మెడిసిన్
‘వైద్యో నారాయణో హరీ’ అన్నారు. అంటే వైద్యం అందించే డాక్టర్ దేవుడితో సమానం. ఇంతటి బాధ్యతాయుతమైన వృత్తిలో అడుగుపెడితే ఆపదల్లో ఉన్న ఎన్నో ప్రాణాలకు ఊపిరి పోశామన్న సంతృప్తితోపాటు అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది. ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఎంబీబీఎస్ చేయడానికి అర్హు లు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం 5450 సీట్లకు పోటీపడే విద్యార్థుల సంఖ్య లక్షకుపైగా ఉంటుంది. ఎంసెట్-2013 మెడికల్ విభాగంలో పోటీపడే విద్యార్థుల సంఖ్య ఇప్పటికే లక్ష దాటిపోయింది. ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హాట్ ఫేవరెట్ కోర్సుల్లో ఒకటైన మెడిసిన్ కోర్సు, కెరీర్ వివరాలు..
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
వ్యవధి: ఐదున్నరేళ్లు
మన రాష్ట్రంలో ప్రవేశం: ఎంసెట్ ద్వారా. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా తెరమీదికొచ్చిన నీట్ ద్వారా కూడా ప్రవేశాలు జరిగే వీలుంది. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పుకనుగుణంగా ప్రవేశాలపై నిర్ణయం తీసుకొంటారు.
జాతీయస్థాయిలో ప్రముఖ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్:
నీట్; జిప్‌మర్ (పాండిచ్చేరి), క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (వెల్లూరు), ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (పుణె), బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యా పీఠం, డీవై పాటిల్, మణిపాల్ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్- వార్ధా నిర్వహించే మెడికల్ ప్రవేశ పరీక్షలు.
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి, మార్చి
కావల్సిన స్కిల్స్: ఓర్పు, సహనం, నిరంతర అధ్యయనం, సేవ చేసే గుణం, చేసే పని పట్ల నిబద్ధత, అంకిత భావం.
ఉన్నత విద్య: ఎంబీబీఎస్ కోర్సును పూర్తిచేసినవారు పీజీ/డిప్లొమా/ఎండీ/సూపర్ స్పెషాలిటీ వంటి కో ర్సులు చదవొచ్చు. పీజీలో ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, సైకియాట్రీ, అనస్థీషియా మొదలైనవి. దేశంలో పలు వర్సిటీలు ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.
కెరీర్ :
ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులు దేశమంతటా విస్తరిస్తున్నాయి. ఇవి కూడా ఎంబీబీఎస్ విద్యార్థులకు భారీ జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. అందులోనూ మనదేశంలో ప్రతి లక్ష మంది ప్రజలకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ చేసినవిద్యార్థులకు అపార అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 కెరీర్స్‌లో ఎంబీబీఎస్ ఒకటి. రోజురోజుకు విస్తృతమవుతోన్న వ్యాధులు వైద్య రంగానికి సవాళ్లు విసురుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు సరిపోయినంతమంది డాక్టర్లు మనదేశంలో లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరో వైపు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ)తోపాటు వివిధ కార్పొరేట్ సంస్థలు నెలకొల్పిన స్వచ్ఛంధ సంస్థల్లో వీరికి అవకాశాలుంటాయి. అదేవిధంగా యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించొచ్చు. ఆర్థిక స్థోమత ఉన్నవారు సొంతంగాహాస్పిటల్ పెట్టుకునిప్రాక్టీస్ చేయొచ్చు.
