Friday, February 3, 2012

అడ్వర్టైజింగ్ రంగం

కొత్తగా ఆలోచించాలన్న తపన, దృక్పథం, సృజనాత్మకత, వినియోగదారుల ఆలోచనలు, అభిప్రాయాలను పసిగట్టగలిగే నేర్పు ఉంటే.. అడ్వర్టైజింగ్ రంగం పట్టం కడుతోంది. భారత్‌లో అడ్వర్టైజింగ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. రానున్నరోజుల్లో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు లక్షల్లోనే! ప్రస్తుతం దేశంలో అడ్వర్టైజింగ్ రంగం వ్యాపారం 24 వేల కోట్లకు చేరుకుంది. ఏటా 8 శాతం నుంచి 10 శాతం వరకు వృది ్ధనమోదు చేస్తోంది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే... భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగొచ్చు. 

ప్రస్తుతం ప్రతి రంగంలో అనేక అవకాశాలున్నా.. కంపెనీలకు కావలసిన లక్షణాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం చాలామంది వెనుకబడిపోతున్నారు. ఇప్పటివరకు నేను రాసిన పుస్తకాలన్నీ విద్యార్థులను మానసికంగా ముందుకు నడిపించడం కోసమే. కెరీర్లో తాను ప్రముఖులతో కలిసి పనిచేసిన అనుభవాలతో నేటి యువతకు మార్గదర్శనం చేయాలన్నదే తన ఏకైక లక్ష్యం అంటున్నారు 

ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణులు ఏజీ కృష్ణమూర్తి.
ఆయనతో సాక్షి భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ...

ప్ర: భారత్‌లో అడ్వర్టైజింగ్‌కు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? 
మనిషి జీవన విధానంతోపాటు మీడియా రంగం విస్తరించడంతో ప్రకటనల ప్రభావం బాగా పెరిగింది. ఫలితంగా ప్రతి కంపెనీ ఏదోకరకంగా తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విస్తరించేందుకు ప్రకటనలపై ఆధారపడుతోంది. ఇప్పటికే దేశంలో అడ్వర్టైజింగ్ పరిశ్రమ టర్నోవర్ * 24,000 కోట్లు.

కాగా, అందులో టెలివిజన్ రంగం వాటా * 14,000 కోట్లు, పత్రికా రంగానికి * 10,000 కోట్లు. ప్రకటనల విషయంలో కంపెనీల మధ్య భారీగా పోటీ నెలకొంది. ఆన్‌లైన్ ప్రకటనలు వేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో తమ కంపెనీ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రకటనలు రూపొందిస్తే.. ఇప్పుడు తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ప్రకటనలను ఆశ్రయిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో అడ్వర్టైజింగ్ నిపుణుల అవసరం లక్షల్లోనే ఉండే అవకాశముంది. 

ప్ర: ఈ రంగంలో రాణించాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం? 
{పచార రంగంలో ఎప్పటికప్పుడు వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమ యంలో అవకాశాలు, సవాళ్లు రెండూ ఉంటాయి. ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్త ఆలోచనలకు పదునుపెట్టడం చేయాలి. దాంతోపాటు సరైన విద్యార్హతలు, టీం వర్క్, పనిని ప్రేమించడం.. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులు పసిగట్టగల నేర్పు ఉంటే.. ఈ రంగంలో ఎవరైనా ముందుకు దూసుకుపోవచ్చు. నిత్యనూతనమైన అడ్వర్టైజింగ్ రంగంలో కొత్తగా ఆలోచించేవారే పోటీలో ముందుంటారు.

ప్ర: అడ్వర్టైజింగ్ రంగంలో అవకాశాలు, వేతనాలు ఎలా ఉంటాయి? 
{పస్తుతం అడ్వర్టైజింగ్ రంగం ఉద్యోగాల కల్పతరువుగా మారింది. అడ్వర్టైజింగ్‌లో పీజీ చేస్తే మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా క్రియేటివిటీ, మార్కెట్ రీసెర్చ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, మీడియా సేల్స్, ఔట్‌డోర్ విభాగాల్లో కోర్సులు చేస్తే తక్షణమే ఉద్యోగాలొస్తాయి. క్రియేటివిటీ, క్లైంట్ సర్వీస్, మార్కెట్ రీసెర్చ్, ప్రొడక్షన్, వంటి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు సుమారు రూ.40,000 వరకు ఆర్జించవచ్చు. 

ప్ర: కోర్సులు, కాలేజీలు? 
అడ్వర్టైజింగ్ రంగంలో ప్రవేశించాలనుకునేవారికి అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో పలు మేనేజ్‌మెంట్ కాలేజీలు ఎంబీఏలోనే మార్కెటింగ్, అడ్వర్టైజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్నాయి. బ్రాండ్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేస్తే అడ్వర్టైజింగ్ రంగంలోకి సులువుగా ప్రవేశించవచ్చు. 

