Friday, February 3, 2012

ఎంబీఏ (టూరిజం/హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:

ఎంబీఏ (టూరిజం/హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి? -


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగానికి డిమాండ్ పెరుగుతోంది. అంతేకాకుండా మన దేశంలో కూడా ఈ రంగానికి అధిక ప్రాధాన్యత లభిస్తుండటం, ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సులు చేసిన ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ కోర్సు చేసిన వారికి అవకాశాలు పుష్కలం.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్-గ్వాలియర్, భువనేశ్వర్.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(టూరిజం అండ్ ట్రావెల్); ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/జీమ్యాట్/ఏటీఎంఏ స్కోర్.
వివరాలకు: www.iittm.org
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్.
కోర్సు: ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్); అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్; ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/ఐసెట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. 
వివరాలకు: www.nithm.ac.in
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-
కొచ్చిన్.
కోర్సు: ఎంబీఏ(ట్రావెల్ అండ్ టూరిజం)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్; ప్రవేశం: క్యాట్/వర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ ఆధారంగా.
వివరాలకు: www.cusat.nic.in
ఇగ్నో-న్యూఢిల్లీ డిస్టెన్స్ విధానంలో ఎంఏ(టూరిజం అండ్ మేనేజ్‌మెంట్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీటీఎస్/బీహెచ్‌ఎం/బీఏ(టూరిజం)/ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో టూరిజంలో డిప్లొమా ఉండాలి.
వివరాలకు: www.ignou.ac.in

No comments:

Post a Comment