ఎస్.ఐ.ఆఫ్ పోలీస్ పరీక్ష రాసే అభ్యర్థులు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ పేపర్లతో పాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లలో కనీస అర్హత మార్కులు సాధించాలి. పరీక్షలో అర్హత సాధించడానికే కాకుండా, ఎస్సైగా ఎన్నికైన అభ్యర్థులకు ఉత్తర ప్రత్యుత్తరాల నిర్వహణకు తెలుగు భాషా ప్రావీణ్యం అనివార్యం. అందువల్ల తెలుగు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి.
సిలబస్ విశ్లేషణ
తెలుగు పేపర్ 100 మార్కులకు ఉంటుంది. కింది భాషా నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
1. లేఖారచన (లెటర్ రైటింగ్)
2. పేరాగ్రాఫ్ రైటింగ్
3. అనువాదం(ట్రాన్‌సలేషన్)
4. కాంప్రహెన్షన్ రైటింగ్
5. వ్యాసరచన (ఎస్సే రైటింగ్)
6. నివేదికా రచన (రిపోర్‌ట రైటింగ్)
7. {పెసీ రైటింగ్ (సంక్షిప్తీకరణ)
మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో తెలుగు సాహిత్య, వ్యాకర ణాంశాలు ఉండవు.
అభ్యర్థులు గమనించాల్సిన ప్రధానాంశాలు :
సమాధానాలు ప్రామాణికమైన వాడుక భాషలో రాయాలి.
అభ్యర్థులకు డిగ్రీ స్థాయి వరకు చదివిన తెలుగుభాషా ప్రావీణ్యం సరి పోతుంది.
తెలుగుపేపరు కేవలం అర్హత పరీక్షకేనని నిర్లక్ష్యం చేస్తే, మిగిలిన పేపర్లలో మంచి మార్కులొచ్చినా, ఉద్యోగం పొందలేరు.
వ్యాసరచన (ఎస్సే రైటింగ్) :
వ్యాసం అంటే విస్తరించి, వివరించి రాసే దని అర్థం. వ్యాసరచన సులువుగా అని పిస్తుంది. కానీ కష్టసాధ్యమైంది. వ్యాసరచన ద్వారా అభ్యర్థి ఆలోచనా శక్తి, ప్రతిభను అంచనా వేయటానికి వీలవుతుంది.
వ్యాసరచనకు ఇచ్చిన అంశాన్ని క్రమ పద్ధతిలో విశ్లేషించాలి. ఉపోద్ఘాతం, నిర్వచనం పేరాల వారీ విషయ వివరణ, లాభ నష్టాలు, పరిష్కారానికి సూచనలు, ఆకర్షణీయ శైలి, సమీక్షాత్మకమైన ముగింపు వ్యాసానికి ప్రధానంగా ఉండాలి.
ప్రముఖ ఆంగ్ల విమర్శకుల మాటలు అక్షరసత్యాలు.
'Brevity and clarity are very Important in Essay Writing But brevity should not be achieved at the cost of clarity'. సంక్షిప్తత, స్పష్టత వ్యాసరచనలో ప్రధాన అంశాలు. సంక్షిప్తత కోసం స్పష్టత పరిత్యజించడం తగదు.
సంక్షిప్తత, స్పష్టతలు సాధించగలిగే వ్యాసరచన కళాత్మకమైందే. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఇచ్చిన ప్రశ్నను విశ్లేషించి రాయాలి. వ్యాసరచనకు 15 మార్కు లుంటాయి. ఇందులో రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి.
వ్యాసరచనకు ఇవ్వదగిన అంశాలు:
1. స్త్రీలు - భారత రాజ్యాంగం
2. జలయజ్ఞం
3. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర
4. భారతదేశం- మతకలహాలు
5. విద్యాసంస్థల్లో ర్యాగింగ్
6. పర్యావరణ పరిరక్షణ
7. సమాజంలో విస్తరిస్తున్న అవినీతి మొదలైనవి ప్రధానమైనవి.