ప్ర: నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? 
సమాజంలో ప్రతి వ్యవస్థకు నాయకత్వం కావాలి. కుటుంబం నుంచి పెద్దపెద్ద కంపెనీల వరకూ.. నాయకత్వం లేనిదే పని ముందుకు నడవదు. ప్రతి ఒక్కరూ నాయకులు కాగలరా? అంటే కావచ్చు. అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్లే ఏళ్ల తరబడి పనిచేస్తూ కూడా చాలామంది అవకాశాల్లో వెనుకబడిపోతున్నారు. ప్రధానంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలంటే ముందు ‘‘నేనెలాగో.. నా సహచరుడు అలానే’’.. అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. 

అలాంటప్పుడే అందరి దృష్టిలో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి వీలవుతుంది. తన విజన్‌ను, విజయాన్ని సహచరులతో పంచుకోవడం.. అర్థం చేసుకుని వ్యవహరించడం.. అందరివాడిగా మెలగడం.. స్నేహపూర్వకంగా మసలుకోవడం.. అందరిలో వీరిని ప్రత్యేకంగా నిలబె డతాయి. ఈ లక్షణాలే భవిష్యత్తులో పలు అవకాశాలు తెచ్చిపెడతాయి. 

ప్ర: {పొడక్ట్ విజయం సాధించాలంటే.. నాణ్యత? ప్రచారం? రెండిట్లో ఏది ముఖ్యం? 
ఏ వస్తువుకైనా, ఉత్పత్తికైనా ముందు నాణ్యత ఉండాలి. అప్పుడే నలుగురికి దగ్గరై విజయం సాధిస్తుంది. ఒకరకంగా నాణ్యత ప్రాథమిక లక్షణం. దానికి మరింత ప్రచారం కల్పిస్తే జనంలోకి దూసుకుపోవడానికి దోహదపడుతుంది. 

ప్ర: సక్సెస్‌ఫుల్ అడ్వర్టైజ్‌మెంట్ రూపొందించాలంటే? 
వినియోగదారుడి అవసరాలను అర్థం చేసుకోగలగాలి. అడ్వర్టైజ్‌మెంట్ అంటే.. ఒకరకంగా మ్యాచ్‌మేకర్. వినియోగదారుడికి, కంపెనీకి మధ్య వారధిగా ఉంటూ.. వారి అవసరాలను గుర్తించగలిగితే సక్సెస్‌ఫుల్ అడ్వర్టైజ్‌మెంట్ రూపొందించవచ్చు.

ప్ర: మీరు పుస్తకాలు రాయడానికి ప్రేరణ? 
నాకు చిన్నప్పటినుంచి రాయడమంటే ఇష్టం! అందుకే ఎప్పటికీ రాస్తూనే ఉంటా. నేను నా కెరీర్‌లో ఎంతోమంది ప్రముఖులతో కలిసి పనిచేశా. ఆ విలువైన అనుభవాలు నేటి యువత జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడాలనే తపనతోనే పుస్తకాలు రాస్తున్నాను. అడ్వర్టైజింగ్ రంగంలో ఇంత పేరుప్రఖ్యాతులు సంపాదించడం వెనుక ఎంతో కృషి ఉంది. 

ప్ర: మార్కెట్లో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఉద్యోగాలు దొరక్క అభ్యర్థులు ఇబ్బందిపడుతున్నారు. కారణం? 

కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఒకటే ఉంటే ఉద్యోగం దొరికే రోజులు కావిప్పుడు. క్వాలిఫికేషన్ ఒక్కటేకాదు.. స్కిల్స్ కూడా ముఖ్యం. ఇంటర్వ్యూకి వెళ్లాలంటే చాలామందికి బెరుకు. ఆత్మవిశ్వాసం కొరవడటం, ఇంగ్లిష్‌పై పట్టులేకపోవడం వంటివి ఉద్యోగ అన్వేషణలో వెనుకబాటుకు కారణమవుతున్నాయి. ఈ లోపాలను అధిగమించాలి. విషయావగాహనతోపాటు మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. సబ్జెక్ట్ స్కిల్స్‌తోపాటు బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం ఖాయం.

ప్ర: ఇన్నేళ్ల విజయానికి కారణం?
కష్టేఫలి అనేదే నా నినాదం. నా విజయానికి కారణం.. పట్టుదలగా పనిచేయడమే! 

ప్ర: జీవిత లక్ష్యం?
ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛంగా బతికితే చాలు. అదే నా జీవిత లక్ష్యం.

No comments:

Post a Comment