Friday, January 13, 2012

జూన్ 2న లాసెట్.. మే 10 నుంచి పీఈసెట్

ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం కోసం లాసెట్-2012ను జూన్ 2న నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించే లాసెట్-2012 కమిటీకి కన్వీనర్‌గా ఎస్వీయూ ప్రొఫెసర్ పాపారావు, చైర్మన్‌గా ఇన్‌చార్జి వీసీ ఎంజీ గోపాల్ వ్యవహరిస్తారు. కాగా.. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ మే 10 నుంచి నెలపాటు జరుగుతుంది. ఆచా ర్య నాగార్జున విశ్వవిద్యాలయం దీన్ని నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో జారీ కానుంది. పీఈసెట్ -2012 కమిటీ కన్వీనర్‌గా డాక్టర్ కిషోర్, చైర్మన్‌గా ఇన్‌చార్జి వీసీ కె.వి.రావు వ్యవహరిస్తారు.

No comments:

Post a Comment