సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్), కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్టుల్లో టీ చింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా, పరిశోధనలు చేస్తూ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకున్నా రాయాల్సిన పరీక్ష యూజీసీ-నెట్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే లెక్చరర్‌షిప్‌కు, జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో యూజీసీ - నెట్ 2012పై ప్రత్యేక ఫోకస్..
ఏడాదిలో రెండుసార్లు (జూన్, డిసెంబర్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవాళ్లు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు/కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు అర్హులు అవుతారు.
అర్హత: హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్‌తో కలిపి), సోషల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్టుల్లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలు,శారీరక వికలాంగులు 50శాతం) మార్కులతో పీజీ ఉత్తీర్ణత. పీజీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులూ అర్హులే.
వయోపరిమితి:
జేఆర్‌ఎఫ్ కోసం: జూన్ 1, 2012 నాటికి 28 ఏళ్లు మించరాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులు, మహిళలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లె క్చరర్‌షిప్ కోసం: ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం:
పరీక్ష రెండు సెషన్‌లుగా ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం (మొదటి రెండు పేపర్లు), రెండో సెషన్ మధ్యాహ్నం (మూడో పేపర్) ఉంటుంది. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. అవి..
పేపర్-1: అభ్యర్థి టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఎబిలిటీని అంచనా వేసేలా ప్రశ్నలు ఉంటాయి.
రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్‌లపై మొత్తం 60 మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిల్లో ఏవైనా 50 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 50 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరుగుతుంది.
పేపర్-2: ఈ పేపర్‌లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై 50 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష ఉదయం 10.45 నుంచి 12.00 వరకు ఉంటుంది.
పేపర్-3: అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుపై 75 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి.అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులుంటాయి. పరీక్ష మధ్యాహ్నం 1.30 నుంచి 4.00 గంటల వరకు జరుగుతుంది.
కటాఫ్ మార్కులు:
జనరల్ అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లలో 40 శాతం మార్కులు, పేపర్-3లో 50 శాతం మార్కులు, ఓబీసీ (నాన్-క్రిమిలేయర్), ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు పేపర్-1, పేపర్-2లో 35 శాతం మార్కులు సాధించి ఉండాలి. పేపర్-3లో ఓబీసీ (నాన్-క్రిమిలేయర్) అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ/ఎస్టీలు/శారీరక వికలాంగులు 40 శాతం మార్కులు పొంది ఉండాలి.
మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి, ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012
పరీక్ష తేదీ: జూన్ 24, 2012
వెబ్‌సైట్: http://ugcnetonline.in/
No comments:
Post a Comment