వెబ్‌సైట్: 119.226.159.184
పీజీకి ప్రాధాన్యమివ్వాలి
రాష్ట్రంలో 14 ప్రభుత్వ, 27 ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 5450 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే విద్యా సంవత్సరంలో మరో నాలుగైదు కొత్త కళాశాలలు అందుబాటులోకి వ చ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, రంగరాయ మెడికల్ కళాశాలల్లో అదనంగా 50 సీట్లు చొప్పున పెరిగే అవకాశం ఉంది. ఇక... వైద్య వృత్తిలో రాణించాలనుకునేవారు ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌తోనే సరిపెట్టుకోకుండా పీజీ చేయడానికి ప్రాధాన్యమివ్వాలి. వాస్తవానికి వైద్య విద్యారంగంలో పీజీ మేజర్ టర్నింగ్ పాయింట్. ఎంబీబీఎస్ విద్యార్థులకు భవిష్యత్తుపరంగా మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవి స్వదేశంలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో స్థిరపడడం, రెండు ప్రభుత్వ సర్వీస్‌లో చేరడం, మూడోది పీజీ కోర్సులో అడుగుపెట్టడం. ఈ మూడింటిలో పీజీలో చేరడమే అభిలషణీయం. విదేశాల్లో ఉన్నతవైద్య విద్యలో చేరాలనుకునే వారికి ప్రధానంగా అమెరికా, యూకేలు లక్ష్యంగా ఉంటున్నాయి. వృత్తి సంతృప్తి ఆశించేవారు పీజీ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరొచ్చు.
వెటర్నరీ సైన్స్
ప్రపంచంలోనే అత్యధిక పశుసంపద కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. పశు ఉత్పత్తులపై వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. దేశ జనాభాలో ఎక్కువ శాతం మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో పరిజ్ఞానం కలిగిన నిష్ణాతుల అవసరం పెద్ద ఎత్తున ఏర్పడుతోంది. మన రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీలో పాలిటెక్నిక్, బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సులను అందిస్తోంది.
కోర్సు: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ వ్యవధి: ఐదేళ్లు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ప్రవేశం:ఎంసెట్ ద్వారా
సీట్ల సంఖ్య: 5 కాలేజీల్లో మొత్తం 300 సీట్లున్నాయి.
ఉద్యోగావకాశాలు: పౌల్ట్రీ, యానిమల్ ప్రొడక్ట్స్ రంగం ఎన్నడూ లేనంతగా విస్తరిస్తుండటంతో... ఈ కోర్సులను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం. ఫౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపక కేంద్రాల్లో కెరీర్ ప్రారంభించవచ్చు. పీహెచ్‌డీ చేస్తే వివిధ కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేయొచ్చు.
వెబ్‌సైట్: www.svvu.edu.in
ఎంబీబీఎస్ తర్వాత బీవీఎస్సీనే
ప్రస్తుతం విద్యార్థులు ఎంబీబీఎస్ తర్వాత ప్రాధాన్యమిస్తున్న కోర్సు బీవీఎస్సీ. రాష్ట్రంలో మొత్తం అయిదు కళాశాలల్లో 300 సీట్లు ఉన్నాయి. ఉన్నత విద్య పరంగా ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ చేస్తే మరింత ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీతోనే రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో వైద్యులుగా చేరొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా అడుగుపెట్టొచ్చు. కేంద్ర రక్షణ శాఖలో రిమోట్ వెటర్నరీ కార్ప్స్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. సొంతంగా కెనైన్ ప్రాక్టీస్ క్లినిక్స్ నెలకొల్పుకోవచ్చు. ఇక ప్రైవేటు రంగంలో పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫారాలు, ఫీడ్ ఇండస్ట్రీల్లో స్థిరపడొచ్చు. ప్రారంభంలో కనీసం రూ.25 వేల - రూ.30 వేల వేతనం గ్యారెంటీ. విదేశీ విద్యకు జీఆర్‌ఈ, టోఫెల్‌ల్లో ఉత్తీర్ణులై ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎంవీఎస్సీ చేసేందుకు పలు మార్గాలున్నాయి.
ఫార్మసీ
ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఫార్మసీ ఒక టి. విస్తృత అవకాశాలకు నెలవుగా మారిన ఈ రంగం లో ప్రవేశించడానికి డీఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మ్.డి వం టి కోర్సులను చదవాలి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఫార్మ్.డి, బీఫార్మసీ కోర్సుల్లో, ఇంటర్ మార్కుల ఆధారంగా డీఫార్మసీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
బీ ఫార్మసీ: కోర్సు కాలవ్యవధి: నాలుగేళ్లు
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ/ఎంపీసీ.
