలు-విజయాలు- వైఫల్యాలు, భారత ఆర్థిక వ్యవస్థ-సమస్యలు వంటి అంశాలపై కీలకమైనవి.
రిఫరెన్స్ బుక్స్: 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు
బయాలజీ:
ఈ సబ్జెక్ట్‌లో పూర్తిగా 10వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో జీవన విధానాలు, నియంత్రణ-సమన్వయం, పోషణ వంటి అధ్యాయాలను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. వీటి నుంచి అధిక శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన ప్రత్యుత్పత్తి, హెచ్‌ఐవీ-ఎయిడ్స్ నుంచి ఒకటి రెండు మినహా ఎక్కువ ప్రశ్నలు రాకపోవచ్చు.
రిఫరెన్స్ బుక్స్: 10వ తరగతి బయాలజీ పుస్తకం.
ఇంగ్లిష్:
ఈ సబ్జెక్ట్‌కు ప్రత్యేక సిలబస్ అంటూ ఏదీ లేదు. ఇంగ్లిష్‌లో విద్యార్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా గ్రామర్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో Synonyms, Antonyms, Articles, Prepositions, Correction of sentences, Active voice, passive voice, Direct– indirect speech, Phrasal Verbs, Tenses, Meanings, Vocabulary, Opposites, Other form of verbs తదితరాలపై దృష్టి పెట్టాలి. ప్రశ్నల క్లిష్టత పదో తరగతి స్థాయిలో ఉంటుంది కాబట్టి.. పదో తరగతి వరకు చదువుకున్న గ్రామర్ అంశాలను ఒక్క సారి పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment