బీఎస్సీ(మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బోటనీ) చేశాను. మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలలో ఏ కోర్సుకు అవకాశాలుంటాయి? - లావణ్య కుమార్, తిరుపతి.
మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ రెండింటిలోను మంచి అవకాశాలుంటాయి. అయితే మైక్రోబయాలజీ అనేది స్పెషలైజ్డ్ కోర్సు కావడంతో ఈ కోర్సు చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న రంగాల్లో మైక్రోబయాలజీ ఒకటి. మైక్రోబయాలజిస్ట్‌లు వ్యాధులు, వాటి కారణాలు, నివారణకు ఉపయోగించే ఔషధాలు వంటి అంశాలపై తమ పరిశోధనలు సాగిస్తుంటారు. మైక్రోబయాలజీలో పీజీ చేసిన తర్వాత మీకిష్టమైన అంశంలో షార్ట్‌టర్మ్ కోర్సు లేదా అందుకు సంబంధించిన శిక్షణను తీసుకోవచ్చు. పరిశోధన రంగంలోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ కోర్సు చేసిన వారికి వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్లు, రీసెర్చ్ లేబొరేటరీల్లో అవకాశాలుంటాయి. కెమిస్ట్రీ విషయానికొస్తే..ఇందులో అవకాశాలు కొంత పరిమితం. ఈ అంశంలో మాస్టర్/ పీహెచ్‌డీ చేసిన వారికి ఫార్మసీ కంపెనీలు, లేబొరేటరీల్లో విరివిగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా విద్యా సంస్థల్లో లెక్చరర్‌గా పని చేసే అవకాశం కూడా ఉంటుంది. మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మాస్టర్/ పీహెచ్‌డీ స్థాయిల్లో కెమిస్ట్రీని అందిస్తున్నాయి. ఆయా వర్సిటీ లు నిర్వహించే పరీక్షల ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.
ఎంబీఏ(టెలికాం) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి? -సలీమ్, కర్నూల్.
ఇటీవల కాలంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సులో నూతనంగా ప్రవేశపెట్టిన స్పెషలైజేషన్స్‌లో టెలికాం మేనేజ్‌మెంట్ ఒకటి. దేశంలో ప్రస్తుతం టెలికాం రంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో ఈ కోర్సు చేసిన వారికి అవకాశాల పరంగా మంచి డిమాండ్ ఉంటోంది.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
భారతి స్కూల్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్- ఐఐటీ, ఢిల్లీ.
కోర్సు: ఎంబీఏ(టెలికాం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్)
అర్హత: బీఈ/బీటెక్/బీఆర్క్/బీఫార్మసీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్/కామర్స్/ఎకనామిక్స్ సంబంధిత బ్రాంచ్‌లలో)
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్: http://bsttm.iitd.ac.in
సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్‌మెంట్-పుణే
కోర్సు: ఎంబీఏ-టెలికాం(సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్/మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లుగా)
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్
ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్: www.sitm.ac.in
అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్-నోయిడా
కోర్సు: ఎంబీఏ(టెలీకమ్యూనికేషన్స్)
అర్హత: బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ఐటీ)
ఎంపిక: క్యాట్/మ్యాట్/జీమ్యాట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్: www.amity.edu
బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు వివరాలను తెలపండి?
-ప్రవీణ్, కమర్‌పల్లి.
బీఎస్సీ (అగ్రికల్చర్)కోర్సులో... ఆగ్రానమీ, హార్టికల్చర్, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, సారుుల్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, యూనిమల్ హజ్బెండరీలు ప్రధాన సబ్జెక్టులు. వీటి తోపాటు హ్యుమానిటీస్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ వంటి ప్రాథ మిక సబ్జెక్టుల బోధన కూడా తప్పనిసరి. కోర్సులో చేరిన విద్యా ర్థి... విత్తనోత్పత్తి, కొత్త పద్ధతుల ఆవిష్కరణ, చీడపీడల గుర్తింపు, నివారణ మార్గాలు కనుగొనడం, అగ్రికల్చరల్ మార్కె టింగ్, విత్తనాభివృద్ధి వంటి అంశాల్లో పూర్తిస్థారుు నైపుణ్యం సాధించేలా బోధన జరుగుతుంది. నాలుగేళ్లపాటు 8 సెమిస్టర్ల విధానంలో సాగే ఈ కోర్సులో.. మొదటి సెమిస్టర్ మినహా రుుస్తే.. మిగతాదంతా ప్రాక్టికల్ ఓరియెంటెడ్.
అందువల్ల విద్యార్థులు ఆ కోణంలో క్షేత్రస్థారుు పరిశీలనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ఏజీ బీఎస్సీ ఉత్తీర్ణులకు ఇటు ప్రభుత్వ.. అటు ప్రైవేట్ రంగాల్లో పలు అవకాశాలు లభిస్తారుు. ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల్లో ఈ విద్యార్థులదే హవా. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు పెరుగుతున్నారుు. ర్యాలీస్, మోన్‌శాంటో, ఐటీసీ, ఆంధ్రా బ్యాంక్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు కూడా ఏజీ బీఎస్సీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంట్తున్నారుు. కేవలం బ్యాచ్‌లర్ డిగ్రీకే పరిమితంగా కాకుండా... పీజీ కూడా చదివితే అవకాశాలు మరింత విసృ్తతమవుతారుు. క్రాప్ ప్రొడ క్షన్, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ తదితర విభాగాల్లో పీజీ చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయూలనుకుంటే... ఎంబీఏ (అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్) చదవాలి. దానివల్ల సొంతంగా యూనిట్‌లు ప్రారంభించే నైపుణ్యం వస్తుంది.
No comments:
Post a Comment