సీట్ల సంఖ్య: 280 కాలేజీల్లో దాదాపు 25000.
డాక్టర్ ఇన్ ఫార్మసీ (ఫార్మ్‌డీ): డి.ఫార్మసీ, బి.ఫార్మసీ కోర్సులు అందుబాటులో ఉండగా... కొత్తగా ఫార్మ్‌డీ అవసరం ఏంటి? దీనికున్న ప్రత్యేకత, ప్రాధాన్యతలు ఏంటి? అనేది చాలా మందికి కలిగే సందేహం. మన దేశంలో ఫార్మసీ విద్య ఎక్కువగా థియరీ బేస్డ్. అంటే.. థియరీ ఎక్కువ..ప్రాక్టికల్స్ తక్కువ. దాంతో అభ్యర్థులకు ప్రాక్టికల్ అనుభవం ఉండకపోవడంతో ఫార్మా రంగంలో ప్రొడక్ట్ లేదా ఫార్ములేషన్ అసిస్టెంట్లుగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలికి, ఫార్మసిస్ట్‌లను డాక్టర్లకు దీటుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఫార్మ్‌డీ కోర్సుకు అంకురార్పణ జరిగింది. రోగికి ఇచ్చే మందుల్లో ఏముంది? ఏ డోస్ ప్రకారం వేసుకోవాలి? ఆ మందులు వేసుకోవాల్సిన అవసరం రోగికి నిజంగా ఉందా? ప్రత్యామ్నాయంగా తక్కువ సైడ్ ఎఫెక్ట్‌తో దొరికే మందేమైనా ఉందా? ఇవన్నీ ఫార్మ్‌డీ కోర్సులో తెలుసుకునేలా ఉంటాయి. రోగి వివరాలు పొందుపర్చడం, ఆహార నియమాలు తెలపడం, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఫార్మ్‌డీ డాక్టర్ల విధుల్లో భాగమే.
వ్యవధి: ఆరేళ్లు.
అర్హత: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 14 కాలేజీల్లో మొత్తం 400.
అవకాశాలు అనేకం: దేశంలో ఫార్మసీ పట్టభద్రులకు సమీప భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఫార్మసీ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరగడం, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు ఊపందుకోవడమే ఇందుకు కారణం. ప్రారంభంలోనే నెలకు రూ.15 వేల జీతంతో కెరీర్ ప్రారంభించవచ్చు. అటు బోధన రంగంలోనూ లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా ప్రభుత్వ విభాగాల్లో స్థిరపడేందుకు ఎంఫార్మసీ, పీహెచ్‌డీలు తోడ్పడతారుు. ఇక.. స్వయం ఉపాధి దిశగా కూడా పలు మార్గాలున్నారుు. సొంతంగా ఫార్మా టెస్టింగ్ ల్యాబ్‌లు, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొని డయూగ్నస్టిక్ సెంటర్లు నెలకొల్పవచ్చు. ఫార్మ్‌డీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలం. కేవలం ఆస్పత్రుల్లోనే కాకుండా.. క్లినికల్ రీసెర్చి సంస్థలు, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి.
ఎంపీసీ.. బైపీసీ ఇద్దరికీ అవకాశం కల్పించే బీ ఫార్మసీ
ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు 280 బీఫార్మసీ కళాశాలల్లో దాదాపు 25 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తి చేసిన వారికి ఫార్మాస్యుటికల్ సంస్థల్లో అనలిటికల్ కెమిస్ట్, క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి వంటి ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేస్తే అధ్యాపకులుగా, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా అవకాశాలు అందుకోవచ్చు. బీఫార్మసీ విద్యార్థులకు విదేశాల్లోనూ ముఖ్యంగా యూకే, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అయితే కేవలం కోర్సు, కెరీర్ కోణంలో కాకుండా మంచి కాలేజీలో చేరాలి.
