Saturday, January 28, 2012

భావి శాస్త్రవేత్తలకు.. నెస్ట్-2012

బేసిక్ సెన్సైస్, దాని అనుబంధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన, సుశిక్షితులైన మానవ వనరులను దేశానికందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) 2007లో నైసర్, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్‌లను ఏర్పాటు చేసింది. ఈ రెండు సంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రే టెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి గానూ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నెస్ట్-2012పై ఫోకస్...

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్)-భువనేశ్వర్
ఆఫర్ చేస్తున్న కోర్సులు: బయోలాజికల్, కెమికల్, మ్యాథమెటికల్, ఫిజికల్ సెన్సైస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్
మొత్తం సీట్లు: 60
సర్టిఫికెట్స్ ప్రదానం చేసేది: హోమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌బీఎన్‌ఐ)
వెబ్‌సైట్: www.niser.ac.in

యూనివర్సిటీ ఆఫ్ ముంబై-డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ-సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్ (సీబీఎస్): యూనివర్సిటీ ఆఫ్ ముంబై క్యాంపస్‌లో సీబీఎస్‌ను ఏర్పాటు చేశారు.
అందిస్తోన్న కోర్సులు: మ్యాథమెటిక్స్, లైఫ్ సెన్సైస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్
మొత్తం సీట్లు: 35
వెబ్‌సైట్: www.cbs.ac.in/

అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులకు 55 శాతం) 2010 లేదా 2011లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2010 కంటే ముందు ఉత్తీర్ణులైనవారు అనర్హులు. 2012లో పరీక్షలు రాయబోయే విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి: జనరల్, ఓబీసీ విద్యార్థులు అక్టోబర్ 1, 1987న కానీ, ఆ తర్వాత కానీ జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు.

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షలో 5 విభాగాలుంటాయి. మొదటి సెక్షన్ అందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్‌లలో ప్రధాన సంఘటనలపై ప్రశ్నలుంటాయి. రెండో సెక్షన్‌లో బయాలజీపై, మూడో సెక్షన్‌లో కెమిస్ట్రీపై, నాలుగో సెక్షన్‌లో మ్యాథమెటిక్స్‌పై, ఐదో సెక్షన్‌లో ఫిజిక్స్‌పై ప్రశ్నలుంటాయి.

రెండు నుంచి నాలుగు సెక్షన్స్‌లో విద్యార్థులు ఏవైనా మూడు విభాగాలను ఎంచుకుని పరీక్ష రాయాలి. విద్యార్థుల గ్రహణ శక్తిని, విశ్లేషణ శక్తిని అంచనా వేసేలా 10+2 (సీబీఎస్‌ఈ) స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మూడు గంటల కాల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.

సిలబస్ విశ్లేషణ: ఐదు విభాగాలుగా ఉండే పరీక్షలో సెక్షన్-1లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్‌లపై ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలుంటాయి. ఈ సబ్జెక్టులలో అతిముఖ్యమైన సంఘటనలు, అంశాలపై ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. కాన్సెప్ట్ ఆధారంగా ఇచ్చే సైంటిఫిక్ ప్యాసేజ్‌లో విద్యార్థుల సాధారణ, గుణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేసేలా ప్రశ్నలడుగుతారు.

మ్యాథ్స్‌లో పదోతరగతి వరకు ఉన్న సాధారణ సమస్యలపై పశ్నలుంటాయి. సెక్షన్-2లో బయాలజీలో సెల్ బయాలజీపై; జువాలజీలో అనాటమీ అండ్ ఫిజియాలజీలో భాగంగా డెజైస్టివ్, సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, ఎక్స్‌క్రీటరీ, నెర్వస్, రీప్రొడక్టివ్ సిస్టమ్‌లపై ప్రశ్నలడుగుతారు. ఇంకా డైవర్సిటీ ఆఫ్ యానిమల్ లైఫ్, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, ఎకాలజీలపై, బోటనీలో భాగంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్, సిస్టమాటిక్స్, హ్యూమన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లపై ప్రశ్నలుంటాయి.

సెక్షన్-3లో కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ.. అందులో భాగంగా మెజర్‌మెంట్స్ ఇన్ కెమిస్ట్రీ, గ్యాసియస్ అండ్ లిక్విడ్ స్టేట్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీలపై; ఇనార్గానిక్ కెమిస్ట్రీలో భాగంగా పీరియాడిక్ టేబుల్స్, నానోమెటల్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, మెటల్స్ అండ్ మెటల్లర్జీలపై; ఆర్గానిక్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్స్, ఆల్కేన్, బెంజీన్ రియాక్షన్స్, కార్బోహైడ్రేట్స్‌లపై ప్రశ్నలుంటాయి. సెక్షన్-4లో మ్యాథ్స్‌లో ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, ఎనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, వెక్టార్స్‌పై ప్రశ్నలడుగుతారు. సెక్షన్-5 ఫిజిక్స్‌లో జనరల్ ఫిజిక్స్, మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లపై ప్రశ్నలుంటాయి.

రిఫరెన్స్ బుక్స్:
ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్, మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలు
ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ మెటీరియల్
స్కాలర్‌షిప్స్: ప్రవేశం పొందిన విద్యార్థులకు నెలకు *5000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీంతోపాటు స్టేషనరీ, మ్యాగజీన్లు, ఇతర ఖర్చులకు, సెమినార్‌లకు హాజరుకావడానికి ఏడాదికి * 20,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా అందిస్తారు.

అవకాశాలు: కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో, యూనివర్సిటీల్లో పరిశోధకులుగా అవకాశం కల్పిస్తారు.
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:
విశాఖపట్నం, హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:
ది చీఫ్ కోఆర్డినేటర్, నెస్ట్-2012,
సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్,
హెల్త్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై,
విద్యానగరి క్యాంపస్, ముంబై-400098

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జనవరి 5, 2012
ఆఫ్‌లైన్ దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ:
ఫిబ్రవరి 13, 2012
పూర్తిచేసిన దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13, 2012
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: ఏప్రిల్ 15, 2012
పరీక్ష తేదీ: మే 27, 2012
ఫలితాల ప్రకటన: జూన్ 18, 2012
వెబ్‌సైట్: www.nestexam.in

No comments:

Post a Comment