Saturday, January 28, 2012

యోగా కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు?

ఎంఎస్సీ(యోగా) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు? -రాంబాబు, ఏలూరు.
మారుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాముఖ్యమిచ్చే క్రమంలో ‘యోగా’ను ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి, యోగాపై మంచి పరిజ్ఞానం, అనుభవం ఉంటే మెరుగైన ఆదాయం అందించే రంగమిది. విద్యా, శిక్షణ సంస్థలు, హెల్త్ క్లబ్‌లు, పునరావాస కేంద్రాలు, వైద్యశాలలు, వాణిజ్య సంస్థల్లో యోగా ట్రైనర్‌గా పని చేయడానికి అవకాశాలు లభిస్తారుు.

యోగా కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఎస్‌వీవైఏఎస్‌ఏ విశ్వవిద్యాలయం(డీమ్డ్ యూనివర్సిటీ), బెంగళూరు ఎంఎస్సీ(యోగా) కోర్సును ఆఫర్ చేస్తోం ది. అర్హత: బీఎస్సీ (యోగా)/గ్రాడ్యుయేషన్‌తో పాటు యోగా ఇన్‌స్ట్రక్టర్స్ కోర్సు (వైఐసీ) చేసి ఉండాలి. వెబ్‌సైట్: www.svyasa.org

తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, చెన్నై కూడా ఎంఎస్సీ(యోగా) కోర్సును అందిస్తోంది. అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు యోగాలో డిప్లొమా చేసి ఉండాలి. వెబ్‌సైట్: WWW.tnpesu.org యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై ఎంఎస్సీ(యోగా) కోర్సును ఆఫర్ చేస్తుంది.
అర్హత: సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్.
వివరాలకు: http://www.unom.ac.in

.................

ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తి చేశాను. దీనికి అనుబంధంగా చేయదగ్గ కోర్సులను తెలపండి. -మంజు, తిరుపతి.

ఎంబీఏ(ఫైనాన్స్)కు అనుబంధంగా చేయదగ్గ కోర్సులు చాలా ఉన్నాయి. ఆసక్తి, అవకాశాలను బట్టి ముందుగా ఈ రంగంలో ఉద్యోగంలో చేరండి. అందులో కొంత కాలం పనిచేసిన తర్వాత ఆ అనుభవం ఆధారంగా.. కెరీర్ పరంగా ఉన్న అవకాశాలు, ఏ కోర్సులు చేస్తే ఉపయోగమో అనే దానిపై ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి కోర్సును ఎంచుకోవడం ఉత్తమం.

స్టాక్ సంబంధిత రంగంలో ఆసక్తి ఉంటే.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) లు ఆఫర్ చేసే సర్టిఫికెట్ కోర్సులను ఎంచుకోవచ్చు. ఈ సంస్థలు స్టాక్ మార్కెట్‌కు సంబంధించి వివిధ అంశాల్లో మెటీరియల్ అందించడంతోపాటు పరీక్షలను కూడా నిర్వహిస్తాయి.
వివరాలకు: www.bseindia.com, www.nseindia.com

శాప్-ఫైనాన్స్ మాడ్యూల్ (అ్కఊజ్చీఛ్ఛి ఝౌఛీఠ్ఛ) చేయొచ్చు. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏఐ వంటి అకౌంటెన్సీ కోర్సులను కూడా ఎంచుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో కూడా అవకాశాలుంటాయి. దానికి సంబంధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్-ముంబై పలు కోర్సులను ఆఫర్ చేస్తోంది. అవి.. డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హోమ్ లోన్ అడ్వైజింగ్, అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఎంబీఏ(బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్). వెబ్‌సైట్: www.iibf.org.in

..................

ఎంఏ/ఎంబీఏ కార్పొరేట్ సెక్రటరీషిప్ కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలు? -జై, విజయవాడ.

ఒక కంపెనీకి సంబంధించిన అన్ని రకాలైన బిజినెస్ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రొఫెషనల్..కార్పొరేట్ సెక్రటరీ. ఈ రంగంలో మాస్టర్స్ కోర్సు పూర్తి చేసిన వారికి.. కార్పొరేట్ ప్లానర్, స్ట్రాటజిక్ మేనేజర్, ముఖ్య సలహాదారుగా.. స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు, ఎంఎన్‌సీలు, సంబంధిత సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం, నైపుణ్యం ఆధారంగా డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్ వంటి హోదాలను చేరుకోవచ్చు.

ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
అలగప్పా యూనివర్సిటీ-కరైకుడి(తమిళనాడు)
కోర్సు: ఎంబీఏ-కార్పొరేట్ సెక్రటరీషిప్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్
వివరాలకు: www.alagappauniversity.ac.in
సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ-చెన్నై
కోర్సు: ఎంఏ-కార్పొరేట్ సెక్రటరీషిప్
అర్హత: బీఏ(కార్పొరేట్ సెక్రటరీషిప్)/బీకాం.
వివరాలకు: www.stpetersuniversity.org



సాప్ట్ స్కిల్స్‌ను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి? -సాహిల్, కరీంనగర్.

ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో.. నేటి కార్పొరేట్ సెక్టార్‌లో రాణించాలంటే.. సంబంధిత డిగ్రీతోపాటు ప్రతి ఒక్కరు అలవర్చుకోవాల్సింది సాఫ్ట్‌స్కిల్స్. ఉద్యోగ సాధనలో, ఇంటర్వ్యూల్లో ఈ సాఫ్ట్‌స్కిల్స్ ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నారుు. ప్రస్తుతం చాలా ప్రైవేట్ కంపెనీలు అకడెమిక్ అర్హతలతో పాటు వీటికి కూడా ప్రాధాన్యమిస్తున్నారుు.

ఈ క్రమంలో.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, మైండ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్, ప్రజంటేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్, బేసిక్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ (ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, కంట్రోలింగ్.. మొదలైనవి) వంటి అంశాలను సాఫ్ట్ స్కిల్స్‌గా పరిగణిస్తారు. డిగ్రీ పూర్తి చేసుకొని బయటకు వచ్చే వారిలో చాలా మందిలో సబ్జెక్టు నాలెడ్జ్ తప్ప మిగతా విషయాలపై అవగాహన ఉండటం లేదు. దాంతో వారు జాబ్ మార్కెట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఉద్యోగం లభించినా... అందులో ఇమడలేకపోతున్నారు.

దాంతో ఇప్పుడు చాలా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌లో సాఫ్ట్‌స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలనే ఆలోచనతోపాటు దానికి తగ్గ ఆసక్తి, తపన, హార్డ్ వర్క్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అవసరాన్ని గుర్తించిన వివిధ కాలేజీలు కోర్సులో భాగంగా వీటిపై తర్ఫీదునిస్తున్నాయి. పలు ఇన్‌స్టిట్యూట్‌లు కోచింగ్ అంశాలకు అనుబంధంగా సాఫ్ట్‌స్కిల్స్‌లోనూ శిక్షణనిస్తున్నారుు. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఈ సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించిన పలు విభాగాల్లో షార్ట్‌టర్మ్ శిక్షణ సదుపాయం కూడా కల్పిస్తుంది.

No comments:

Post a Comment