ఆయుర్వేద
వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఎంబీబీఎస్ తర్వాత మరో ప్రత్యామ్నాయం... బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్).
మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా బీఏఎంఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 14 కాలేజీల్లో మొత్తం 400.
ఉన్నత విద్య: బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థారుులో ఎండీ (ఆయుర్వేద), ఎంఎస్ (ఆయుర్వేద) కోర్సులు చదివే అవకాశముంది. పీజీలో కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), శల్యతంత్ర (జనరల్ సర్జరీ),ఆయుర్వేద సంహిత (ఆయుర్వేదిక్ క్లాసిక్) తదితర విభాగాలు అందుబాటులో ఉన్నారుు.
జాబ్స్:
ఉద్యోగాలపరంగానూ బీఏఎంఎస్ అభ్యర్థులకు అవకాశాలు బాగానే ఉన్నారుు. ప్రభుత్వ విభాగంలో మెడికల్ ఆఫీసర్ హోదాలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఆయుర్వేద ఔషధ తయూరీ సంస్థలు(చరక్, డాబర్, హిమాలయ తదితర) కూడా అవకాశాలు కల్పిస్తున్నారుు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోనూ అవకాశాలు లభిస్తున్నారుు. అరుుతే, అక్కడ హెర్బల్ మెడిసిన్ పేరుతో సేవలు అందిస్తున్నారు. కళాశాలల్లో లెక్చరర్ గా కూడా కెరీర్ ప్రారంభించవచ్చు.
వెబ్‌సైట్: 119.226.159.184
హోమియోపతి
ఎంబీబీఎస్, బీడీఎస్ తర్వాత ఎక్కువమంది విద్యార్థులు ఎంపిక చేసుకొనే కోర్సు.. బీహెచ్‌ఎంఎస్. ఇటీవల ఈ కోర్సు పూర్తి చేసినవారికి అవకాశాలు మెరుగుపడటం, సామాన్యులకు సైతం ఫీజులు అందుబాటులో ఉండటంతో దీనిపై ఆదరణ పెరుగుతోంది.
మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా బీహెచ్‌ఎంఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు.
అర్హత: ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
సీట్ల సంఖ్య: 6 కాలేజీల్లో మొత్తం 280.
కోర్సు స్వరూపం: ఐదున్నరేళ్ల బీహెచ్‌ఎంఎస్ కోర్సు లో... ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ చేయూలి. ఎంబీబీఎస్‌లో మాదిరిగానే హోమియోపతిలో కూడా అనాటమీ, ఫిజియూలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ తదితర సబ్జెక్టులుంటారుు. అరుుతే, వాటితోపాటు అదనంగా ప్రతి ఏటా హోమియోపతికి సంబంధించి మెటీరియా మెడికా, ఫిలాసఫీ, హోమియోపతి ఫార్మసీ సబ్జెక్ట్‌లుంటారుు.
ఉన్నత విద్య: ఉన్నత చదువులు చదవాలనుకున్నవారు ఎండీ హోమియోపతి చేయొచ్చు. విదేశాల్లో ఉన్నత చదువులు అందుబాటులో లేవు. అక్కడ హోమియోపతిని స్పెషల్ కోర్సుగా పరిగణిస్తారు. పీజీలో ప్రస్తుతం మెటీరియూ మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ కోర్సులు ఉన్నారుు.
అవకాశాలు:
హోమియోపతి కోర్సు చేసిన విద్యార్థులకు ఇటీవల అవకాశాలు పెరుగుతున్నారుు. ఈ కోర్సు చేసినవారికి కార్పొరేట్ హాస్పటల్స్‌లోను అవకాశాలు లభిస్తున్నారుు. అలాగే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ప్రాక్టికల్ నాలెడ్జ్, రోగాన్ని త్వరగా నయంచేసే నైపుణ్యం ఉన్నవారు ప్రాక్టీసులో బాగా రాణించవచ్చు.
వెబ్‌సైట్: 119.226.159.184
No comments:
Post a Comment