Thursday, January 19, 2012

బిట్‌సాట్‌ :


ప్రతిష్టాత్మక 'బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌' (బిట్స్‌), 2010-11 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షను 'బిట్‌సాట్‌-2010' పేరుతో వ్యవహరిస్తారు. రాజస్తాన్‌లోని పిలానీలో ఉన్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందింది. ప్రస్తుతం బిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ హోదాలో కొనసాగుతోంది. తొలుత రాజస్థాన్‌లోని పిలానీలో ప్రారంభమై...'బిట్స్‌ పిలానీ'గా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ యూనివర్సిటీకి ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, గోవాలో శాఖలున్నాయి.
ప్రస్తుతం 2010-11 విద్యా సంవత్సరంలో డిగ్రీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి 'ఆన్‌లైన్‌' విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
వివిధ క్యాంపస్‌లలోని కోర్సుల వివరాలు
1.బిట్స్‌, పిలానీ-హైదరాబాద్‌ : బిఇ (ఆనర్స్‌)-కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌.
బి.ఫార్మా (ఆనర్స్‌), ఎమ్మెస్సీ (ఆనర్స్‌) : బయాలజీకల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, ఎమ్మెస్సీ (టెక్‌), ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌.
2. బిఇ (ఆనర్స్‌)-కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, మాన్యుఫాక్చరింగ్‌, బి.ఫార్మా (ఆనర్స్‌), ఎమ్మెస్సీ (ఆనర్స్‌), బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌..ఇంకా ఎమ్మెస్సీ (టెక్‌), ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌.
3.బిట్స్‌, పిలానీ-గోవా: బిఇ (ఆనర్స్‌)-కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌. ఎమ్మెస్సీ (ఆనర్స్‌), బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌..ఇంకా ఎమ్మెస్సీ (టెక్‌), ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌.
అర్హత : ఏదేనీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఐచ్ఛికాంశాలుగా చదివి ఉండాలి. అర్హత పరీక్షలో కనీసం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మార్కులు కనీసం 60 శాతానికి తగ్గకూడదు. ఇంగ్లిష్‌ ధారాళంగా మాట్లాడగలగాలి. 2008 లేదా అంతకన్నా ముందు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారు అనర్హులు.
ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి. ఆయా రాష్ట్రాలు, బోర్డులు నిర్వహించిన ఇంటర్మీడియెట్‌ పరీక్షలో మొదటి ర్యాంకులు సాదించిన అభ్యర్థులకు బిట్‌సాట్‌2010 అర్హత మార్కులతో సంబంధం లేకుండా కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
 2010 వివరాలు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. సమయం : మూడు గంటలు. బహుళ ఐచ్ఛిక విధానంలో ప్రశ్న ఉంటుంది. ఈ పరీక్షను 2010, 10 మే-10 జూన్‌ మధ్య నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తును పూర్తి చేసి వెయ్యి రూపాయలు ఫీజు (విద్యార్థునులకు 500 రూపాయలు మాత్రమే ) జతచేసి పంపించాలి. చివరితేదీ : 2010, 30 జనవరి.పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : www.bitsatadmission.com

No comments:

Post a Comment