లేఖారచన (లెటర్ రైటింగ్)
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు తెలుగులో లేఖారచన పరీక్షల్లో ముఖ్యాంశంగా ఉంటుంది. వివిధ పోటీ పరీక్షల్లో కూడా పరీక్ష స్థాయిని బట్టి విధిగా లేఖా రచన ఉంటుంది. లేఖారచన నియమాలు ఇతర పరీక్షల్లో మాదిరి ఈ పరీక్షలో కూడా అభ్యర్థులు పాటించాలి.
లేఖా నియమాలు ...తేదీ, స్థలం, సంబోధన, ముగింపు వంటివి జాగ్రత్తగా పాటించాలి. తేదీ తర్వాత ఫుల్‌స్టాప్ (చుక్క) స్థలం తర్వాత కామావంటి సాంకేతికాంశాలు పాటించడం ముఖ్యం, అధికార్లకు, స్నేహితులకు, బంధు వులకు రాసేటప్పుడు సంబోధించాల్సిన పద్ధతులు, ముగించాల్సిన పద్ధతులుతెలుసు కోవడం కీలకం. లేఖలో విషయానికే ప్రాధాన్యమివ్వాలి. ఉపోద్ఘాతాలు, అనవసర విషయాలు ప్రస్తావించకుండా చూసుకోవాలి. లేఖారచనకు 15 మార్కులుంటాయి.
రాదగిన ప్రశ్నలు:
1. మంబై పేలుళ్ల నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రించాలని కోరుతూ పత్రికా సంపాదకుడికి లేఖ.
2. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని తక్షణం కాపాడాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ మిత్రుడికి లేఖ.
3. మారుతున్న వ్యవస్థలో పోలీస్ సంస్కరణల గురించి పత్రికా సంపాదకుడికి లేఖ.
4. మీ ప్రాంతంలో దోమల బెడద నివా రణ గురించి మున్సిపల్ కమిషనర్‌కు లేఖ.
5. మీ పట్టణంలో శాంతిభద్రలపై జిల్లా పోలీస్ అధికారికి లేఖ.
పేరాగ్రాఫ్ రైటింగ్
సామెతలు, సూక్తులు వంటి వాటిని లేదా సంస్కృతికి సంబం ధించి ఇచ్చిన రెండు అంశాల్లో ఒకదాన్ని గురించి వివరంగా ఔచిత్యమైన ఉల్లేఖనాలతో (కొటేషన్లు) ఆకర్షణీయమైన శైలిలో రాయాలి. ఈ ప్రశ్న సంతృప్తికరంగా రాయాలంటే సమగ్ర విషయ పరిజ్ఞానం అవసరం. సంక్షిప్తం, స్పష్టంగా రాయడం ముఖ్యం. ఈ ప్రశ్నకు సమాధానం రాయడం కష్టమైనప్పటికీ అభ్యాసంతో సులువుగానే రాయొచ్చు. ఈ అంశానికి 15 మార్కులు ఉంటాయి.
రాదగిన ప్రశ్నలు:
1. అందమే ఆనందం
2. శాంతం సముద్రం కంటే గొప్పది
3. నిదానమే ప్రధానం
4. ఆరోగ్యమే మహాభాగ్యం
5. మానవసేవే మాధవసేవ
అనువాదం (ట్రాన్‌సలేషన్):
అనువాదంలో అభ్యర్థికి మూలభాష, లక్ష్య భాషల్లో సామర్థ్యం ఉండాలి. తెలుగు పేపర్‌లో ఇచ్చిన అంశాన్ని ఇంగ్లిష్‌లోకి మార్చమంటారు. ఇంగ్లిష్ పేరాని తెలుగులోని అనువదించమంటారు. అభ్యర్థికి అనువాదం కొంచెం కష్టమే. తెలుగు పదాలకు సమానార్థకాలైన ఆంగ్ల పదాలు తెలిసి ఉండాలి.
వాటిని సరైన వాక్యక్రమంలో అమర్చగలగాలి. ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం, వ్యాకరణంపై అవగాహన ఉండాలి. తెలుగులో ఉన్న జాతీయాలకు ఇంగ్లిష్‌లో సమానార్థకాలైన ప్రోవెర్‌బ, ఇడియమ్స్ తెలుసుకోవాలి. కొన్ని తెలుగు పేరాలను తీసుకొని ఆంగ్లంలోకి అనువదించే అభ్యాసం చేయాలి.
