Friday, February 3, 2012

ఫెలోషిప్ ఇన్ఫో

యూజీసీ పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ ఫర్ ఉమెన్
గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీలు/కళాశాలల నుంచి సంబంధిత సబ్జెక్టులలో పీహెచ్‌డీ డిగ్రీని పొంది సెన్సైస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో అడ్వాన్స్‌డ్ స్టడీస్, రీసెర్చ్ చేయాలనుకునే మహిళలను ప్రోత్సహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లను అందిస్తోంది.

మొత్తం ఫెలోషిప్స్: 100
వ్యవధి: ఎంపికైనవారికి ఐదేళ్లపాటు ఫెలోషిప్ లభిస్తుంది.

ఫెలోషిప్ మొత్తం: 
మొదటి రెండేళ్లు నెలకు * 18,000, ఆ తర్వాత మూడేళ్లకు నెలకు * 20,000, చెల్లించడంతోపాటు ఇతర ఖర్చుల నిమిత్తం ఐదేళ్లకు * 50,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ మంజూరవుతుంది.
శారీరక వికలాంగులకు, అంధులకు ఎస్కార్ట్స్/రీడర్ అసిస్టెన్స్ కింద నెలకు * 2000 అదనంగా చెల్లిస్తారు. వీటితోపాటు అందరికీ సంబంధిత యూనివర్సిటీ /కళాశాలలో ఉచిత నివాస వసతి, వైద్య సౌకర్యం కల్పిస్తారు.

అర్హతలు:
జూలై 1 నాటికి 55 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్/మైనార్టీలకు 60 ఏళ్లు
ఈ ఫెలోషిప్‌లకు మహిళలు మాత్రమే అర్హులు.
జనరల్ కేటగిరీ విద్యార్థులు యూజీలో 55 శాతం, పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్‌లు యూజీలో 50 శాతం, పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీహెచ్‌డీ పొంది నిరుద్యోగులుగా ఉన్న మహిళలు మాత్రమే ఈ ఫెలోషిప్‌లకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు కొన్ని సర్టిఫికెట్స్‌ను కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అవి..
కులధ్రువీకరణ పత్రం
వయస్సు ధ్రువీకరణ పత్రం
గ్రాడ్యూయేషన్/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ మార్కుల పత్రాలు
పీహెచ్‌డీ సర్టిఫికెట్
శారీరక వికలాంగులైతే అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2012
వెబ్‌సైట్: www.ugc.ac.in/pdfw

ఇన్‌స్పైర్‌లో ఏఓఆర్‌సీకి దరఖాస్తులు
భవిష్యత్తు శాస్త్రవేత్తలను రూపొందించే క్రమంలో విద్యార్థులకు, ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందించే ఉద్దేశంతో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రారంభించిన ‘ఇన్‌స్పైర్’ ప్రోగ్రాం.. ద్వారా పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారికి మరో అవకాశం ఎదురైంది. ఇన్‌స్పైర్ ప్రోగ్రాం ద్వారా ‘అష్యూర్‌‌డ ఆపర్చునిటీ ఫర్ రీసెర్‌‌చ కెరీర్ ప్రోగ్రాం’కు ప్రకటన విడుదల చేసింది. మొత్తం వేయి మందికి అయిదు సంవత్సరాల వ్యవధిలో ఫెలోషిప్ మంజూరవుతుంది. ఈ ఫెలోషిప్.. ఐఐటీ ప్రొఫెసర్ పే స్కేల్‌కు సమానంగా ఉండటం విశేషం. 

అర్హత: మ్యాథమెటిక్స్ / సైన్‌‌స/ ఇంజనీరింగ్/ ఫార్మసీ/ అగ్రికల్చర్/ మెడిసిన్ విభాగాల్లో పీహెచ్‌డీ ఉండాలి. ఇప్పటికే పీహెచ్‌డీ థీసిస్ అందించిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయో పరిమితి: 32 సంవత్సరాలు

ఎంపిక విధానం: రెండంచెల వడపోత ద్వారా దరఖాస్తుదారుల తుది జాబితా రూపొందిస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: ఫిబ్రవరి 29, 2012
వెబ్‌సైట్: www.inspire-dst.gov.in

No comments:

Post a Comment