అనువాదానికి సూచనలు: తెలుగులో ఉన్న కర్త్రర్థక (Active Voice) వాక్యాలను సందర్భాన్ని అనుసరించి ఇంగ్లిష్‌లో కర్మార్థక (Passive Voice) గా రాయాలి.
తెలుగులో ఉన్న చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లిష్‌లో సంయుక్త లేదా సంశ్లిష్ట వాక్యాలుగా సందర్భానుసారం మార్చి రాయాలి.
అందని ద్రాక్ష పుల్లన’ వంటి సామెతలను సమానార్థక ఆంగ్ల సామెత Gra-pes are sour గా రాయాలి. అనువాదానికి 15 మార్కులుంటాయి.
నివేదిక రచన (రిపోర్‌ట రైటింగ్)
సమాజంలో సమస్యాత్మక సంఘటనల వివరణే నివేదిక రచన. స్పష్టంగా, సూటిగా విషయాన్ని వివరించండం ప్రధానం. అభ్యర్థుల రచనా శక్తిని నిశితంగా పరీక్షించే అంశం నివేదిక రచన. ఇచ్చిన ప్రశ్న అనుసరించి సమస్య పూర్వాపరాలు గణాంకాలతోసహా వివరిం చడం అవసరం. నివేదిక రచనలో ఆకర్షణీయ శీర్షిక, సంఘటనను అనుసరించి రాయడం బాగుంటుంది. ఈ ప్రశ్నకు 15 మార్కులుంటాయి.
అడగదగిన అంశాలు:
1. కరువుతో దెబ్బతిన్న రైతుల సంక్షేమం
2. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు
3. యువతీ యువకుల ఆత్మహత్యలు
4. గృహహింస
5. వరకట్న చావులు
6. దేశ రక్షణ- భద్రత
7. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు
మొదలైన అంశాలు ప్రధానమైనవి. వీటిని వ్యాసంలా కాకుండా గణాంకాలు, వాస్తవ సంఘటనలు, ఉదాహరణలతో వివరిస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు.
సంక్షిప్తీకరణ- (ప్రెసీ రైటింగ్)
పరీక్షలో ఇచ్చిన పేరాగ్రాఫ్‌ని ముఖ్యమైన అంశాలు, సొంత మాటలతో సంక్షిప్తీకరించి రాయమంటారు. రాత నైపుణ్యాలకు సంబంధించిన అంశాల్లో ఇదొకటి. అభ్యర్థులు స్పష్టంగా, సంక్షిప్తంగా ఇచ్చిన అంశాన్ని జాగ్రత్తగా రెండు మూడు సార్లు చదివి మూడో వంతుకు కుదించి రాయాలి.
పేరాలో మాటలు యధాతథంగా రాయకూడదు.
ముఖ్యమైన అంశాలను సొంతమాటలతో కుదించి రాయాలి.
కుదించడంకోసం స్పష్టత లేకుండా అస్పష్టంగా రాయకూడదు.
సంక్షిప్తతతో పాటు స్పష్టత పాటించాలి.
ఇచ్చిన పేరాకు మంచి టైటిల్ రాయడం అవసరం.
ఈ ప్రశ్నకు 15 మార్కులుంటాయి. అభ్యాసంతో ఈ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు.
కాంప్రహెన్షన్ పాసేజీ:
కాంప్రహెన్స్‌డ్ అంటే అర్థం చేసుకోవడం లేదా అవగాహనా సామర్థ్యం అని అర్థం. ఇది అభ్యర్థి అవగాహనా సామర్థ్యానికి పెట్టే పరీక్ష. పరీక్షలో ఇచ్చిన పెద్ద పేరాగ్రాఫ్ చదివి, దాని కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ అంశం ప్రతిపోటీ పరీక్షలో పరీక్ష స్థాయిని బట్టి విధిగా ఉంటుంది.
కొంచెం జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు పేరాని చదివితే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయొచ్చు. ఈ ప్రశ్నలో రెండు పేరాలిచ్చి ఒక్కోదాని కింద 5 ప్రశ్నలిస్తారు. దీనికి చాయిస్ లేదు. 10 ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. మొత్తం పది మార్కులకు ఈ విభాగంలో ప్రశ్నలడుగుతారు.
No comments:
Post a Comment